Friday, November 4, 2011

నమ్మకద్రోహి నాయకుడు కాలేడు




నమ్మకద్రోహి  నాయకుడు  కాలేడు 
వెన్నుపోటుదారుడు  విశ్రాంతిగా  ఉండలేడు

నాయకత్వమంటే మనుషులమీద ఆదిపత్యంకాదు  
అధికారమంటే ఇతరులను అణచినడిచే ఆట  కాదు
సహాయకుల సంక్షేమంకోసం పాటుపడేవాడే  నిజమైన  నాయకుడు 
తనతోటివారి అబివ్రుద్దిని ఆశించేవాడే మనసున్నమనిషి 

విచక్షణాయుక్తంగా విధులను నిర్వహించేవాడే నిజమైన  నిర్వాహకుడు 
స్వార్దరహిత కర్తవ్యనిర్వహణ చేయువాడే సకలజనుల స్నేహితుడు

చాటుమాటు చాడీలతో కుట్ర పూరిత చేష్టలతో నసించేది అవి నడిపేవాడే
ఇతరుల గురించి దుస్ప్రచారము  చేయువానికి  మిగిలేది  దుష్ట అనుభవాలే 
పనిగట్టుకొని  ఇతరులను నష్ట పరచాలని చూసేవాడు  నడిచేది నష్టాల ఊబిలోనికే 
మంచివారికి అసూయతో చేడుచేయ ప్రయత్నించువానికి  మిగిలేది  మానసిక  వ్యధ  మాత్రమే
ఈ  ప్రకృతి  ఒక  పెద్ద  అద్దము  వంటిది
ఈ సృష్టి   ఒక  విచిత్ర  వినోదశాల
ఈ  లోకము  ఒక అలౌకిక   ఆదార  సహితము
ఈ  జన్మ  ఒక  జ్యోతి  స్వరూపము


నీవు  ఏది  ఇస్తావో  అదే పొందుతావు 
నీ  నడక  ఆదారంగానే నీ గమ్యము
నీ ఆలోచనలే నీ జీవిత అనుభవాలు
నీ  ప్రవర్తన  ఫలితమే  నీ కీర్తి ప్రతిష్టలు

నీకు మిగిలేది నీవు ఈ ప్రపంచానికి చేసిన మేలు మాత్రమే.......









Sunday, October 23, 2011

నిలిచి గెలువరా నాయకుడా....


ఆశేతు హిమాచలం ఈ దేశం

అనంత సుందరం మన భారతదేశం

తెలుసుకోరా తమ్ముడా

నిలిచి గెలువరా నాయకుడా

ఈ భూమిలోన ఉంది అద్బుతాలస్రుష్టి

ఈ నేలలోన పండు షడ్రుచుల పుష్టి

దారి తప్పుతున్నావు కట్టుబానిసవుతున్నావు

దురలవాట్ల ధౌర్భల్యముతో దిగజారిపోతున్నావు
సిగపట్ల దోరణితో ఒంటరిగా మారుతున్నావు

అలోచనలేదు దేశాభివ్రుద్ది గురించి

మనసులేదు సమసమాజ స్థాపనగురించి

తలచినదంతా సాదించవచ్చును ఈ పవిత్రభూమిలో
సంత్రుప్తిగా జీవించవచ్చును ఈ అనంత ఆనందక్షేత్రంలో
ఎక్కడా లేనన్ని వింతలు వర్ణణకు అందని కళాక్రుతులు
ఏ దేశంలోనైనా ఉంటాయా ఇన్ని వైవిద్య భరిత ఆకర్షణలు

ఏ ప్రాంతములోనైనా వింటామా ఇన్ని వీనులవిందైన సరిగమలు

అడుగడుగునా అంతులేని పచ్చదనం...సస్యశామలం చేసే నదీజాలం

ఎవరూ కొల్లగొట్టలేని విలువైన భాండాగారం...

గుర్తించలేకపొతున్నావు నీ చుట్టూ ఉన్న సంపద...
అందుకోలేకపోతున్నావు ఆ అమ్రుతధార...

నాగరికత పేరుతో నష్టదాయక ధోరణి...

సాంఘిక సంబందాల మాటున వినాశనకారక విశ్రుంఖలత్యం...
దర్మకార్యానువర్తులు భలవంతులు మనపూర్వీకులు
అనుక్షణం ఆచరించారు నిర్మాణాత్మకమైన ఆలోచనలు
నీతిని నిలబెట్టారు....ఈ దేశాన్ని పునీతం చేశారు

కలలు కని కదిలి కదిలి వస్తున్నారు...విదేశేయులు
నేర్చుకోవటానికి మన యోగ ద్యాన వేదాంత విలువలు
మనకు తెలియటము లేదు ఆ విద్య విలువ...
ఉపయోగించుకోలేకపోతున్నాము ఆ అసామాన్య కానుక..

ఏది నిజమో తెలుసుకొనే శక్తి నశించిపోతుంది...
ఏలా బ్రతకాలో యోచించే యుక్తి తరగిపోతుంది...
పాశ్చాత్య పోకడలపై మోజులు....

ఈ దేశ భవిష్యత్తు పై ముసురుతున్న నీలినీడలు..

అనవసరమైన కోరికలతో కోరితెచ్చుకొనే కష్టాలు
ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలనే అలోచనలు...

ఇకనైనా తెలుసుకోవాలి మనం....
నాయకులమై నడిపించాలి మనం...

సామాజిక స్రుహకావాలి... బాధ్యతెరిగి బ్రతకాలి...
కళలు ఉట్టిపడే కనులు మిరిమిట్లు గొలిపే కట్టడాలు....
సంబ్రమాస్చర్యాలకు లోనౌతున్నారు వాటిని చుసిన యాత్రికులు...

వట్టిచేతులతో నిర్మించారు మన తాత ముత్తాతలు...
ప్రతి కట్టడం నిరంతరశ్రమ పట్టుదల త్యాగాల ఫలితం..

మనమే నిలబెట్టాలి వారి పేరు ప్రతిష్ట...

నిరూపించాలి మనం ఈ దేశ ఘనాఘనా పటిమ...

ఈ దేశములో లేనిది లేదు....మన మానసిక ద్రుడత్వము తప్ప...
మనకు వేరొక కర్తవ్యము లేదు...భారతదేశ సమగ్రాభివ్రుద్ది తప్ప.....

దురలవాట్లను జయించు....నాయకత్వము వహించు.....

భారతీయుల పరివర్తనకు ఉపక్రమించు...

ఈ పవిత్రభూమిలో జన్మించినందుకు నీ మాత్రుభూమి ఋణం చెల్లించు...


                                         ------ప్రభాకర రావు కోటపాటి




















Wednesday, July 13, 2011

సామాజిక మహా పాపములు

నియమ నిష్టలు లేని రాజకీయాలు, మానవత లేని శాస్త్ర విజ్ఞానము, అంతఃకరణ (స్పృహ ) లేని ఆనందం, త్యాగము లేని పూజ, నీతి లేని వ్యాపారం, పని లేని సంపద, శీలము లేని విద్య సామాజిక మహా పాపములు

                                                                                                                      - మహాత్మాగాంధీ.

Friday, June 3, 2011

పరిరక్షించు పర్యావరణాన్ని

పరిరక్షించు పర్యావరణాన్ని



సూర్య రశ్మిని సుందర పుష్పంగా మార్చే శక్తి
భూగర్భంలో అనంత లోహ సంపద దాచే యుక్తి
సముద్ర జలాలలో సమస్త జీవరాశులను పెంచేశక్తి
జంతువుల క్రమాన్ని క్రమభధంగా మార్చే స్పూర్తి
అదే ప్రకృతి శక్తి! అదే మహాశక్తి!
అనుకరించగలమా ఆ వెలకట్ట లేని సంపదను
అడ్డుకోగలమా ఆ పసికట్టలేని ఇంద్రజాలన్ని
ఎంతటి అదృష్టవంతులం మనం ఈ ప్రకృతి మాత బిడ్డలమైనందుకు
ఎంతటి ఆస్తి పరులం మనం ఈ దివ్య సంపద మన సొంతమైనందుకు
ఒక చిన్న విత్తనమునుండి మహావృక్షం పుడుతుంది
ఒక చెట్టు కదలిక నుండి వర్షజాలం ద్రవిస్తుంది
కోయిలకు తీయనిగొంతు నెమలికి అందమైన ఈకలు
జిమ్కకు అందమైన చర్మం ఏనుగుకు విలువైన దంతాలు
హంసకు నాజూకైన నడక చిలుకకి ముద్డులొలికే పలుకులు
కుక్కకు సడలని విశ్వాసం ఆవుకి అనంతమ్ ఆకర్షణలు
ఆకు ఆకుకి వైవిద్యం పూవు పూవుకి వినూత్న సుగందం
తీగ తీగకి సాగిపొయే శక్తి కాయ కాయకి రూచికరమైన ఆహారం


సౌకర్యం పేరుతో సంక్షోభం సృష్టిస్తున్నాం మనం
నాగరికత పేరుతో నాశనం చేస్తున్నాం మనం
ఇకనైనా గుర్తిధ్దాం మన ప్రకృతి అంతర్గత శక్తులను
ఇకనైనా ప్రయత్నిద్దాం మన పర్యావరణ పరిరక్షణ కొరకు

Sunday, May 29, 2011

కావాలి భలోపేతం నాభారత ఖండం

కావాలి భలోపేతం నాభారత ఖండం







సనాతన ధర్మాలను సంస్కరించే సత్పురుషులతో

సంగీత సాహిత్యాలను సాధనచేసే సంతుష్టులతో

ప్రకృతి పరిరక్షణపాటించే ప్రయోజకులతో

విఙ్ఞన శాస్త్ర రహస్యాలను విస్రృతపరిచే విఙ్ఞలతో

మతసామరస్యాలను మనుగడ కలిగించే మహానాయకులతో
ఆరోగ్యకర ఆహారపదార్ధాలను ఆరగించే ఆనంద స్వరూపులతో
మానవత్వ సేవలను మహిమాన్వితపరిచే మహత్ములతో
అభివృధ్ధి పధకాలను అనవతము అమలుచేసే అధికారులతో
పేదరిక కారకాలను పెకళించివేసే పాలకులతో
నీతి నిజాయితీలను నిరంతరము పాటించే నరులతో
విధ్యా భుధ్ధులను వినయముతో నేర్చుకొనే విధ్యార్ధులతో
ప్రశాంత పరిస్ధితులను ప్రేమించి నిలపెట్టే ప్రజలతో
సస్యశ్యామల భూములను సంరక్షించే సాదుస్వభావులతో
క్రీడా విజయ సామర్ధ్యాలను కలగివుండే క్రాంతికారులతో
కుటుంభవిలువలను కాపాడి నడిపే క్రమశిక్షణామూర్తలతో
లలితకళను హస్యపరిచే లక్షణ విశారథులతో
నాధైవమా ఆశీర్వదించు నాభారతావనిని
నీదయతో కావాలి భలోపేతం నాభారతఖండము



                                 ------ప్రభాకర రావు కోటపాటి

Monday, January 3, 2011

ఈ అందమైన ప్రక్రుతిని స్రుజించిన దైవమా....రక్షించు ఈ ప్రజలను.... తెరిపించు వీరి జ్ఞాన నేత్రాలను....

ఈ అందమైన ప్రక్రుతిని స్రుజించిన దైవమా....రక్షించు ఈ ప్రజలను.... తెరిపించు వీరి జ్ఞాన నేత్రాలను....

బాత్రూంలో బంగారు తొడుగులతో బడాబాబులు

పొట్టకూటికి పరుగులెత్తే అద్రుష్టరహిత అభాగ్యులు

అనంతమైన ఆహారపదార్దాలతో జబ్బులు తెచ్చుకొనే దనవంతులు

దారిద్ర్యంలో దహించుకుపోయి మద్యం మత్తులో సేదతీరే శ్రామికులు

తల్లిదండ్రుల సంపాదనతో విచ్చలవిడిగా తిరిగే యువకులు

అవకాశాలులేక అణగారిపోయి అనాధలుగా పెరిగే నిరాశాజీవులు

దనమధముతో దురలవాట్లతో దేశాన్ని పీడించే దుష్టులు

దారిద్ర్యముతో దారితప్పి దొంగలుగా మారే దైన్యజీవులు

మతం పేరుతో మారణహోమం సాగించే దుర్మార్గులు

మనుగడలేక మ్రగ్గిపోతూ మార్గం కానరాని మౌనరోధకులు

విశ్రుంఖల విహారాలను వినోదాలుగా భావించే మేధావులు

వినిపించుకొనేవారు లేక పరి పరి విధాలుగా విలపించే విగతజీవులు

రకరకాల యుక్తులతో కుయుక్తులతో లాబాలు సంపాదించే వ్యాపారులు

సమస్త ఆస్తులను పెట్టుబడిగా పెట్టి అకాలవర్షాలతో అలమటించే రైతులు

లంచగొండితనంతో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన నాయకులు

వర్గాలుగా కులాలుగా చీలి అనవసర పొరాటాలతో త్రుప్తిచెందే పౌరులు

అధికాహారముతో శారీరకశ్రమలేక యంత్రాలుగా మారే ఉద్యోగులు

చుట్ట బీడీ సిగిరెట్టు మధ్యాలతో జబ్బులు తెచ్చుకొనే కార్మికులు

నాగరికత పేరుతో వ్యర్దపదార్దాలతో ప్రక్రుతిని పాడుచేసే ప్రభుద్దులు
ఆహారంకోసం చెత్తకుండిలో ప్లాస్టిక్ సంచులు ఏరుకొనే మందభాగ్యులు

దూరదర్శిని సినిమాలు క్రికెట్ ప్రసారాలతో కాలాన్ని వ్రుధాచేసే విద్యార్దులు

నైపుణ్యంకానరాక ఉద్యోగులవేటలో ఇంటర్యూలు చేస్తూ ఊర్లుతిరిగే కంపెనీలు

దనసంపాదనే జీవితము అనే భ్రమలో బ్రతికే విద్యావేత్తలు

ఎవరో వస్తారని ఏదోచేస్తారని ఎదురుచూసే సామాన్యప్రజలు

ప్రేమపేరుతో యాసిడ్లతో కత్తులతో పరమదుర్మార్గంగా దాడులుచేసే మధించినమ్రుగాలు
జీవితాన్ని అర్దముచేసుకోలేక మార్గాలను చూడలేక ఆత్మహత్యలకు పాల్పడే నిస్రుహపరులు

విలపిస్తోంది నా హ్రుదయం,ఉప్పెనవుతుంది నాఊపిరి

మదనపడుతుంది నా మనస్సు, బిగుసుకుంటుంది నా పిడికిలి

రగులుతుంది నా రుధిరం, కదిలిసాగుతుంది నా కన్నీరు

ప్రార్దిస్థున్నాను నా చేతులెత్తి

ఈ అందమైన ప్రక్రుతిని స్రుజించిన దైవమా....

రక్షించు ఈ ప్రజలను.... తెరిపించు వీరి జ్ఞాన నేత్రాలను....



                                         ------ప్రభాకర రావు కోటపాటి

Monday, December 6, 2010

ఆవేశం నాది ఆకాంక్ష నాది

ఆవేశం నాది ఆకాంక్ష నాది ఆరోగ్య ప్రపంచాన్ని క్రమశిక్షణ ద్యారా నిర్మించాలని

ప్రయాస నాది ప్రయోగం నాది ప్రేరణాశక్తిని ప్రతి మనిషిలో అణువణువున నింపాలని

తలపు నాది తరగని తహ తహ నాది చెడు అలవాట్లను సమాజం నుండి వేరిపారేయాలని

ఊహ నాది ఉప్పెన లాంటి కల నాది గ్రామ స్వరాజ్యాన్ని భారతదేశములో నెలకొల్పాలని

పరుగు నాది పట్టుదల నాది భాధ్యత కలిగిన త్యాగధనులైన యువతను తయారు చేయాలని



వినియోగిస్తాను నా విద్యాసంపదను ఈ విధి నిర్వహణలో

త్రవ్వితీస్తాను నా తార్కిక శక్తిని ఈ ప్రణాలికల రచనతో

మలుచుకొంటాను నా మేధాశక్తిని ఈ నిరంతర నిర్మాణములో

గడిపివేస్తాను నా జీవిత సమస్తాన్ని ఈ సదాశయాల సాధనలో



స్వార్దమే పరమావధిగా సమస్త కార్యములు సాగిస్తున్నారు ప్రజలు

క్షణికానందమే శాశ్వతంగా భావించి బరితెగిస్తున్నారు భావి పౌరులు

పనికి రాని వస్తువులను పవిత్రంగా వినియోగిస్తున్నారు విలాసపురుషులు

వలసల ప్రయాణాలతో నిర్జన ప్రదేశాలుగా మారుతున్నాయి సగటు గ్రామాలు



సాగరాదు ఈ విలయంవైపు ప్రయాణాలు

నడువరాదు ఆ వినాశనకర విదానాలు

గెలువరాదు ఈ అక్రమ మార్గాల అనుచరులు

కనుమరుగై పోరాదు సశ్యశ్యామలమైన గ్రామాలు



ఆవేశం నాది ఆకాంక్ష నాది ఆరోగ్య ప్రపంచాన్ని క్రమశిక్షణ ద్యారా నిర్మించాలని



                                         ------ప్రభాకర రావు కోటపాటి