తేనెలొలుకు తెలుగుతో తియ్యనైన కవితా ప్రబంధాలు అందించిన నేల తెలుగునాడు
పరవళ్ళు తొక్కే కృష్ణ గోదావరి తుంగభద్ర అనేక నదులకు నెలవైన అమృతధార తెలుగునాడు
అఖండ భారతావనికి అనేక ఆహార పదార్థాలను ధాన్య రాశులను అందించు అన్నపూర్ణ తెలుగునాడు
ఎనలేని త్యాగ ధనులను స్వాతంత్ర్య యోధులను కవి సామ్రాట్టులను కన్నతల్లి తెలుగునాడు
తెలుగు ప్రభలను వెలిగించు విద్యా వేత్తలను శాస్త్రవేత్తలను అందించిన సరస్వతిదేవి తెలుగునాడు
కూచిపూడి ఆంధ్రనాట్యం ఒగ్గుకథ బుర్రకథ హరికథ పద్యనాటకం అనేక కళలకు నెలవు తెలుగునాడు
పచ్చని పొలాలు వృక్ష సంపద పక్షి సమూహాలు పర్వత శ్రేణులతో అలరే ఆనందసీమ తెలుగునాడు
నిర్నిబంద నియమపాలకులైన నాయకుల జనరంజక పాలన ఘనచరత్రతో నిండిన జీవనాడి తెలుగునాడు
అజరామర నిరంతర సంపదకు వారసులం మనం
దీక్షానిబద్దులమై పూర్వీకుల పరంపరకు భాద్యులం
తెలుగునాడు కీర్తి ప్రజ్యలింప చేసే కర్తవ్యబద్దులం
- ప్రభాకర రావు కోటపాటి
12 మే 2024