Tuesday, October 16, 2012

అందుకే ఆటలు ఆడదాం మనమంతా నూరేళ్ళు ...



ఆడటం ఆపేసావా ఆగిపోతుంది ఆనందం

సుఖానికి లొంగిపోయావా పనిచేయదు నీ శరీరం ..

దేవుడు తయారు చేసిన ఈ యంత్రం ఒక మంత్రం ...

దానికి మందు మాత్రం ప్రతి రోజూ ఆటల యజ్ఞం ..

ఆట మనిషి జీవితానికి ఒక నిరంతర జ్యోతి

ఆడటం ఆపేస్తే ప్రవహించదు ప్రాణ శక్తి...

తెలుసుకొని పాటిస్తున్నమీరంతా యోగులు ...

అర్ధం చేసుకోలేక ఇంటిలో కూర్చున్న వాళ్ళంతా రోగులు ..



అందుకే ఆటలు ఆడదాం మనమంతా నూరేళ్ళు ...

Friday, September 21, 2012

అది అండమాను ద్వీపం..చూశాను నేనొక పుణ్యక్షేత్రం

అది అండమాను ద్వీపం..చూశాను నేనొక పుణ్యక్షేత్రం

మన దేశానికి పట్టిన దెయ్యాలను తోలిన దేవుళ్ళ నివాసం

బ్రిటిషు బకాసురులు చేసిన విఫల ప్రయత్నం

చిత్ర విచిత్ర చిత్ర హింసల పర్వం..ఓర్చుకొని గెలిచిన వీరాది వీరుల సమూహం ..

ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది రక్త తర్పణం ..

వింటుంటే ఊగి పోయింది నా శరీరం..చూస్తుంటే చలించిపోయింది నా దేహం

వారి కష్టాలకు కన్నీరు మున్నీరయింది నా హృదయం..ఆ త్యాగధనులను శ్లాగిస్తూ సాగింది నా కలం..



ఎన్ని పాట్లు పడ్డారు ...ఎంత యాతన పెట్టారు..అది జయిలా కాదు కాదు కర్కోటక నరకం ..

దాని పధకమే భయానకం..అది ఆ పాలకుల నీచ కృత్యాలకు నిదర్శనం..



ఆ ఆంగ్ల పిశాచాలు చేయని అకృత్యము లేదు..కనిపెట్టని హింస పద్దతులు లేవు

వారు నేరస్తులా వారిని ఆ రీతిలో హింశించటం అవసరమా ..

అడిగే వారె లేరు...అరణ్య రోధనయింది ఆ మహానుభావుల వేదన ..



ఒక్క జై! చాలు బ్రిటిష్ వారికి వారి నోటి నుండి.. ఒక్క ఆలోచన చాలు నాకెందుకని..

వదలి వేసి ఉండేవారు వారిని బ్రిటిషువారు...గడప గలిగే వారు ఆనందకరమైన జీవితాన్ని...


కదల లేదు వారి కార్య దీక్ష..నిరంతరం ప్రవహించింది వారి స్వతంత్ర కాంక్ష ..

బహుశా ఏ దేశములో పుట్టి ఉండరేమో ఇటువంటి త్యాగ మూర్తులు ..

ఏ నేల పై జీవించి ఉండరేమో ఇలాంటి నిజమైన నాయకులు ..



ఎందుకోసం చేసారు వారు..ఎటువంటి భావి భారతం కోసం కలలు కన్నారు వారు ..

మనం వారి వారసులమే కదా .. ఏమయి పోయింది మనలో ఆ అకుంటిత దీక్ష ..

ఎక్కడ పాతుకు పోయింది ఆ మహానుభావుల ఉద్రేకం ..

ఏ మూల కూరుకు పోయింది ఆ త్యాగధనుల సేవా భావం..



ఎందుకిలా బానిసలమవు తున్నాము విదేశీ సంస్కృతికి ..విదేశీ ఉత్పత్తులకు ..వికృత చేష్టలకు..

ఎందుకిలా మునిగిపోతున్నాము అక్రమ సంపాదనలో, అదికార దుర్వినియోగంలో, అతి ఆశల ఊబిలో , దురలవాట్ల దుర్గందంలో..

ఎందుకిలా విడిపోతున్నాము కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, భాష పేరుతో...

ఎందుకిలా పతనమైపోతున్నాము ఆలోచనలేక, వివేచన లేక, విచక్షణ లేక, కరుణ లేక, సామాజిక బాద్యత లేక..



మన నెత్తురు చల్లారి పాయిందా ..మనకు మన దేశ సంక్షేమం మనకు పట్టదా ..

మన దేశాన్ని గొప్ప దేశంగా నిర్మించవలసిన బాద్యత మనకు లేదా ..



ఆర్దికంగా పెరుగుతున్నాము .. ఆత్మహత్యలూ ఆపలేక పోతున్నాము ..

భవనాలు కడుతున్నాము ...మురికి వాడలు పెంచుతున్నాము..



ప్రతి భారతీయుడు ఆత్మవిమర్శ చేసుకోవలసిన సంధి సమయం ..

మన భవిష్యత్తుకోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానీయులకు మొక్కి వారి అడుగు జాడలను అనుసరించవలసిన అవసరం ..

నవ భారత నిర్మాణానికి నేను సైతం అంటూ నడుం కట్టవలసిన తరుణం..





















Thursday, September 6, 2012

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా



వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా

కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను
ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను
పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా
నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిన నాడు నన్ను కటిక వాని పాల్జేస్తే
ఉసురు కోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవోయి
నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయి
నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయి
నా వల్లే ఢంకాలకు నాదం పుట్టించునోయి


వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

నా కొమ్ములే దువ్వెనలై మీ తల చిక్కులను తీర్చు
నే కల్పించిన విభూది మీ నొసటను రాణించు
నా రాకయే మీ ఇంట్లో శుబములెన్నో కలిగించు
నా చేయుతయే చివరకు వైతరణిని దాటించు

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా





రచన: కొసరాజు చిత్రం: గోవుల గోపన్న





Wednesday, September 5, 2012

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది
గురువు గారి స్ఫూర్తి తోనే నా ఉత్సాహం ఉరకలెత్తి కదిలింది

నేను చేసే ప్రతి పనిలోనూ....నేను పొందే ప్రతి ప్రగతిలోనూ..
గురువు గారి బోదనయే దాగుందని..
గురువు గారి బోదనయే దాగుందని..నా విద్యాబ్యాసం అనునిత్యం గుర్తుచేస్తూ ఉంటుంది..

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది

గురువు గారి స్ఫూర్తి తోనే నా ఉత్సాహం ఉరకలెత్తి కదిలింది

నిలకడైన దృష్టి లేక..సరి అయిన ఊహ లేక..నేనెంత గురువు గారిని విసిగించిననూ..
గురువుగారి ఓర్పు నాలో..

గురువుగారి ఓర్పు నాలో.. నేర్పుతోటి మార్పు నిచ్చి అలుపెరుగక నడిపింది..

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది

గురువు గారి స్ఫూర్తి తోనే నా ఉత్సాహం ఉరకలెత్తి కదిలింది
నీతి కోసం నిజాయితీ కోసం సాదారణ జీవితాన్ని గడిపారు మా గురువు గారు అని తెలిసి..

నా అందలాలు కీర్తి ప్రతిష్టలు అధికారం సమస్తం...
నా అందలాలు కీర్తి ప్రతిష్టలు అధికారం సమస్తం...అయన పాదాలకు శిరస్సు వంచి నమస్కరించింది..

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది

గురువు గారి స్ఫూర్తి తోనే నా ఉత్సాహం ఉరకలెత్తి కదిలింది
గురువు గారి బోధనే బోదివృక్షం నాకు.. గురువు గారి దీవేనెలే సుప్రభాతం ప్రభాకారా నాకు

చదువుకున్న ఆ రోజులు మరల మరల గుర్తుకు రాగా...
చదువుకున్న ఆ రోజులు మరల మరల గుర్తుకు రాగా...నా దేహం నిలువెల్లా గురునామ స్మరణ చేస్తూ పులకరించి పోయింది..

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది
గురువు గారి స్ఫూర్తి తోనే నా ఉత్సాహం ఉరకలెత్తి కదిలింది



--నాకు విద్య నేర్పి నా ఎదుగుదలకు కారణమైన నా గురువులందరికి అంకితమిస్తూ.....ప్రభాకర రావు కోటపాటి









Thursday, August 2, 2012

రేపటి పౌరులు మీరు...ఈ దేశగతిని మార్చగల శక్తులు మీరు..


పవిత్ర భూమి మనది...ప్రపంచానికే విజ్ఞాన దాత మనం..

రేపటి పౌరులు మీరు...ఈ దేశగతిని మార్చగల శక్తులు మీరు..


న్యాయమైన మార్గాలలో నడవండి...నాయకులై వెలగండి..


సుడిగుండాల సమూహం ఈ సమాజం..

చాకచక్యంతో చరించాలి...

తెలివితేటలతో తేజస్సు పొందాలి..

మానవత్వంతో మార్పు తేవాలి..

నాయకత్వంతో ఇతరులను నడిపించాలి...



ఓర్పుతో ఓటములను విజయాలుగా మార్చండి..

స్నేహముతో సేవకులను నాయకులుగా మార్చండి..

మానసిక శక్తితో మనుషులను బలవంతులు గా మార్చండి

విలువల ప్రచారముతో విగత సంస్కృతులను వినూత్న స్రవంతులుగా మార్చండి..

మీ ప్రతి అడుగు అభివృద్ధి వైపు..

మీ ప్రతి తలపు పరిష్కారము వైపు..

మీ ప్రతి చూపు నిజాయితీ వైపు..

మీ ప్రతి పిలుపు సర్వ స్వతంత్రత వైపు..


ఆత్మాభిమానం మీ ఆభరణం గా..


స్వయం సమృద్ది మీ సంకీర్తన గా..

ప్రతి పౌరుని వ్యక్తిత్వ వికాసమే మీ విప్లవ గీతంగా..

భారతదేశ విశ్వ నాయకత్వమే ప్రతి ఒక్కరి జీవిత ధ్యేయంగా ..


అలుపులేని, చెదరిపోని, ఆగిపోని అంతములేని నిరంతర ప్రయత్నం చేయండి...
రెండవ జాతీయ ఉద్యమాన్ని నడపండి...అగ్రగామి భారత్ ను నిర్మించండి...


లీడ్ ఇండియా!

Monday, June 25, 2012

ఆ మార్పుకోసమే ప్రయతించాలని ఉంది నిరంతరం..





దురలవాట్లతో  దారి  తప్పిన  బిడ్డల తో  అల్లాడుతున్న  నా  తల్లి  భారతిని  బయటకు  లాగాలని  ఉంది ..
ఆమె పాదాలను  తాకి  రెండవ  జాతీయోద్యమానికి  ఊపిరి  పోయాలని  ఉంది ..
మనుషుల  మనసుల  లోనికి  చొరబడి  వారి  దిశను  దేశం  వైపు  తిప్పాలని  ఉంది..

నిలువరించలేని  ఉప్పెనలా  ఉద్యమించి  యువతను  కదిలించాలని  ఉంది..
సంధించిన భాణంలా  చెలరేగి  మంచితనం  తో  హృదయాలను ఆక్రమించాలని  ఉంది.. 
ఉదయించిన  ప్రభాత  సూర్యుని  వెలుగులా  నలుదిశలా  విస్తరించి..
నిజమైన  సేవ  గురించి  ప్రచారం  చేయాలని  ఉంది.. 

ప్రతి మనిషిలో నిరుపయోగంగా  పడిఉన్న విజ్ఞానాన్ని అనుసంధానం  చేసి  
ప్రజల  ప్రయోజనాలకు  ఉపయోగపడే  జీవ  నదిలా  మార్చాలని  ఉంది.. 

క్రమశిక్షణతో నిండి ఉన్నయోగ  సైనికులను  ఈ  పుణ్యభూమిలో  నింపాలని  ఉంది..
ఇతరులకు సహాయం చేయటం తప్ప సహాయం కావాలని చూసే వాళ్ళు ఉండని సమాజాన్నినిర్మించాలని ఉంది.. 

స్వార్ధానికి మించి ఎదిగిన మహా మనుషుల నడుమ మనసు విప్పి ఆహ్లాదంగా జీవించాలని ఉంది..

పోలీసులు  అవసరములేని  అసూయా  ద్వేషాల జోలికి పోని అన్నిటిని  అర్ధము  చేసుకొని  
నిత్య  సంతోషులై  చరించే  పౌరులను  దర్శించాలని  ఉంది 

అందుకోసమే  అర్పించాలని  ఉంది  నా జీవితం...
ఆ మార్పుకోసమే ప్రయతించాలని  ఉంది నిరంతరం..
ఆ రోజు కోసమే నడపాలని ఉంది రెండవ  జాతీయోద్యమం.. 

                                                 --ప్రభాకర రావు కోటపాటి 

Monday, April 2, 2012

మురికివాడలో మగ్గిపోతున్న చిన్నారి మనసును గమనించు...






మురికివాడలో మగ్గిపోతున్న  చిన్నారి  మనసును  గమనించు... అనునిత్యము  ఆనందాలలో  మునిగితేలే  మనుషులను  చూసి తనలో  పెరిగే  ఆక్రోశాన్ని  ఊహించు....


తనకు  పట్టిన  ఆ  గతికి  కారణం  తెలియక  తన  తోటి  మనుషుల  విలాసాలని  తాళలేక, తనలో  తాను  విలపిస్తూ, ఈ  సంఘం పై   ద్వేషాన్ని  పెంచుకుంటూ, అగ్నిపర్వతంలా  రగిలిపోతూ  పెరిగే ఆ రేపటి పౌరులను  పరిశీలించు...

ఈ  అవకాసం కోసమే  ఎదురు  చూస్తూ, గోతి  కాడ నక్కల వలే కాచుకొని, వారిని  మబ్యపెట్టి  మాయచేసి , రెచ్చగొట్టి , రగిలింపచేసి, వసపరుచుకొని  విపరీతాలను  సృష్టించే  విద్రోహ  శక్తులను  విశ్లేషించు ...



ఇదంతా  చూస్తూ, తమకేమి  పట్టనట్టు, తమకు  సంబంధము లేనట్లు, తమ  సమస్య  కాదన్నట్లు, తమ  పనుల్లో మునిగి, ఆలోచించే  తీరికలేక, సేవ  చేసే  మనసులేక, మార్పు  తెచ్చే  మనసులేక, అరాచక  శక్తులవలన తమకు  రాబోయే  ముప్పును  ముందుగా పసిగట్టలేక..కన్నులుండి చూడలేని  ద్రుతరాస్త్రులను చూడు ...

ఎక్కడనుండి పుడతారు నేరస్తులు...
ఎలా తయారవుతారు హింసావాదులు...
ఏవిధంగా నిర్మించపడతారు నిరాశా వాదులు...
ఏక్షణంలో జన్మిస్తారు క్షుద్ర చింతనా పరులు...


మనుషుల నిర్లిప్తత నుండి...
ఈ సంఘం చేసే నిర్లక్ష్యం నుండి...
స్పందన నశించిన సమాజం నుండి...
తన స్వార్ధము తప్ప ఇతర విషయాలు పట్టని ప్రజల ప్రవర్తన నుండి...

మేధావుల మౌనం...
అధికారుల అంధత్వం...
విజ్ఞానవంతుల వినికిడి లోపం..
ధనవంతుల దయలేని జీవనం..

అవే అన్నిరకాల సామాజిక సమస్యలకు సోపానం...
అవే మానవజాతి మనుగడను దహించగల దుష్ట చతుష్టయం...



                                              --ప్రభాకర రావు కోటపాటి 




  

Thursday, March 15, 2012

ఆలోచించు , ప్రణాళిక రచించు , ఆ పొగాకు భూతం నుండి విముక్తి పొందు ..పొగాకు



గుప్పు  గుప్పున  వదిలే    పొగ ..గుండెను  గునపంలా  గుచ్చుతుంటే 
మత్తు  అనే  మాయలో  నువ్వు  మునిగి ..
మనసు  మీద  పట్టు  లేక  పొగాకుకు  నీవు  బానిసవుతుంటే... 
తెలిసి  తెలిసి  జబ్బుల  ఊబిలోన  కూరుకుపోతున్న  నిన్ను  చూసి రోదిస్తున్న  హృదయంతో..  
వ్రాస్తున్నా ఈ  దారుణాన్ని  ఆపమంటూ  ఈ విన్నపం..
మనసు  శక్తి  తెలియక  నీవు  మాన  లేననే  ఆలోచనతో  ఆ  దురలవాటును  కొనసాగిస్తుంటే ..
శారీరక సమస్యలలో   మునిగిపోయి  విల  విల  లాడే  రోజున... 
ఎంత  విలపించినా  తిరిగి  రాదు  కోల్పోయిన    నీ  ఆరోగ్యం..
నీవు  వదిలే  పొగ  నీతో  పాటు  నీ  తోటి  వారి  ఆరోగ్యాన్ని  కుడా  హరిస్తుందని  తెలిసినా..
నీవు  చేస్తున్న  దానిని  సమర్దిన్చుకొంటూ  లోకము  నూరు  నోక్కగాలిగాననే..విజయగర్వముతో..
నీవు  జీవించినా ..నీలోపల  జరిగే  వికృత  వినాశానాన్ని  నీవు  ఆపలేవు ..
మాటల  గారడీతో  మనుషులందరినీ  మాయ  చేసి నీవే మోసపోతున్నావు ..
నలబై  శాతం  మనుషుల  జబ్బులకు  కారణమై , మందుల  రూపంలో  జాతీయ  ఆదాయాన్ని  హరిస్తూ  ముందుకు  సాగుతున్న  ఆ  పొగాకు  భూతాన్ని ప్రోత్సాహిస్తూ  బ్రమలోన   బ్రతుకుతున్నావు  నీవు.. 
స్వాతంత్రం కోసం  ప్రాణాలు  అర్పించిన  త్యాగధనులు  పుట్టిన  దేశంలో  జన్మించి ..
 స్వయంక్రుత అపరాదంతో పొగాకుకు  బానిసై  ..దేశ  సంక్షోభానికి  కారణం  అవుతున్నావు..
అనంత  శక్తిని  నీలో  దాచుకొని  గ్రహణం  పట్టిన  సూర్యునిలా... చీకటిలో  మునిగిపోయిన..  
 నిన్ను  చూస్తే  జాలితో  భాదతో  ఆవేదనతో  కరిగి  పారుతుంది  నా   కన్నీరు.. 
నీవు  దృడంగా  నిశ్చయిస్తే  చేయలేని  పని  లేదు ..
నీవు  సంకల్పిస్తే  పరిష్కరించలేని  సమస్య  లేదు ..
ఆలోచించు , ప్రణాళిక  రచించు , ఆ  పొగాకు   భూతం  నుండి  విముక్తి  పొందు ..
ఆరోగ్యముగా  జీవించు ..ఆరోగ్య    భారత్  ను  నిర్మించు .. 
                                                                                                 --ప్రభాకర రావు కోటపాటి 

Monday, February 20, 2012

అభివృద్ధి చెందిన భారత దేశాన్ని సాధించు



కలలు  కనండి, నాయకులుగా  ఎదగండి, 
కన్నీళ్లు తుడవండి , అర్ధవంతంగా జీవించండి.. 

పుట్టాము  పెరిగాము  తిన్నాము  తిరిగాము

గడిపాము  గతించిపోయాము..ఇదేనా  జీవితము 

కాదు  కాదు  అంతకు  మించినది  ఏదో  ఉంది..

ఈ  దేశ  నడకను  మార్చగల  శక్తి  నీ  దగ్గర ఉంది ..

స్వార్దమే  పరమావది  కాదు ..

నీవు  కోర్కెల  బావివి  కాదు ..

నిన్ను  నీవు  నియంత్రించుకోగల  శక్తి  నీకుంది...

పదిమందికి  ఆదర్శము  కాగల  స్పూర్తి  నీలో  ఉంది ..

పనికిరాని  పనులు  తగ్గించు ..

వ్యర్ద  వాదనలు  కట్టిపెట్టు ..
చేతలు  లేని  మాటలు  వద్దు  వద్దు ..


దారి  తప్పుతుంది  భారత  జాతి ..
తరిగిపోతుంది  రోజు  రోజుకు  నీతి ..
మారకపోతే  మనకు  నాశనమే  గతి ..

డబ్బు  కాదు,  సంపద   కాదు  

ఆస్తులు  కాదు,  ఐశ్వర్యము  కాదు..
కావాలి   నీ  సమయం ..
కావాలి  నీ  అంకిత  భావం ..
జాతీయ  సమస్యలను  పరిష్కరించగల  నీ  చాతుర్యం ..

ఉవ్వెత్తున  లేచే  ఉప్పెనలా  మారు ..

కుళ్ళును  కత్తిరించే ఖడ్గంగా  మారు ..
మార్పును  తెచ్చే  మృదంగంగా మారు ..

నీకోసం  నీకోసమే నీలాంటి  నాయకులకోసమే..

ఎదురు  చూస్తుంది  ఈ  భరతజాతి ..

సందిగ్దం  వదిలిపెట్టు ..

సారంశం  గ్రహించు.. 
అనుక్షణం   ప్రయత్నించు ..
అవినీతి, నిరక్షరాస్యత, సోమరితనం,దురలవాట్లు, 
అనవసరపు ఆకర్షణలు, సమయ దుర్వినియోగము, 
ప్రకృతి విద్వంసము  మరియు పరహింస నివారించు...

భరత జాతి ముద్దు బిడ్డగా మార్పుచెందు...   
అభివృద్ధి చెందిన భారత దేశాన్ని సాధించు....
  
                                      --ప్రభాకర రావు కోటపాటి 

చేయి చేయి కలిపితే చేయలేమా ఈ దేశాన్ని మరో సింగపూరు



నాగరీకులు సంచరించే  నగరం
శుబ్రత  గురించిన  ఆలోచన  శూన్యం 
చేతికొచ్చినట్లుగా  చెత్త  విసరటం
సాదారమైపోయింది అనునిత్యం



కుప్పలు తెప్పలుగా కురిసే వర్షం
వృధాగా ఆవిరైపోతుంది..అందుకు కారణం మన నిర్లక్ష్యం
మనకి తెలియంది లేదు మాట్లాడంది లేదు
చివరకు అవసరమైన పని చేసే వారే కొంచెం


చెట్లను నాటేది ఫోటోల కోసం మరియు పత్రికలకోసం 
వృక్షాల అబివృద్ది గురించి గంటల గంటల ఉపన్యాసం 
వాటి పెంపుదల కోసం నీటిని సమయాన్ని వెచ్చించం
అవసరమా మనకీ మిడిమాలపు గుణం


త్రాగే నీటి కోసం కావాలి ప్రకృతిని పాడు చేసే ప్లాస్టిక్ సమూహం 
తడి చేతిని తుడవడానికి కావాలి డజను టిస్యు పేపర్ల విపరీతం 
కొంచెమైనా అర్దము కావటం లేదు మనము చేస్తున్న వనరుల దుర్వినియోగం 
భగవంతుడు కుడా క్షమించడు ఈ బాధ్యతా రహిత కార్యక్రమం    

మేధావులమని  చెప్పుకొనే  మనం 
గుర్తించటం లేదు పొంచివున్న  ప్రమాదం 

విషవాయువులు విరజిమ్మే  కర్మాగారం 
అవుతుంది  పుట్టెడు  వ్యాదులకు  మూలం 

అభివృద్ధి  చెందని  రహదారుల  విస్తీర్ణం 
అవుతుంది  స్తంబించిన  వాహనాలకు  కారణం 
ఎవరు  మార్చాలి  ఈ  నిరంతర  జీవన్మరణం 
ఎప్పుడు  మెరుగవుతుంది నగరజీవి  ప్రయాణం 

అందరికీ  కావాలి  ఆకర్షణీయమైన  జీవనం 
ఎవరికీ  పట్టదు  తమవంతు బాద్యతను నెరవేర్చటం 
మిగతావారు చేస్తారులే అనే సోమరితనం

ఇలానే అందరూ నడిస్తే దేశ బవిష్యత్తు అందకారబందురం    

ప్రభుత్వానికి  పట్టలేదు  ప్రజల  సంక్షేమం 
వారికి  కావలి  అందలము  ఎక్కించే  కొత్త పధకం

నోట్లకు ఓట్లను అమ్ముకొనే జనం గుర్తించలేరు ఈ నిజం 
ఆదర్శ దేశ నిర్మాణం సకలజనుల సమ్మేళనంతోనే సాద్యం


డబ్బు సంపాదించటమే సగటు జీవి మంత్రం
సామాజిక సృహ నశిస్తుంది క్షణ క్షణం
ఎంత సంపాదించిన తరగటం లేదు ధనం పై మమకారం 
ఏమి చేస్తున్నామో ఏమి సాదిస్తున్నమో తెలియని ఆరాటం


సిగ్నళ్ళ దగ్గర చిన్న పిల్లలతో అడుక్కొని వ్రుత్తి సాగించే యాచకబృందం
అధికారులు తలుచుకొంటే ఆపలేరా ఈ అనునిత్య అపహాస్యం
చిత్తశుద్ది లేదు కర్తవ్య నిర్వహణలో..స్వీయ సంపాదనే ఏకైక లక్ష్యం
ఇకనైనా రావాలి ప్రజా విప్లవం చెలరేగాలి అవినీతి పరులను చెండాడే చైతన్యం

ఏమై పోతున్నాయి మన విజ్ఞాన విపంచికలు 
అవిరైపోయాయా మనము నేర్చుకొన్న విలువలు 
మనకి సంబందము లేదా ఈ ప్రజా సమస్యలు 
చేయి చేయి కలిపితే చేయలేమా ఈ దేశాన్ని మరో సింగపూరు 

                                                --ప్రభాకర రావు కోటపాటి 

Friday, February 10, 2012

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది

మరో  ప్రపంచం మరో  ప్రపంచం మరో  ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు పదండి  తోసుకు  పోదాం  పోదాం  పై  పైకి
మరో  ప్రపంచం మరో  ప్రపంచం మరో  ప్రపంచం పిలిచింది
ఇదే  మహా ప్రస్థానం   ఇదే మహా ప్రస్థానం  జీవిత  పధాన  సమతా  గమ్యం  చేరగా
ఇదే  మహా ప్రస్థానం భారత  జనాల  భాదల గాధలు మారగా
పదండి  పోదాం  కనపడలేదా  పవిత్ర  సుందర  నవోదయం
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది

దారి పొడుగునా గుండె  నెత్తురులు  తర్పణ  చేస్తూ  పదండి  ముందుకు
బాటలు  నడచి  పేటలు  కడచి  కోటలన్నిటిని  దాటండి
ప్రజా  విరోధుల  పనిపట్టగా  ప్రతిజ్ఞ  చేస్తూ  పదండి  ముందుకు
ధర్మ  విదూరుల  దానవ  రాజ్యం  ద్వంసం  చేస్తూ  పదండి  ముందుకు
కనపడలేదా  మరోప్రపంచపు  కణ  కణ  మండే  త్రేతాగ్ని
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది


ఎముకలు  కుళ్ళిన  వయస్సు  మళ్ళిన  సోమరులారా  చావండి
నెత్తురు  మండే  శక్తులు  నిండే  సైనికులారా  రారండి
హరోం  హరోం  హర  హర  హర హరోం హర  హరా  అని  కదలండి
మరోప్రపంచపు  కంచు  నగారా  విరామమెరుగక  మ్రోగింది
సల సల  కాగే చమురా  కాదిది కాదిది ఉష్ణ  రక్త  కాసారం...యువ  చైతన్య  వికాసం
కనపడలేదా  మరో  ప్రపంచపు  అగ్ని  కిరీటపు  ధగ  ధగలు
ఎర్ర  బావుటా  నిగ  నిగలు  హోమ జ్యాలల  భుగ  భుగలు
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది
చీకటి  శక్తుల  పీకలు  నులిమే  వెలుతురువైపు  మహా  ప్రస్థానం
దోపిడీ  బుద్దుల  తుదముట్టించే  న్యాయం  వైపు  మహా ప్రస్థానం
ఇది  మరోప్రపంచపు  మంచితనానికి  మానవజాతి  మహా  ప్రస్థానం


మహా ప్రస్థానం....మహా ప్రస్థానం






                                                                                                                -                                                   ---మహా కవి శ్రీ శ్రీ

Monday, January 9, 2012

దేశక్షేమమే పరమావధిగా సకలజనుల సమ్మేళనముతో సాధించు అభ్యుదయ భారతాన్ని....

ధర్మ దక్షులు నిజాయితీ నిబద్దులు ప్రజారంజక ప్రభువులు పాలించిరి ఈ భాగ్యవిదాతను...
సుద్ద శుంటలు నిరక్షర నిరర్దకులు  కఠిన కర్కోటకులు ఆక్రమించిరి అధికారమును...
విశ్లేషనాత్మక విజ్ఞానముతో ప్రజ్వలించే ప్రజాస్వామ్యముతో ఎంపిక చేయి భారత నాయకత్వాన్ని...


సకల కళా సంసిద్దులను వివేక విదురులను సరస్వతీ స్వరూపులను కన్నది ఈ జగజ్జనని...
విచక్షణా విహీనులకు అక్షర శూన్యులకు మానసిక వికలాంగులకు నిలయంగా మారుతున్నది...
అక్షరదీపం వెలిగించి వయోజన విద్యను ప్రోత్శాహించి రూపు మాపు నిరక్షరాస్యతను...


స్వీయ సాదికారత్వముతో పాడిపంటలతో ఐకమత్య బలముతో నడిచినది ఈ సుఖదాయని....
కీచులాట పోరాటములకు స్వార్ధపరుల అక్రమ సంపాదనకు అసాంఘిక శక్తులకు అవకాశము కల్పిస్తున్నది...
దేశక్షేమమే పరమావధిగా సకలజనుల సమ్మేళనముతో సాధించు అభ్యుదయ భారతాన్ని....