Saturday, January 12, 2013

కదలి సాగుదాం..కలసి సాధిద్దాం...అద్బుతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం..




ప్రపంచాన్ని తన లోతైన ప్రవచనాలతో కదిలించిన కొదమ సింహం..

విద్వేషాలతో విడిపోతున్న జనులకు విశ్వమానవ మతాన్నిపరిచయం చేసిన విజ్ఞాన విహంగం..

మనిషి ఎలా జీవించాలో ఎలా ఆలోచించాలో నిగ్గు తేల్చిన నిప్పు రవ్వ..

బానిసత్వంలో అలసత్వంతో మగ్గుతున్న భారత యువతను స్వాతంత్ర సాధన వైపు నడిపిన స్ఫూర్తి ప్రధాత..

ముప్పైతొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించి మూడువందల తొంబై సంవత్సరాల సమానమైన సేవ చేసిన మహా నాయకుడు...

ఆయనే..అనన్య అసమాన్యుడు....
ఆయనే..స్వామి వివేకానంద.....

ఆయన పేరు వింటేనే ఆత్మ విశ్వాసం నిద్ర లేస్తుంది..

ఆయన వ్రాసిన అక్షరాలు చదివితేనే సాధించాలనే ఉద్రేకం ఉప్పెనవుతుంది..

ఊహ కందని మేదస్సు అయన సొంతం..
పరిపూర్ణమైన దేశభక్తి అయన ఆసాంతం..

దనానికి దాసుడవ్వలేదు...
మోహాలకు తావివ్వలేదు..
దురలవాట్లకు బానిసవ్వలేదు...

యువశక్తి ఈ దేశాన్ని మారుస్తుంది అని ఎలుగెత్తి చాటిన పరమహంస ప్రియ శిష్యుడు..

శిధిలమవుతున్న భారత సంస్కృతిని తన అమృత వాక్కులతో నిలబెట్టిన ఆరాధ్య పురుషుడు..

అటువంటి స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనందరి అదృష్టం..

ఆయన రచనలలో ఎన్నో ప్రశ్నలకు పరిష్కారం..
ఆయన సలహాలలో ఎన్నో సమస్యలకు సమాధానం..

ప్రతి భారతీయుడు తప్పక చదివి పాటించాల్సినవి అయన సూచనలు..
ప్రతి యువకుడు విధిగా నేర్చుకోవాల్సినవి అయన నిర్దేశాలు..

మనము ఆచరించవలసిన జీవన శైలికి...
మన ప్రతి జాతీయ సమస్యకు...
భారతీయ యువత ఔన్నత్యానికి..
విశ్వానికి నాయక గా మన దేశాన్ని నిలపటానికి.. 
కావలసిన నిఘంటువు...స్వామి వివేకానంద.....

ఇకనైనా కళ్ళు తెరుద్దాం..
అయన మనకిచ్చిన అపార విజ్ఞాన సంపదను గుర్తిద్దాం..
ఆ మహానుబావుని కలలు నిజం చేద్దాం...

కదలి సాగుదాం..కలసి సాధిద్దాం...అద్బుతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం..








Friday, January 11, 2013

అనుక్షణం నీకు ఆధారమైన ఆ దేవతా స్వరూపాన్ని ఆరాధించు అనుబందముతో ఆత్మీయతతో కృతజ్ఞతతో జీవించు....

జన్మనిచ్చి ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లి
 
తోడునిచ్చి సేవతో బాద్యత తీసుకొన్న భార్య
 
అండనిచ్చి మాటతో బలాన్ని ఇచ్చిన అక్క
 
చెలిమినిచ్చి ఆటతో ఆనందాన్ని అందించిన చెల్లి
 
ఇన్ని విదాలుగా పురుషునికి ఆధారమైన మహిళను
 
మధించి మత్తులో మునిగి వ్యధకు గురిచేస్తున్న ఓ మగ మృగామా...
ఒక్క క్షణం ఆలోచించు నీవు చేస్తున్నదేమిటో...
 
 
నీ చేతితో నీ కన్నునే పొడుచుకొంటున్నావు...
 
నీవు కూర్చున్న కొమ్మను నీవే నరుక్కొంటున్నావు..
 
సునిశితమైన మనసు, జాలి నిండిన గుండె, మధురమైన పలుకులు, కరుణ కురిసే కళ్ళు, సేవ చేసే చేతులు ...

ఇన్ని కలగలిసిన ఆ మానవతా మూర్తిని ఎలా హింసించాలనిపిస్తుంది మనిషిగా జన్మించిన నీకు..

కన్ను గానని కామంతో...వళ్ళు తెలియని విచ్చలవిడితనముతో...సృహలేని రాక్షసత్వముతో...
నీవు సాగిస్తున్న ఈ దారుణాన్ని ఆపకపోతే....

ఇక సహించబోదు ఈ ప్రపంచం...
భూస్తాపితం చేస్తుంది నిన్ను ఈ సమాజం...

ఇకనైనా కళ్ళు తెరువు...

నీ ఉనికికి కారణమై, నీ చలనానికి చేయూతై, నీ గమనానికి దిక్సూచై,
అనుక్షణం నీకు ఆధారమైన ఆ దేవతా స్వరూపాన్ని ఆరాధించు అనుబందముతో ఆత్మీయతతో కృతజ్ఞతతో జీవించు....




Tuesday, October 16, 2012

అందుకే ఆటలు ఆడదాం మనమంతా నూరేళ్ళు ...



ఆడటం ఆపేసావా ఆగిపోతుంది ఆనందం

సుఖానికి లొంగిపోయావా పనిచేయదు నీ శరీరం ..

దేవుడు తయారు చేసిన ఈ యంత్రం ఒక మంత్రం ...

దానికి మందు మాత్రం ప్రతి రోజూ ఆటల యజ్ఞం ..

ఆట మనిషి జీవితానికి ఒక నిరంతర జ్యోతి

ఆడటం ఆపేస్తే ప్రవహించదు ప్రాణ శక్తి...

తెలుసుకొని పాటిస్తున్నమీరంతా యోగులు ...

అర్ధం చేసుకోలేక ఇంటిలో కూర్చున్న వాళ్ళంతా రోగులు ..



అందుకే ఆటలు ఆడదాం మనమంతా నూరేళ్ళు ...

Friday, September 21, 2012

అది అండమాను ద్వీపం..చూశాను నేనొక పుణ్యక్షేత్రం

అది అండమాను ద్వీపం..చూశాను నేనొక పుణ్యక్షేత్రం

మన దేశానికి పట్టిన దెయ్యాలను తోలిన దేవుళ్ళ నివాసం

బ్రిటిషు బకాసురులు చేసిన విఫల ప్రయత్నం

చిత్ర విచిత్ర చిత్ర హింసల పర్వం..ఓర్చుకొని గెలిచిన వీరాది వీరుల సమూహం ..

ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది రక్త తర్పణం ..

వింటుంటే ఊగి పోయింది నా శరీరం..చూస్తుంటే చలించిపోయింది నా దేహం

వారి కష్టాలకు కన్నీరు మున్నీరయింది నా హృదయం..ఆ త్యాగధనులను శ్లాగిస్తూ సాగింది నా కలం..



ఎన్ని పాట్లు పడ్డారు ...ఎంత యాతన పెట్టారు..అది జయిలా కాదు కాదు కర్కోటక నరకం ..

దాని పధకమే భయానకం..అది ఆ పాలకుల నీచ కృత్యాలకు నిదర్శనం..



ఆ ఆంగ్ల పిశాచాలు చేయని అకృత్యము లేదు..కనిపెట్టని హింస పద్దతులు లేవు

వారు నేరస్తులా వారిని ఆ రీతిలో హింశించటం అవసరమా ..

అడిగే వారె లేరు...అరణ్య రోధనయింది ఆ మహానుభావుల వేదన ..



ఒక్క జై! చాలు బ్రిటిష్ వారికి వారి నోటి నుండి.. ఒక్క ఆలోచన చాలు నాకెందుకని..

వదలి వేసి ఉండేవారు వారిని బ్రిటిషువారు...గడప గలిగే వారు ఆనందకరమైన జీవితాన్ని...


కదల లేదు వారి కార్య దీక్ష..నిరంతరం ప్రవహించింది వారి స్వతంత్ర కాంక్ష ..

బహుశా ఏ దేశములో పుట్టి ఉండరేమో ఇటువంటి త్యాగ మూర్తులు ..

ఏ నేల పై జీవించి ఉండరేమో ఇలాంటి నిజమైన నాయకులు ..



ఎందుకోసం చేసారు వారు..ఎటువంటి భావి భారతం కోసం కలలు కన్నారు వారు ..

మనం వారి వారసులమే కదా .. ఏమయి పోయింది మనలో ఆ అకుంటిత దీక్ష ..

ఎక్కడ పాతుకు పోయింది ఆ మహానుభావుల ఉద్రేకం ..

ఏ మూల కూరుకు పోయింది ఆ త్యాగధనుల సేవా భావం..



ఎందుకిలా బానిసలమవు తున్నాము విదేశీ సంస్కృతికి ..విదేశీ ఉత్పత్తులకు ..వికృత చేష్టలకు..

ఎందుకిలా మునిగిపోతున్నాము అక్రమ సంపాదనలో, అదికార దుర్వినియోగంలో, అతి ఆశల ఊబిలో , దురలవాట్ల దుర్గందంలో..

ఎందుకిలా విడిపోతున్నాము కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, భాష పేరుతో...

ఎందుకిలా పతనమైపోతున్నాము ఆలోచనలేక, వివేచన లేక, విచక్షణ లేక, కరుణ లేక, సామాజిక బాద్యత లేక..



మన నెత్తురు చల్లారి పాయిందా ..మనకు మన దేశ సంక్షేమం మనకు పట్టదా ..

మన దేశాన్ని గొప్ప దేశంగా నిర్మించవలసిన బాద్యత మనకు లేదా ..



ఆర్దికంగా పెరుగుతున్నాము .. ఆత్మహత్యలూ ఆపలేక పోతున్నాము ..

భవనాలు కడుతున్నాము ...మురికి వాడలు పెంచుతున్నాము..



ప్రతి భారతీయుడు ఆత్మవిమర్శ చేసుకోవలసిన సంధి సమయం ..

మన భవిష్యత్తుకోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానీయులకు మొక్కి వారి అడుగు జాడలను అనుసరించవలసిన అవసరం ..

నవ భారత నిర్మాణానికి నేను సైతం అంటూ నడుం కట్టవలసిన తరుణం..





















Thursday, September 6, 2012

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా



వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా

కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను
ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను
పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా
నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిన నాడు నన్ను కటిక వాని పాల్జేస్తే
ఉసురు కోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవోయి
నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయి
నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయి
నా వల్లే ఢంకాలకు నాదం పుట్టించునోయి


వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

నా కొమ్ములే దువ్వెనలై మీ తల చిక్కులను తీర్చు
నే కల్పించిన విభూది మీ నొసటను రాణించు
నా రాకయే మీ ఇంట్లో శుబములెన్నో కలిగించు
నా చేయుతయే చివరకు వైతరణిని దాటించు

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా





రచన: కొసరాజు చిత్రం: గోవుల గోపన్న





Wednesday, September 5, 2012

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది
గురువు గారి స్ఫూర్తి తోనే నా ఉత్సాహం ఉరకలెత్తి కదిలింది

నేను చేసే ప్రతి పనిలోనూ....నేను పొందే ప్రతి ప్రగతిలోనూ..
గురువు గారి బోదనయే దాగుందని..
గురువు గారి బోదనయే దాగుందని..నా విద్యాబ్యాసం అనునిత్యం గుర్తుచేస్తూ ఉంటుంది..

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది

గురువు గారి స్ఫూర్తి తోనే నా ఉత్సాహం ఉరకలెత్తి కదిలింది

నిలకడైన దృష్టి లేక..సరి అయిన ఊహ లేక..నేనెంత గురువు గారిని విసిగించిననూ..
గురువుగారి ఓర్పు నాలో..

గురువుగారి ఓర్పు నాలో.. నేర్పుతోటి మార్పు నిచ్చి అలుపెరుగక నడిపింది..

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది

గురువు గారి స్ఫూర్తి తోనే నా ఉత్సాహం ఉరకలెత్తి కదిలింది
నీతి కోసం నిజాయితీ కోసం సాదారణ జీవితాన్ని గడిపారు మా గురువు గారు అని తెలిసి..

నా అందలాలు కీర్తి ప్రతిష్టలు అధికారం సమస్తం...
నా అందలాలు కీర్తి ప్రతిష్టలు అధికారం సమస్తం...అయన పాదాలకు శిరస్సు వంచి నమస్కరించింది..

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది

గురువు గారి స్ఫూర్తి తోనే నా ఉత్సాహం ఉరకలెత్తి కదిలింది
గురువు గారి బోధనే బోదివృక్షం నాకు.. గురువు గారి దీవేనెలే సుప్రభాతం ప్రభాకారా నాకు

చదువుకున్న ఆ రోజులు మరల మరల గుర్తుకు రాగా...
చదువుకున్న ఆ రోజులు మరల మరల గుర్తుకు రాగా...నా దేహం నిలువెల్లా గురునామ స్మరణ చేస్తూ పులకరించి పోయింది..

గురువు గారి మాటతోనే నా లక్ష్యం లక్ష దీపాలై వెలిగింది
గురువు గారి స్ఫూర్తి తోనే నా ఉత్సాహం ఉరకలెత్తి కదిలింది



--నాకు విద్య నేర్పి నా ఎదుగుదలకు కారణమైన నా గురువులందరికి అంకితమిస్తూ.....ప్రభాకర రావు కోటపాటి









Thursday, August 2, 2012

రేపటి పౌరులు మీరు...ఈ దేశగతిని మార్చగల శక్తులు మీరు..


పవిత్ర భూమి మనది...ప్రపంచానికే విజ్ఞాన దాత మనం..

రేపటి పౌరులు మీరు...ఈ దేశగతిని మార్చగల శక్తులు మీరు..


న్యాయమైన మార్గాలలో నడవండి...నాయకులై వెలగండి..


సుడిగుండాల సమూహం ఈ సమాజం..

చాకచక్యంతో చరించాలి...

తెలివితేటలతో తేజస్సు పొందాలి..

మానవత్వంతో మార్పు తేవాలి..

నాయకత్వంతో ఇతరులను నడిపించాలి...



ఓర్పుతో ఓటములను విజయాలుగా మార్చండి..

స్నేహముతో సేవకులను నాయకులుగా మార్చండి..

మానసిక శక్తితో మనుషులను బలవంతులు గా మార్చండి

విలువల ప్రచారముతో విగత సంస్కృతులను వినూత్న స్రవంతులుగా మార్చండి..

మీ ప్రతి అడుగు అభివృద్ధి వైపు..

మీ ప్రతి తలపు పరిష్కారము వైపు..

మీ ప్రతి చూపు నిజాయితీ వైపు..

మీ ప్రతి పిలుపు సర్వ స్వతంత్రత వైపు..


ఆత్మాభిమానం మీ ఆభరణం గా..


స్వయం సమృద్ది మీ సంకీర్తన గా..

ప్రతి పౌరుని వ్యక్తిత్వ వికాసమే మీ విప్లవ గీతంగా..

భారతదేశ విశ్వ నాయకత్వమే ప్రతి ఒక్కరి జీవిత ధ్యేయంగా ..


అలుపులేని, చెదరిపోని, ఆగిపోని అంతములేని నిరంతర ప్రయత్నం చేయండి...
రెండవ జాతీయ ఉద్యమాన్ని నడపండి...అగ్రగామి భారత్ ను నిర్మించండి...


లీడ్ ఇండియా!