Saturday, January 30, 2021

ఓడిపోతావు అన్న వారికి గెలిచి చూపించు

ఓడిపోతావు అన్న వారికి గెలిచి చూపించు
పనికిరావు అన్నవారికి విశ్వరూపం చూపించు
పట్టుపడితే సాదించలేనిది లేదుఅని గుర్తించు
అడుగు అడుగు కదిలిశిఖరాన్ని అధిరోహించు

మూఢనమ్మకాలగోడలను తర్కంతో ఛేదించు
అబద్దాల అంధకారాన్ని జ్నానదీపంతో చూడు
వ్యక్తిపూజమాని నీ అనంతశక్తినిఆవిష్కరించు
చనిపోయినవారెవరూ బ్రతకలేదనితెలుసుకో 

ఆలోచించి మాట ఇవ్వు ఆనక వెను తిరగకు
మాటతప్పే మనిషి విలువ తరిగిపోక తప్పదు
కోట్ల ఆస్తి ఉన్నా నిజాయతీ లేక పోతే సున్నా
ఇతరుల నొప్పించనివానికి అనందం సొంతం

తలలేకపోతే వెర్రెక్కించటానికి వేలమందిసిద్దం
మన మతం కులం రంగు సంఘం అంటారు
విడిపోదాం పోరాడు అంతుచూద్దామంటారు
మన కంటిని మన వేలుతోనే పొడిపిస్తారు

జీవితంలో కష్టసుఖాలు మంచిచెడులమిళితం
కావాలసినది నైపుణ్యంతో సాధించు కోవాలి
ప్రలోభాలను చీల్చుకొని ప్రభాతసూర్యుడిలా 
కష్టాలకోరల భారిన పడక కర్మయోగిలా సాగు


   - ప్రభాకర రావు కోటపాటి
       30 జనవరి 2021



 



Tuesday, December 29, 2020

మర్చిపోవద్దు మనిషికి దేవుడిచ్చిన భాద్యత

ప్రతి ప్రాణిని ప్రత్యేకలతో పుట్టించే విదాత
మనిషిని చేసాడు మానవత్వమనే మట్టితో
తనకు ప్రతినిధిగా నాయకత్వమనే వాడితో 
నడపమన్నాడు ప్రతిజీవిని చెరగని ప్రేమతో 

భాద్యత మరచిన కొంతమంది స్వార్దబుద్దితో 
జీవిత లక్ష్యాన్ని వదిలిన వారు గందరగోళంలో
విచక్షణకొరవైనవారు విచ్చలవిడిఅలవాట్లతో 
మర్చుకుంటున్నారు జీవితాన్ని పెను భారంగా

మనుషుల అనేక సమస్యలు స్యయంకృతాలే
విదాత విదానాలను వదిలిన పర్యవసానాలే
సరళజీవితాన్ని సంక్లిష్టంగా మార్చుకోవటమే 
ఆదిదేవుడు మనిషికిచ్చినది మర్చిపోవటమే 

ఆప్యాయతఅనురాగమే ఆనందానికి పునాది 
సహజమైనఆహారం సంపూర్ణఆరోగ్యానికి రక్ష 
సకలజీవుల సంరక్షణ జీవసమతుల్యమూలం
అందుకే....
మర్చిపోవద్దు మనిషికి దేవుడిచ్చిన భాద్యత 


            -ప్రభాకరరావు కోటపాటి
              30 - డిసెంబర్ - 2020

Monday, November 30, 2020

వేయండి..వేయండి.. ఓటు వేయండి.

వేయండి..వేయండి.. ఓటు వేయండి.
నిప్పు లాంటి నాయకులను ఎన్నుకోండి.
సమాజం కోసం పాటుపడే.. సిసలైన అభ్యర్థులను వెతికి ఎన్నుకోండి.
అవినీతి, అహంకారం, అరాచకాలను..
కూకటి వేళ్లతో పెకలించండి.

నిజాయతీకి చోటు లేదని..
ఊక దంపుడు ఉపన్యాసాలు మానండి.
ఈ దేశ భవిష్యత్తును మార్చే మీ శక్తిని..
గుర్తించి విశ్లేషించి విచక్షణతో వాడండి.
రకరకాల ప్రలోభాలవలలను వదిలించుకుని..
ఉదయభానునిలా చీకటిని చీల్చి చెండాడండి.
గాడి తప్పుతున్న రాజకీయాలకు..
ముక్కుతాడువేసే మొనగాళ్లను గెలిపించండి.

తీరిక లేదని..ఓపిక లేదని..ఓటు మానకు..
అడుగడుగునా మన నడక మార్చేది ఎన్నిక.
ఒక్కఓటుతో వచ్చేలోటు ఎమిటి అనకు..
ఓటుకు ఓటు కలిస్తే జరిగేదే అసలైన ఎంపిక.
ఇంటిలో కూర్చుని దేశంమారాలని చూడకు..
ఓటు అనే వజ్రాయుధాన్ని ఝుళిపించి సాగిక.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆలోచించకు..
ప్రజాస్వామ్యంఇచ్చినహక్కు సాధనకై కదిలిక.

వేయండి..వేయండి.. ఓటు వేయండి.
నిప్పు లాంటి నాయకులను ఎన్నుకోండి.
సమాజం కోసం పాటుపడే.. సిసలైన అభ్యర్థులను వెతికి ఎన్నుకోండి.
అవినీతి, అహంకారం, అరాచకాలను..
కూకటి వేళ్లతో పెకలించండి.


       - ప్రభాకర రావు కోటపాటి 

          30 - నవంబర్ - 2020


Friday, November 27, 2020

ఆకాశాన్ని అందుకొనే అనంత హిమగిరి సంపద ఉత్తరాన..
వేలకొద్దీ యోజనాల విస్తరించిన హిందూ మహా సముద్రము దక్షిణాన..
సర్వ సుందరమైన వన సంపదతో విలసిల్లే భగవంతుని స్వస్టలమేమో పశ్చిమాన..
సహజ సిద్దమైన తీర ప్రాంతాలకు ఆలవాలమైన అద్బుత దృశ్యాలు తూర్పున..
నర నరాలుగా అల్లుకొని జీవదారలుగా అలుపెరుగని నడకతో నదీ నదాలు..
ఆహా ఎంత అందమైనది నా దేశము..
ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఇక్కడ జననం..


హాయి నింపి అలరించే హిందుస్తానీ సంగీతం 
కర్ణ లాలస శోభాయమైన కర్నాటక సంగీతం 
విలక్షణ కళల కాణాచి కూచిపూడి నృత్యం
భావాలకు భవ్యరూప ప్రదర్శన భరతనాట్యం 
సమ్మోహన సంగీతాభినయ మోహినియట్టం 
గుండెనుతాకే లోతైన గానలహిరి గజల్ ఝరి 
అహో ఎన్నిరకాల లలితకళల తల్లి నా దేశం 
ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఇక్కడ జననం..

పుష్టి నిండిన విశిష్ట రుచుల పంజాబీ వంటలు
శత రకాల శాకాహారాల హారం ఉడుపిరకాలు 
ఘుమఘుమ మసాలాల బిర్యానీ విందులు
అమృతానికి ప్రతిరూపాలు తీపి పదార్థాలు 
అన్నిరకాలప్రజలనుఅలరించే అల్పాహారాలు 
ఎన్ని రుచులను సృష్టించినది మన దేశం
ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఇక్కడ జననం..

అనేక భాషలు కానీ అంతులేని భావ సంపద 
పలురకాల మతాలు కానీ తరతరాల ఐక్యత 
విలక్షణవినోద విరాజితాలు పలుపర్వదినాలు
అనురాగాల ఆలయాలు కుటుంబ సంస్కృతి 
ప్రకృతితో కలసినడిచే జీవనవైద్య విదానాలు 
మనిషి మనుగడకు మార్గదర్శి మన దేశం
ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఇక్కడ జననం..

మనదేశ అందాలను ఆలకించు పరిరక్షించు
మనకళల ఝరిలో విహరించు ప్రొత్సహించు
ఆరోగ్యహిత రుచులు ఆస్వాదించు సృష్టించు
భారతీయులు ఒకేకుటుంబం అని మరువద్దు
మనఐక్యతదెబ్బతీసే ప్రలోభాలకు లొంగవద్దు 

           - ప్రభాకర రావు కోటపాటి 
                27 నవంబరు 2020

Sunday, October 11, 2020

మన అవసరాలకు చివరి చిరునామా ప్రకృతి

విరిజల్లులకు పరవశించే.. 
వరిచేల వయ్యారం చూడు
పిల్లగాలులకు తలలూపే..
జొన్నచేల సంబరం చూడు
నులివెచ్చని కిరణాలకు మెరిసిపోయే..
కందిచేల అందం చూడు
మేఘాలను తాకి పులకరించే..
తాటిచెట్టుల సందోహం చూడు 
ప్రకృతి స్పర్శతో  అవి పొందే అనందం చూడు

పచ్చ గడ్డి తిని స్వచ్ఛమైన పాలిచ్చే..
గంగి గోవుల గొప్పతనం చూడు
వట్టి మట్టి తిని సత్తువైన ఎరువునిచ్చే..
వాన పాముల అద్భుతం చూడు
ఏది పెట్టినా తిని తరగని ప్రేమ చూపే..
శునకముల స్నేహభావం చూడు
పువ్వు పువ్వు పై ఎగిరి ఫలీదకరీంచే..
తుమ్మెదల సహకారం చూడు
మనిషికోసం తోటిజీవుల సంఘీభావం చూడు

ప్లాస్టిక్ సంచులు సీసాలు విసిరేస్తే..
వినాశనమవుతున్న జీవులను గమనించు 
మత్తు పదార్దాలను విచ్చలవిడిగా వాడే..
వ్యసనపరుల చివరి అవస్తలను గమనించు
సహజ ఆహార నియమాలను వదిలేస్తే..
విరుచుకుపడే విచిత్ర రోగాలను గమనించు 
పచ్చటి చెట్లను కొట్టేసి కాంక్రీటు నింపితే..
ఉక్కపోతతోమగ్గిపోయే జనులను గమనించు
మనిషికి ఇతర జీవుల శైలికి తేడా గమనించు 

జీవులమనుగడ ఆనందానికి ఆధారం ప్రకృతి
నియమాలు పాటించేవారికి సొంతం ప్రకృతి
కోట్లకు పడగలెత్తిన వారికీ అతీతం ప్రకృతి 
దారి తప్పిన వారికి సింహ స్వప్నం ప్రకృతి 
మన అవసరాలకు చివరి చిరునామా ప్రకృతి 

   - ప్రభాకర రావు కోటపాటి
       11- అక్టోబర్ - 2020
 






Sunday, September 27, 2020

ఇన్ని గొప్పతనాల సమ్మిళితమే..శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యంగారి జీవితం..

ఎన్ని స్వరాలు, ఎన్ని రసాలు, ఎన్ని భావాలు 
అన్నిటికీ చెరగనిచిరునామా మన బాలుగారు
సినీసంగీతానికి తరగనిసంపద అయన గానం
అనేక చిత్రాల విజయానికి ఆధారం ఆ గాత్రం 
తెలుగు భాష కు అయన స్వరమే ఒక వరం 

విదాత తలపున అంటూ ఆలపించినా
సంభవం నీకే సంభవం అంటూ గర్జించినా
పుణ్య భూమి నాదేశం అంటూ మేల్కొలిపినా
శంకరా నాద శరీరా పరా అని ప్రార్దించినా
సంగీత ప్రియులకు అదొక స్వర్గ విహారం 

దశాబ్దాలుగా ఆ గళం నుండి ఆణిముత్యాలు
అలసిసొలసిన మనుషులకు వీనులవిందులు
కొండలలో నెలకొన్న దేవునికి మేలుకొలుపులు
ఎన్నెనో జన్మలకు తరిగిపోని ప్రేమ సంపదలు
తన దరికిరాని వనాలకోసం ఎన్నో వసంతాలు
తర తరాలను తరింప చేసే గందర్వ గానం

కృషిఉంటేమనుషులుఋషులౌతారనిసాక్ష్యం
పాడుతాతీయగాతో భావిగాయకులకుజననం
గేయ రచయితలకు  సముచిత సత్కారం 
సంగీతదర్శకుల తెరవెనుకశ్రమకుప్రోత్సాహం
తీయనైనతెలుగుకుతేనెలు అద్దినఅభిమానం 

ఇన్ని గొప్పతనాల సమ్మిళితమే..శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యంగారి జీవితం..

గగన శిఖలకు ఎగిసిపోయినా.. అయన అందించిన స్వరసంపద మన గుండెలలో పదిలం..

అయన అడుగు జాడలలో నడిచి..
పది కాలాలు గుర్తుంచుకొనే సేవలు అందించటమే..మనందరి కర్తవ్యం..


      - ప్రభాకర రావు కోటపాటి 
          27 - సెప్టెంబర్ - 2020
 

Sunday, September 13, 2020

చెడులను చాకచక్యంగా గెలవటమే బ్రతకడం

మెరిసేది అంతా బంగారం కాదు 
తెల్లగా ఉన్నవి అన్నీ పాలు కాదు 
అబద్దాలకుండే  అందము నిజానికి ఉండదు
తెలుసుకొనే శక్తి లేకపోతే మోసపోక తప్పదు 

రంగు కళ్లజోడు దరిస్తే ఆకాశం రంగు మారదు 
చెత్తలో నిప్పు దాచిపెడితే మండక మానదు 
వెర్రి మొర్రి అభిమానాలతో ఒరిగేదేమీ లేదు 
నిజ నాయకుల సాహవాసానికి తిరుగులేదు 

పంతాలుపట్టింపుల కంటే ఫలితాలు ముఖ్యం
ఎదుటివారిలో మార్పుకోసం మమతేమూలం
లోకం మనలా ఆలోచించాలి అనేదే అవివేకం
కూర్పుచేర్పు నేర్పు ఓర్పులతో ఏదైనాసాద్యం 

అహంకారమే అన్నింటికీ మించిన అనారోగ్యం
పెద్దతోపుఅయినా తనకుమించినది న్యాయం
దురహంకారం దుర్మార్గం దర్మ కాలాఙికి దగ్దం
పైశాచికఆనందఅభిలాషికి తుదకుశిక్షఖాయం 
 
జీవితమంటే అర్దంచేసుకోవటం అర్దంకావటం
ప్రతిమనిషిలో మంచిచెడు ఉండటం సహజం
చెడులను చాకచక్యంగా గెలవటమే బ్రతకడం 
అందరినీకలుపుకుని నడవటమే నాయకత్వం


       - ప్రభాకర రావు కోటపాటి
          13 -  సెప్టెంబర్ - 2020