విద్య దాగిలేదు పుస్తకాలలో.. విద్య దాగిఉంది మానవుల మస్తాకాలలో...... దాగి ఉన్న ఆ విద్యను వెలికితీసి మేల్కొలిపే ప్రయత్నమే నా ఈ యజ్ఞం.......
Thursday, December 24, 2009
మానవ సేవే మాధవ సేవ
అధ్యయనంచేయాలి సామాజిక సమస్యలను నిగూఢముగా
ప్రయత్నించాలి గ్రామసమస్యలను పరిష్కరించే దిశగా
నడిపించాలి నీతోటివారిని అభివ్రుద్దిపదములో భాగముగా
కలిగిఉండాలి సేవాభావమును ఉత్తమమానవీయ లక్షణముగా
మరిచిపోవాలి ధనసంపాదనను ప్రాదమికలక్ష్యముగా
వెలిగించాలి నీవిఙ్ఞానశక్తులను భాదితులదిశానిర్దేశాలుగా
పెంపొందించాలి వ్రుక్షజాతిని విస్త్రుతముగా
పరివర్తనచేయాలి నీవ్యక్తిత్వబలమును ఒకసమ్మోహనశక్తిగా
భావించాలి నీతోటివారిసమస్యలను నీభాద్యతగా
కదలాలి ఏకాగ్రచిత్తమున సేవాసైనికునిగా
ప్రేరేపించాలి సోమరిపోతులను లక్ష్యబద్దజీవులుగా
రూపొందించాలి అభివ్రుద్దిప్రణాలికలను నిశితముగా
ప్రేమించాలి సర్వజనసమూహములను సోదరసమానముగా
తీర్చిదిద్దాలి యువకులను సమసమాజనాయకులుగా
జీవించాలి మానవసేవయే మాధవసేవగా
------ప్రభాకర రావు కోటపాటి
Monday, December 7, 2009
సంరక్షించు నీ తోటి మానవులను
కాలం కాని కాలం లొ కాలసర్పాలను పోలిన వర్షాలు
పొరలి పొంగి ప్రళయంలా ప్రవహంచిన నదులు
మునిగి మగ్గి మ్రుత్యుభాదతొ మనస్సు చలించిన భాదితులు
చెదరిపొయి చేయలేక చేతగాక చేస్టలుడిగిన ప్రజలు
జీవులను జీవితాలను జనావాసాలను జలదరింపచేసిన జలప్రళయం
వీక్షించి విలవిలలాడి విరాలాలిచ్చిన కార్పోరేట్ సంస్థల ఉద్యోగులు
సందర్శించి సమీక్షించి సహకరించిన నిర్వాహకులు
తరలివచ్చి తమదర్మాన్నిపాటించిన త్యాగధనులైన యువకులు
సమయాన్ని వెచ్చించి స్వార్దరహితముగా సేవలుచెసిన స్వచ్చందసేవకులు
పర్యవేక్షించి ప్రతిక్షణము పొత్సాహించిన దిశానిర్దేశకులు
అనుకోని ఆప్తులను వస్తువులను చూసి ఆశ్చర్యముతో ఆనందపరవసులైన వరదభాదితులు
సంచి మరియు పుస్తకాలను చూసి సంబరముతో స్పూర్తిపొందిన పాఠశాల విద్యార్దులు
ఉదార సహాయముతో ఊరటతో ఉపశమనము పొందిన బాధా సర్పదస్టులు
నడచివచ్చిన నాయకులనుచూసి నమ్మకము పొందిన భావిపౌరులు
సమూహముగావచ్చిన సొదరప్రేమనుచూసి స్వాంతనపొందిన అన్నదాతలు
కనిపించాయి కర్రలతోకట్టి చీరలు కప్పిన నివాసాలు
సాక్షాత్కరించాయి పిల్లలు రాక మూతపడిన పాఠశాలలు
దర్శనమిచ్చాయి నీరుప్రవహించి కోసుకుపోయిన రహదారులు
స్వాగతమిచ్చాయి మేటవేసి నేలకొరిగిన పొలాలు
సాక్షమిచ్చాయి వరదవుద్రుతికి కూలిపొయిన వ్రుక్షాలు
సహాయకుల ఆదరణకు చెమ్మగిల్లాయి వయోవ్రుద్దుల కళ్ళు
సేవకుల సహాయాన్ని పొగిడాయి భాదితుల నొళ్ళు
దాతల బహుమానాలకు నర్తించాయి పిల్లల కాళ్ళు
విరాళాల ఇంటిసామానులకు పండుగ జరిపాయి ప్రజల ఇల్లు
కార్పోరేట్ సంస్థల కొరకు వినిపించాయి పొగడ్తల జల్లు
చాలాఉంది చేయవలసినది......
నిర్మించాలి నిలపెట్టాలి నివాసాలను
ప్రారంబించాలి ప్రోత్సాహించాలి పాఠశాలలను
ప్రణాలికవేయాలి పటిష్టముచేయాలి రహదారులను
విద్యనందించాలి వివేకులనుచేయాలి ప్రజలను
దారిచుపాలి ధైర్యమివ్వాలి భావిపౌరులకు
--ఫ్రభాకర రావు కోటపాటి
Monday, November 30, 2009
యువకులకు స్పూర్తి భగత్ సింగ్ (September 27, 1907 – March 23, 1931)
పాల్గొన్నావు పదిహేడేళ్ళ ప్రాయాన సహాయ నిరాకరణ ఉద్యమమందు
నిలిచావు లాలాలజపతిరాయి సరసన సైమన్ కమీషన్ నిరసనందు
అమలుపరిచావు ఆంగ్లపాలకుల భాహిష్కరణ పధకాలను వీర ఉద్వేగమందు
గడిపావు జైలు జీవితాన్ని దేశమాత విముక్తి ప్రేరణయందు
మారలేదు నీ ఆత్మవిశ్వాసము ప్రతికూల పరిస్తితులందు
వీడలేదు నీ స్వాతంత్రావేశము ముష్కరుల ప్రలోభమందు
చెదరలేదు నీ ధీరోదాత్తము నియంతల రక్త దాహమందు
కదలలేదు నీ విప్లవసామర్ధ్యము దుర్భలుల దురాఘాతమందు
నీ కన్నులు కన్నాయి దేశఉజ్యలభవిష్యత్తు కలలలో
నీ ఉహాలు ఊగాయి స్వేచ్చాభారత విహంగాలలో
నీ మాటలు సాగాయి ఉత్ప్రేరిత తరంగాలలో
నీ రచనలు రాసాయి ప్రజ్యలిత ప్రకరాణాలలో
జాతి కోసము పని చేసావు ప్రానాంకిత భావనతో
దేశముకోసము కదిలి సాగావు క్రియాశీల త్రికరణశుద్ధితో
ప్రజలకోసము జ్వలింప చేసావు మార్గదర్శకమైన ఆత్మశక్తితో
ఉజ్వలభారతికోసము ప్రాణాలు అర్పించావు ఇరవైమూడేల్లప్రాయముతో
నీవు దర్శించిన ఆ స్వేచ్చా భారతి ఆవిష్కరించపడింది......కానీ......పెరుగుతోంది.........
మానశిక ప్రలోభులైన యువత
దుర్వ్యసనాల అశ్రితులైన నవరక్తం
ర్యాగింగ్ పిపాసులైన విద్యార్ధిలోకం
యాసిడ్ దారులైన రాక్షసలోకం
అమలు జరుగుతున్నాయి........
లక్ష్యరహిత జీవన విధానాలు
పాశ్చాత్య సంస్కృతి బానిసతత్వాలు
నిరంతర వినోదపూరిత వికృత చేష్టలు
సోదర సోదరీ పీడిత స్వార్ధ భరిత ప్రణాలికలు
ఓ వీరకిశోరమా ఆవహించి కరుణను కల్గించు ఆ ఉన్మాదులలో
ఓ భారతరత్నమా ప్రసరించి ప్రేమను ప్రేరేపించు ఆ ప్రభుద్దులలో
ఓ యువచైతన్యమా సంరక్షించి సేవను సంస్కరించు ఆ కీచకులలో
ఓ ఉత్తేజితతరంగమా జ్వలించి వెలుగును వెదజల్లు ఆ అధములలో
వెళ్ళిపోయారు ఆంగ్లేయులు........వదలిపోలేదు సోమరితనము
కదలిపోయారు సామ్రాజ్యవాదులు........సమసిపోలేదు వ్యక్తిగతబలహీనతలు
అందుకే........ఆవహించు....నడిపించు....రగిలించు....కదిలించు....యువతను.....
వ్యక్తి అభివృద్ధి.... దేశభక్తి.... లక్ష్యసిద్ది....విచక్షణాశక్తి ....ప్రాతిపదికగా.....నడిచే......
రెండవ భారత జాతీయోద్యమము వైపు..................
------ప్రభాకర రావు కోటపాటి
Friday, September 4, 2009
పరిత్యజించవలసిన పదహారు దురలవాట్లు

పొందేవు పొగత్రాగి పరమానంద డోలికలు
గుర్తించకున్నావు గుప్తంగా శరీరమందు చీలికలు
మునిగిపోయేవు మధ్యమందు తేలియాడి తెలియనిలోకాలలో
తెలుసుకోలేవు తీవ్రంగాజరిగే కర్కశకోత కణజాలములలో
ఆస్వాదించేవు అతిరుచిప్రాదాన్య ఆహారమును సర్వమనేభావనలో
ఆహ్వానిస్తున్నావు అనారోగ్యాన్ని అనాలోచిత ఆనందాన్వేషణలో
కోరిచూసేవు కాలక్షేపముగా హింస కామపూరిత చిత్రములను
మరచిపోయేవు మానసికముగా దహించుకుపోయే దురాలోచనలను
విహారముచేసేవు విందులతో వినోదాలతో జీవితకాలాన్ని
జీర్నించుకోలేకున్నావు జీవన గమ్యరాహిత్యము లక్ష్యలేమిల నిర్జీవసామ్యాన్ని
వేర్రులుచాచేవు విలాసభారిత అవసరాలకొరకు ధనార్జనదారులందు
మునిగిపోతున్నావు మార్గరహితముగా ఉండిపోతున్నావు అప్పులవూబులందు
జీవనం సాగించేవు నిర్లక్ష్యముగా సోమరితనముతో బద్దకప్రపంచములో
ప్రయాణిస్తున్నావు అనాలోచితముగా అంధకారభూయిష్ట నిశ్రుహప్రపంచములో
కాలక్షేపముచేసేవు కాలహింసతో భావించి కాలము విలువలేని వస్తువని
విలువకట్టలేకున్నావు ఒక ఘడియ తిరిగిరాని సంపాదించలేని వజ్రసమానమని
బ్రమించేవు కులప్రీతి పరమతద్వేషములను ఘనకార్యయుక్తమని
విస్మరిస్తున్నావు సమైక్యత స్నేహపూరితసమాజము అభివృద్దికారకమని
అర్రులుచాచేవు అక్రమసంపాదన లంచములకోరకు స్వార్ధమే ధ్యేయమని
కానకున్నావు అది కాలసర్పమై సమస్తప్రజలను హరించివేస్తుందని
చొరబడి చొచ్చుకొని సాగేవు అడ్డదారులలో తాత్కాలిక లాభార్జన వృత్తి ధర్మమని
అర్ధముచేసుకోలేకున్నావు పరులసేవలో ఆనంద పారవశ్యం పొందగలవని
కొనసాగించేవు అబద్దము అవినీతి అసూయద్వేషాలతో అనుక్షణ సహజీవనము
త్యజిస్తున్నావు విశ్వాసము నిజాయితి సంప్రాప్తింప చేసే అనంత ఐశ్వర్య సర్వస్వము
మోహించేవు అహంభావము ఆవేశములను అద్భుత అలంకారములుగా
చూడలేకున్నావు అనుభందము అత్మీయతలను వ్యక్తిత్వశోభిత జ్యోతులుగా
ప్రతిభాశాలిగా విర్రవీగేవు విశ్వవిజ్ఞానిగా అప్రయోజకపఠనముచేసి అజ్ఞానముతో
అస్వాధించలేకున్నావు నిరంతర విద్యార్థిగా అనంత శాస్త్రరహస్యాలను వినయముతో
అభివర్నించేవు పవిత్రప్రేమగా ఆకర్షణ ఆత్మవంచనలకు ఆదిపీఠము వేసి అద్భుతముగా
చేరుకోలేకున్నావు శాశ్వత ప్రేమను మానసిక సౌందర్యాలను అంతర్గత విలువల ఆధారముగా
పొంగిపోయేవు విదేశీ సంస్కృతి విచ్చలవిడితనముతో సర్వస్వతంత్ర జీవన మాధుర్యమని
పొందజాలకున్నావు భరత సంస్కృతి మాత్రువాత్సల్యముతో సంరక్షించి నీకై దాచిన విజ్ఞానగని
పరిత్యజించు ఈ పదహారు దురలవాట్లను నిస్సందేహముగా
పరివర్తనచెందు క్రియాశీల దేశభక్తి సంపన్న సమాహారముగా
----ప్రభాకర రావు కోటపాటి
Thursday, September 3, 2009
జీవించటము అంటే......

నీవలన ఆనందమయమైన మనస్సులు
నీవలన గమ్యముదొరికిన మనుషులు
నీవలన విజ్ఞానవంతమైన జనులు
దానినే అంటారు జీవించటము......
నీ రాక కోసము ఎదురుచూసే చూపులు
నీ మాట కోసము రిక్కించిఉండే చెవులు
నీ శ్రేయస్సు కోసము ప్రార్దించే చేతులు
నీ విజయాల కోసము కలలుకనే కన్నులు
దానినే అంటారు జీవించటము......
ప్రామాణికాలుగా మారిన నీ జీవిత సంఘటనలు
విలువలుగా మారిన నీ వ్యక్తిగత సూత్రాలు
మార్గదర్శకముగా మారిన నీ నియమబద్ద నిర్ణయాలు
పరిశోదనలుగా మారిన నీ పరిష్కార ప్రభోదనలు
దానినే అంటారు జీవించటము......
వెంటరావు ఆస్తుల కోసము మన వెంపర్లాటలు
కలసిరావు ధనము కోసము మన కర్కోటకాలు
నడచిరావు కీర్తి కోసము మన నానాపాట్లు
తోడురావు కోరికల కోసము మన తత్తరపాట్లు
మనం మార్చిన పరిస్థితులు మనం కూర్చిన సిద్దాంతాలు
మనం దిద్దిన జీవితాలు మనం ఇచ్చిన ఉత్పత్తులు
మనం చేసిన మంచిపనులు మనం ఓదార్చిన హృదయాలు
మనం నిలపెట్టిన నిజాలు మనం పంచిన ప్రేమలు
అవే మనకు మిగిలేది అవే మనతో వచ్చేది
అవే మనకు దక్కేది అవే మనతో నిలబడేవి
అవే మనకు సంత్రుప్తులు అవే మన ఆనందాలు
అవే శాశ్వత సత్యాలు అవే నిరంతర నిక్షేపాలు
ఇదే మానవ జీవిత సారం......
దానినే అంటారు జీవించటము......
---- ప్రభాకర రావు కోటపాటి
Sunday, August 30, 2009
మనలో మనకు విశ్వాసం

భువిలో తుదకు సొంతం అభ్యుదయం
సృష్టిలో అందరి దేవుళ్ళకు మొక్కినాలేదు లాభం
దృష్టిలో శక్తిధర చూపులకు చేరకలదు మోక్షం
ధీరుల జీవితగాధల సంపుటం ప్రపంచ చరిత్ర
వీరుల త్యాగానిరతుల సంయుక్తం శోభిత ధరిత్రి
భగవంతుని యందు అవిశ్వాసం నాస్తికత్వం అన్నది గతం
ఆత్మశక్తిని పొందు అలక్ష్యం నాస్తికత్వం అన్నది నిజం
లేదు అసాద్యం ఈ భువిని కార్యసాధకునికి
పొందు నిరంతరం ఈ బలాన్ని సంకల్పవిజయానికి
బలహీనతల సాంగత్యం అనుకరణ మారుస్తుంది బలహీనునిగా
శక్తియుక్తుల అనుసంధానం సమాలోచన చేస్తుంది బలవంతునిగా
దుర్బలత్వం బలహీనతలు నిత్యప్రయాస కలిగిస్తాయి దైన్యం
ద్రుడసంకల్పం దైర్యసాహసాలు అకుంఠితదీక్ష పుట్టిస్తాయి ధైర్యం
నీ లక్ష్యాలు విడనాడకు సడలిపోకు భీరుల వాక్కులతో
నీ తలపులు మార్చుకోకు వదలిపెట్ట్తకు క్రౌర్యుల అక్రుత్యాలతో
చలించని మనఃస్థైర్యం నైపుణ్యపటిమే లక్ష్యసాధన మార్గం
విస్త్రుత ఊహాసంకల్పం పరిపూర్ణచైతన్యమే అనంతజీవిత పథం
మేలుకో జాగరూకుడవై మసలుకో సకలకాల సర్వావస్తలందు
చేరుకో కార్యసూరుడవై కదలిపో ప్రయత్నాల పూర్ణావస్తయందు
కష్టాల ముగింపు చేయగలశక్తి అవసారాల వైపు ప్రయాణశక్తి
దాగివున్నాయి నీ అంతరంగములో ప్రత్యక్షమవుతాయి నీ సర్వకార్యములలో
ధైర్యముతో నిలబడు సంపూర్ణబాద్యతతో చొరబడు
మచ్చలేనిచిత్తశుద్ది పవిత్రఅంతరంగం కారణం వివేకస్పూర్తికి
స్వీయశిక్షణాప్రవృత్తి వ్యక్తిత్వం సోపానం చైతన్యస్పూర్తికి
భావించు నిన్నునీవు సర్వశక్తివంతునిగా
విజ్రుంభించు కార్యసాధనవైపు ఉత్తుంగతరంగముగా
చింతించకు దిగులుచెందకు లేవని ఆస్తిపాస్తులు
గుర్తించు గమనించు నీలోని మానసికశక్తులు
అనంత దైవజ్వాలా కణజాలం మనదేహం
నిరంతర ప్రజ్వలా శోభితం మనమస్తిష్కం
సృజించగలం సాధించగలం మన ఆలోచనలు సమస్తం
మార్చగలం మలచగలం మన సమస్యలు ఆసాంతం
అందుకే..........
నిరంతర ఆత్మవిశ్వాసం అత్యావశ్యకం
Sunday, August 9, 2009
యోగ సూత్రాలను పాటించు......ఆరోగ్య భారతిని నిర్మించు..

మరచిపోవద్దు నిర్లక్షముచేయవద్దు యోగ సంస్కృతిని
ఆహ్వానించవద్దు ఆకర్షించవద్దు రోగ నిస్కృతిని
మునిగిపోవద్దు కలిసిపోవద్దు శోక సంద్రములో
చిక్కుకోవద్దు చీకిపోవద్దు విషవలయములో
జీవించవద్దు జీర్నమైపోవద్దు భ్రమప్రపంచములో
నింపుతుంది నిరంతరశక్తిని ప్రకృతి సహజాహారము
పెంచుతుంది జీర్ణశక్తిని నిరంతర జలసేవనము
రగిలిస్తుంది ప్రాణశక్తిని సక్రమ ప్రాణాయామము
ప్రేరేపిస్తుంది నాడీశక్తిని అద్భుత యోగాసనము
ఆవిష్కరిస్తుంది మనోశక్తిని ప్రతినిత్య ధ్యానము
విలువైనది నీ సమయము వృదాకానివ్వకు ఆసుపత్రిలో
శక్తివంతమైనది నీ విజ్ఞానము మునిగిపోనివ్వకు మందులఊబిలో
ఊహకందనిది నీ శరీరము బాధపెట్టకు శస్త్రచికిత్సలో
ప్రస్ఫుటమైనది నీ లక్ష్యము తుడిచిపెట్టకు రోగాలరొచ్చులో
పరిపూర్ణమైనది నీ ఆత్మానందము కరిగిపోనివ్వకు కష్టాలకడలిలో
ప్రతిసంధ్యవేళలో కాలినడక వ్యాయామము కల్పిస్తుంది సుఖజీవనము
ఆహారవ్యహారములలో క్రమశిక్షణాబద్ద జీవితము అందిస్తుంది ఆనందామ్రుతము
కీలనిర్ణయాలలో దూరదృష్టియుక్తము నిర్మిస్తుంది స్వర్గదామము
ఆలోచనలలో నియమసమాలోచనము బలపరుస్తుంది ఆత్మవిశ్వాసము
నిరంతరస్రవంతిలో పుస్తకపఠనము నింపుతుంది విజ్ఞానము
అంజలిఘటించి ఆత్మావలోకనముతో పాటించు మహర్షిపతంజలి సూత్రాలను
ప్రకృతిని ప్రేమించి ధర్మాచరణతో మేల్కొలుపు శారీరక శక్తులను
సక్రమముగా నడిచి క్రమశిక్షణతో సాధించు వ్యక్తిగత విజయాలను
పరిశోధించి సృజనాత్మకతతో సమర్పించు నూతన ఉత్పత్తులను
యోగజీవనము పాటించి నిత్యానందముతో నిర్మించు ఆరోగ్యభారతిని
-------------------------------------------ప్రభాకర రావు కోటపాటి

