Sunday, August 30, 2009

మనలో మనకు విశ్వాసం


మనలో మనకు విశ్వాసం అనవరతం
భువిలో తుదకు సొంతం అభ్యుదయం
సృష్టిలో అందరి దేవుళ్ళకు మొక్కినాలేదు లాభం
దృష్టిలో శక్తిధర చూపులకు చేరకలదు మోక్షం


ధీరుల జీవితగాధల సంపుటం ప్రపంచ చరిత్ర
వీరుల త్యాగానిరతుల సంయుక్తం శోభిత ధరిత్రి
భగవంతుని యందు అవిశ్వాసం నాస్తికత్వం అన్నది గతం
ఆత్మశక్తిని పొందు అలక్ష్యం నాస్తికత్వం అన్నది నిజం


లేదు అసాద్యం ఈ భువిని కార్యసాధకునికి
పొందు నిరంతరం ఈ బలాన్ని సంకల్పవిజయానికి
బలహీనతల సాంగత్యం అనుకరణ మారుస్తుంది బలహీనునిగా
శక్తియుక్తుల అనుసంధానం సమాలోచన చేస్తుంది బలవంతునిగా


దుర్బలత్వం బలహీనతలు నిత్యప్రయాస కలిగిస్తాయి దైన్యం
ద్రుడసంకల్పం దైర్యసాహసాలు అకుంఠితదీక్ష పుట్టిస్తాయి ధైర్యం
నీ లక్ష్యాలు విడనాడకు సడలిపోకు భీరుల వాక్కులతో
నీ తలపులు మార్చుకోకు వదలిపెట్ట్తకు క్రౌర్యుల అక్రుత్యాలతో


చలించని మనఃస్థైర్యం నైపుణ్యపటిమే లక్ష్యసాధన మార్గం
విస్త్రుత ఊహాసంకల్పం పరిపూర్ణచైతన్యమే అనంతజీవిత పథం
మేలుకో జాగరూకుడవై మసలుకో సకలకాల సర్వావస్తలందు
చేరుకో కార్యసూరుడవై కదలిపో ప్రయత్నాల పూర్ణావస్తయందు


కష్టాల ముగింపు చేయగలశక్తి అవసారాల వైపు ప్రయాణశక్తి
బలహీనతలను జయించగలశక్తి విజయము వైపు ఏకాగ్రతాశక్తి
దాగివున్నాయి నీ అంతరంగములో ప్రత్యక్షమవుతాయి నీ సర్వకార్యములలో
నిలుస్తాయి నీ సంరక్షణలో ప్రేరేపిస్తాయి నీ పురోభివ్రుద్దిలో

ధైర్యముతో నిలబడు సంపూర్ణబాద్యతతో చొరబడు
నమ్మకముతో ప్రయత్నించు అనంత ఆత్మశక్తి తో సాధించు
మచ్చలేనిచిత్తశుద్ది పవిత్రఅంతరంగం కారణం వివేకస్పూర్తికి
స్వీయశిక్షణాప్రవృత్తి వ్యక్తిత్వం సోపానం చైతన్యస్పూర్తికి


భావించు నిన్నునీవు సర్వశక్తివంతునిగా
విజ్రుంభించు కార్యసాధనవైపు ఉత్తుంగతరంగముగా
చింతించకు దిగులుచెందకు లేవని ఆస్తిపాస్తులు
గుర్తించు గమనించు నీలోని మానసికశక్తులు


అనంత దైవజ్వాలా కణజాలం మనదేహం
నిరంతర ప్రజ్వలా శోభితం మనమస్తిష్కం
సృజించగలం సాధించగలం మన ఆలోచనలు సమస్తం
మార్చగలం మలచగలం మన సమస్యలు ఆసాంతం


అందుకే..........


నిరంతర ఆత్మవిశ్వాసం అత్యావశ్యకం


..............స్వామి వివేకానంద రచనల ఆధారముతో ......ప్రభాకర రావు కోటపాటి

Sunday, August 9, 2009

యోగ సూత్రాలను పాటించు......ఆరోగ్య భారతిని నిర్మించు..


మరచిపోవద్దు నిర్లక్షముచేయవద్దు యోగ సంస్కృతిని
ఆహ్వానించవద్దు ఆకర్షించవద్దు రోగ నిస్కృతిని
మునిగిపోవద్దు కలిసిపోవద్దు శోక సంద్రములో
చిక్కుకోవద్దు చీకిపోవద్దు విషవలయములో
జీవించవద్దు జీర్నమైపోవద్దు భ్రమప్రపంచములో


నింపుతుంది నిరంతరశక్తిని ప్రకృతి సహజాహారము
పెంచుతుంది జీర్ణశక్తిని నిరంతర జలసేవనము
రగిలిస్తుంది ప్రాణశక్తిని సక్రమ ప్రాణాయామము
ప్రేరేపిస్తుంది నాడీశక్తిని అద్భుత యోగాసనము
ఆవిష్కరిస్తుంది మనోశక్తిని ప్రతినిత్య ధ్యానము


విలువైనది నీ సమయము వృదాకానివ్వకు ఆసుపత్రిలో
శక్తివంతమైనది నీ విజ్ఞానము మునిగిపోనివ్వకు మందులఊబిలో
ఊహకందనిది నీ శరీరము బాధపెట్టకు శస్త్రచికిత్సలో
ప్రస్ఫుటమైనది నీ లక్ష్యము తుడిచిపెట్టకు రోగాలరొచ్చులో
పరిపూర్ణమైనది నీ ఆత్మానందము కరిగిపోనివ్వకు కష్టాలకడలిలో



ప్రతిసంధ్యవేళలో కాలినడక వ్యాయామము కల్పిస్తుంది సుఖజీవనము
ఆహారవ్యహారములలో క్రమశిక్షణాబద్ద జీవితము అందిస్తుంది ఆనందామ్రుతము
కీలనిర్ణయాలలో దూరదృష్టియుక్తము నిర్మిస్తుంది స్వర్గదామము
ఆలోచనలలో నియమసమాలోచనము బలపరుస్తుంది ఆత్మవిశ్వాసము
నిరంతరస్రవంతిలో పుస్తకపఠనము నింపుతుంది విజ్ఞానము


అంజలిఘటించి ఆత్మావలోకనముతో పాటించు మహర్షిపతంజలి సూత్రాలను
ప్రకృతిని ప్రేమించి ధర్మాచరణతో మేల్కొలుపు శారీరక శక్తులను
సక్రమముగా నడిచి క్రమశిక్షణతో సాధించు వ్యక్తిగత విజయాలను
పరిశోధించి సృజనాత్మకతతో సమర్పించు నూతన ఉత్పత్తులను
యోగజీవనము పాటించి నిత్యానందముతో నిర్మించు ఆరోగ్యభారతిని



-------------------------------------------ప్రభాకర రావు కోటపాటి

Monday, August 3, 2009

నశించిపోయే ప్రతి ఒక వృక్షం.......జీవకోటిదహనానికి అది ఒక కాష్టం.


నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం

వర్షరాహిత్యముతో బీళ్ళయిపోయే పొలాలు
విషతుల్యముతో నిండిపోయే గాలులు
అధికధరలతో మండిపోయే సరుకులు
విపరీతవేడితో అల్లాడిపోయే జీవులు
ప్రాణభయముతో వణికిపోయే మనుషులు

వస్తున్నాయి ఆరోజులు తెలుసుకో
కుదిపేస్తాయి జీవితాలు మేలుకో

నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం

తగ్గించాలి ప్లాస్టిక్ పదార్దాల వాడకం
కట్టిపెట్టాలి అతి ప్రయాణాల ఇంధనం
పొదుపుచేయాలి అనవసర విద్యుతుల వినియోగం
ఆపివేయాలి మధ్యమందు సీసాల విసిరివేయటం
నిర్వహించాలి వ్యర్ధ పదార్ధాల సేకరణం

కదిలిపో అలుపెరుగని కార్యాచరణతో
ఉండిపో తరిగిపోని పచ్చదనము తో

నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం

తరిగిపోతున్న వ్యవసాయ భూములు
కృంగిపోతున్న భూగర్భ జలరాశులు
కురుస్తున్న అతినీలలోహిత కిరణాలు
కనుమరుగైపోతున్న విస్తృతజంతు జీవరాశులు
ప్రభలిపోతున్న విస్తృతరోగకారక వైరస్ లు

వినిపించుటలేదా ఆ ప్రమాద ఘంటికలు
తలపించుటలేదా యమ పద ఘట్టనలు

నశించిపోయే ప్రతి ఒక వృక్షం
జీవకోటిదహనానికి అది ఒక కాష్టం
విలయప్రకృతికి సాగే ఒక శ్రీకారం
క్షామానికి చేరే ఒక ప్రయాణం

సస్యశ్యామలముగా మారాలి బంజరుభూములు
పుష్కలముగా కావాలి భూగర్భ జలరాశులు
నిరంతరముగా చేయాలి వృక్ష ప్రణాళికలు
పరిమితముగా వాడాలి కాగితపు ఉత్పత్తులు
ప్రళయవేగంగా రావాలి ప్రకృతిరక్షణపధకాలు


విద్యార్దులంతా....
ఉపాద్యాయులంతా....
ఉద్యోగులంతా ....
వ్యాపారులంతా ....
వ్యవసాయదారులంతా ....
నాయకులంతా....
విజ్ఞానవేత్తలంతా....



కలిసి నడిపించాలి ఈ హరిత విప్లవం....
కలిసి ఆపాలి రాబోయే ఆ క్షామం.




----------------------ప్రభాకర రావు కోటపాటి

Monday, July 27, 2009

సమర్పించాలని ఉంది జీవితాన్ని వారి సేవలో

ఏమా ప్రేమామృతము
ఏమా ఆనందసందోహము
ఏమా అనుభందబాందవ్యము
ఏమా పవిత్రస్నేహము

హ్రుదయము ద్రవించింది
ఉత్సాహము ఉప్పెనయింది
ప్రాయము బాల్యమయింది
జీవితము ధన్యమయింది

ఆ చిన్నారులు చూపించే చలనశక్తి తో
ఆ బాలలు ప్ర దర్షించే ప్రజ్ఞాశక్తి తో
ఆ విద్యార్దులు ఆవిష్కరించే అనురక్తి తో
ఆ భావిపౌరులు పలుకరించే పరమభక్తి తో

అన్నా అని కొందరు
అంకుల్ అని కొందరు
సార్ అని కొందరు
ఓహో అని అందరు

మనస్సుని తట్టి కదిలించారు
ఉషస్సుని లేపి ప్రోత్సహించారు
తేజస్సుని చూపి తరింపచేసారు
శ్రేయస్సుని కోరి దీవించారు

ఏమీకాను వారికి నేను
తొలిసారి చూసారు నన్ను
అడ్డుకాలేదు అవేవి వారికి
తెలిసింది ఒక్కటే ఆప్యాయత

ఆడమంటే ఆపాదకమస్తము ఆకర్షించారు
పాడమంటే పదామృతము కురిపించారు
పనిచేయమంటే పరిపూర్ణతత్వము చూపించారు
మొక్కలునాటమంటే హర్శాతిరేఖము వర్షించారు

భావిభారతికి అభ్యుదయ జ్యోతులు వారు
మనజాతికి పూర్ణోదయ కాంతులు వారు

స్వర్ణ భారతికి ఉషోదయ స్ఫూర్తులు వారు
మనసమాజానికి అరుణోదయ హారతులు వారు

లేదు వారివద్ద ధనభలము కానీవారు ఆనందగనులు
లేరు వారిచెంత రక్తసంబందీకులు కానీవారు సర్వస్వతంత్రులు
లేవు వారికి విస్త్రుతదుస్తులు కానీవారు వినయసంపన్నులు
లభించవు వారికి అనంతాహారములు కానీవారు నటరాజస్వరూపులు

గడపాలనిపిస్తుంది అన్నివేళలా వారి సాంగత్యములో
నడవాలనిపిస్తుంది ఎల్లవేళలా వారి నాయకత్వములో
ఉండిపోవాలనిపిస్తుంది సర్వవేళలా వారి సహచర్యములో


సమర్పించాలనిపిస్తుంది జీవితాలను వారి సేవలో

-------------------------------ప్రభాకర రావు కోటపాటి

Monday, June 29, 2009

సమ్మోహనాస్త్రము నీ సంస్కారము




ఉత్తేజితము ఉత్తుంగతరంగము నీ దరహాసము
కదిలిస్తుంది కరిగిస్తుంది కఠిన పాషానములను

తేజస్వితము తత్వమయము నీ నేత్రామ్రుతము
జ్యలింపచేస్తుంది జీవింపచేస్తుంది జీవశ్చవాలను

కర్ణామృతము కోమలసద్రుశ్యము నీ సంభాషనామ్రుతము
మురిపింపచేస్తుంది మైమరిపింపచేస్తుంది మూర్ఖశికామనులను

శక్తివంతము శతగ్నిసమానము నీ ఆలోచనామృతము
ప్రజ్వలింపచేస్తింది ప్రేరేపిస్తుంది నిరర్దకప్రభుద్దులను

విశ్వవిప్లవము విరూపాక్షము నీ విశాలహృదయము

దయచూపిస్తుంది దరిచేరుస్తుంది బాదాసర్పదస్టులను

వజ్రసమానము వేదవందితము నీ నిస్పక్షపాతతత్వము
కనువిప్పుకలిగిస్తుంది కల్లోలపెడుతుంది సంకుచిత స్వార్దపరులును

క్రమశిక్షనాబద్దము క్రియాశీలము నీ కర్తవ్యపాలనము
అబ్బురపరుస్తుంది ఆలోచింపచేస్తుంది సోమరి సోంబ్యేరులను

నిత్యనూతనము నవ్యవిప్లవము నీ నాయకత్వము
ప్రభావింపచేస్తుంది ప్రకాశింపచేస్తుంది మానసికప్రలోభులను

-------------------------------------ప్రభాకర రావు కోటపాటి

సంస్కరించే యోగికి స్వాగతము

ఒకప్పుడు తెలుగు సినిమా పాటలలో వ్యక్తిత్య వికాసము, విజ్ఞానము మరియు చక్కటి సాహిత్యము ఉండేవి. మంచిసంగీతము ఉన్న ఒక సినీ గీతానికి అర్దవంతమైన సాహిత్యాన్ని జోడించే ప్రయత్నమే ఈ పాట:

ఆమె:
రావోయి యోగి మమ్ కరుణించేయి రో
రావోయి యోగి మమ్ కదిలించేయి రో
రావోయి యోగి మమ్ రగిలించేయి రో
రావోయి యోగి నీతో నడిపించేయి రో
రావోయి యోగి నీతో నడిపించేయి రో

కోరస్ :
మేరా భరత్ హై సబ్సే మహాన్ హై
మేరా భరత్ హై సబ్సే మహాన్ హై
మేరా భరత్ హై సబ్సే మహాన్ హై
మేరా భరత్ హై సబ్సే మహాన్ హై

యోగి:

మీరంతా చేరి నాతో కలిసోస్తారా
మనమంతా కలిసి శక్తితో కదిలిపోదామా
ప్రజలంతా చూసి మనతో చేయుతనివ్వరా
దేశమంతా కూడి ప్రేమతో నర్తించదా

ఆమె:
రావోయి యోగి మమ్ కరుణించేయి రో
రావోయి యోగి మమ్ కదిలించేయి రో
రావోయి యోగి మమ్ రగిలించేయి రో
రావోయి యోగి నీతో నడిపించేయి రో

కోరస్ :
మేరా భరత్ హై సబ్సే మహాన్ హై
మేరా భరత్ హై సబ్సే మహాన్ హై

ఆమె:
జగమంతా నాయకులు ఉన్నా
ధనమంతా వాళ్ళకు ఉన్నా
నీ శక్తే వాళ్ళకు లేదయ్యో
మా ఉళ్ళో యువకులు ఉన్నా

వాళ్ళల్లో ధర్మం సున్నా
నీ వంటి వాడే లేడయ్యో

యోగి:
అమ్మో విశ్లేషిస్తూ స్నేహం పెంచావే
శ్రమే దైవమని ప్రభోదిస్తాలే

ఆమె:

వేగంగా మా వద్దకు వచ్చి
ప్రళయముగా మమ్ములను మార్చి
మా జీవితాలను నువ్వు తీర్చిదిద్దయ్యో రావయ్యో
భారతదేశం యువత మేము
ప్రజ్వలించే జ్యోతులం మేము
దారి చూపించి తీరం చేర్చయ్యో

రావోయి యోగి మమ్ కరుణించేయి రో

రావోయి యోగి మమ్ కదిలించేయి రో
రావోయి యోగి మమ్ రగిలించేయి రో
రావోయి యోగి నీతో నడిపించేయి రో

మా మనస్సులో అగ్నే ఉంది

దేశాన్ని నిర్మించమంది
మేమంతా కలిసి వస్తామయ్యో
మా బలహీనతలను జయించేస్తాం
సమాజభివ్రుద్ది కి తోడ్పడతాం
మంచి ఆశయాలు సాదిస్తామయ్యో

యోగి:
వినోదాలనే ఇక పక్కన పెట్టాలే
నవయువకులంతా మంచి మార్పు తేవాలే

ఆమె:

వేగంగా మా వద్దకు వచ్చి
ప్రళయముగా మమ్ములను మార్చి
మా జీవితాలను నువ్వు తీర్చిదిద్దయ్యో రావయ్యో
భారతదేశం యువత మేము
ప్రజ్వలించే జ్యోతులం మేము
దారి చూపించి తీరం చేర్చయ్యో

రావోయి యోగి మమ్ కరుణించేయి రో
రావోయి యోగి మమ్ కదిలించేయి రో
రావోయి యోగి మమ్ రగిలించేయి రో
రావోయి యోగి నీతో నడిపించేయి రో

------------------ప్రభాకర రావు కోటపాటి

Sunday, June 14, 2009

మద్యపానము త్యజించు మార్గదర్శిగా మారు


ఇల్లు లేదు వళ్ళు లేదు సృహ లేదు
మునిగి పోయేవు కరిగి పోయేవు ఆవిరై పోయేవు
ఆ మత్తు చేసే గమ్మత్తు లో

ఉబ్బి పోయే కళ్ళు, ఉడికి పోయే నెత్తురు, వంకర్లు పోయే కాళ్ళు
కనిపించుటలేదు, వినిపించుటలేదు, అనిపించుటలేదు
ఆ మాయలాడి ఆడించే తైతక్క లో

ఆనందమనేవు, ఆహ్లాదమనేవు, అద్బుతమనేవు
విలాసాలలో, విందులలో, విశేషాలలో
ఆ క్షీణకారి ప్రతిభింబించే క్షణ బంగురములో

తరిగిపోతున్న విలువలు, మారిపోతున్న సంస్కృతులు, దారిద్ర్యరేఖ దిగువన ప్రజలు
మరచి పోతున్నావు, పెడచెవిన పెడుతున్నావు, నిర్లక్ష్యము చేస్తున్నావు
ఆ మహమ్మారి కలిగించే గిలిగింతలలో

సరికొత్త సాంప్రదాయమంటావు, నవయుగమంటావు, నూతన జీవనశైలి అంటావు
స్వీయ క్రమశిక్షణ పోయింది, నిగ్రహశక్తి పోయింది, స్వీయ నాయకత్వము పోయింది
ఆ విషద్రవము ప్రేరేపించే వెంపర్లాటలో

ప్రశాంతత కోసమని, దేహబాదల కోసమని, ప్రభుత్వ పన్ను కోసమని
భ్రమ పొందేవు, ప్రలోభ పొందేవు, వాహన ప్రమాదములు పొందేవు
ఆ జ్వాలాముఖి చూపించే ఎండమావులలో

సేవద్రుక్పదము క్రుశించింది, సామాజికబాద్యత క్రుశించింది, గురుశిష్యపరంపర క్రుశించింది
సోమరితనము హెచ్చింది, లంచగొండితనము హెచ్చింది, పరహింస హెచ్చింది
ఆ దుర్వాసనాపూరిత సృజించే శోకసాగరములో

కాలహింసతో, కుటుంబహింసతో, శారీరకహింసతో
కొనసాగించేవు, రగిలించేవు, క్షీణించేవు
ఆ ప్రాణహరిని ప్రకోపింపచేసే విలయతాండవములో

అందుకే.................................................
ఆగు, ఆలోచించు, విశ్లేషించు, శోధించు, సాధించు.......

ఆ మాయదారి మద్యపానమును త్యజించి...............


భావిపౌరులకు మార్గదర్శిగా మారు..........



----------------------------------ప్రభాకర రావు కోటపాటి