Monday, May 25, 2009

మహిమాన్వితమైనది నీ సంకల్ప శక్తి

మహిమాన్వితమైనది నీ సంకల్ప శక్తి

నిలిపిఉంచు దానిని అసామాన్య లక్ష్యములలో
ప్రయత్నించు వాటిని నెరవేర్చే దిశలలో
కలిసివస్తాయి నీ కొరకు అద్భుత శక్తులు
విస్తరిస్తాయి సర్వదిశలందు నీ మనోశక్తులు
సహకరిస్తాయి నీ అంతర్గత పంచభూతాలు
తెలిసి వస్తాయి నీ నిద్రాణ ఆనంద గనులు
ఆశ్చర్య పరుస్తాయి నీ కోసము నెరవేరే కార్యక్రమాలు

కరిగి పోతాయి నీ లోని అనుమానపు పొరలు
గుర్తిస్తావు నీ మహిమాన్విత కార్య నిర్వహణా దక్షతలు
సాధిస్తావు నీవు తలపెట్టిన మహోన్నత ఆశయాలు

మహర్షి పతంజలి సూక్తి కి తెలుగు స్వేచ్చానువాదము: ప్రభాకర రావు కోటపాటి

Sunday, May 17, 2009

మిత్రమా నీ సాంగత్యము అపురూపము

దివ్య లక్షణ సమన్విత మిత్రమా నీ సాంగత్యము అపురూపము ఆనంద మకరంద సందోహము

నీ సుందర వదనము కనిపిస్తుంది నిండు చందామామ లా
నీ సుమధుర పలుకరింపు వినిపిస్తుంది సెలయేరు సవ్వడి లా
నీ కనుల కదలిక అగుపిస్తుంది కరుణా సముద్రము లా
నీ దరహాసము ప్రసరిస్తుంది పూల గుభాలింపు లా
నీ సంభాషణ సాగుతుంది వీణానాదము లా
నీ చిరునవ్వు గోచరిస్తుంది ఇంద్రధనుస్సు లా
నీ నవ్వుల జల్లు కురిపిస్తుంది పరిమళ విరిజల్లు లా
నీ సత్ప్రవర్తన స్మరింపచేస్తుంది నిర్మల జ్యోతి లా
నీ నిస్వార్ద సేవ తలపింపచేస్తుంది దైవసన్నిది లా
నీ వినయ విదేయత స్పురిస్తుంది ముద్దమందారము లా
నీ నిత్య సంతుస్టత విస్తరిస్తుంది నిండు మేఘము లా
నీ స్థిత ప్రజ్ఞత పనిచేస్తుంది దివ్వఔషదము లా
నీ విశాల దృక్పధము మురిపింపచేస్తుంది మాతృ ప్రేమ లా
నీ పవిత్ర సంకలృము ప్రోత్సహిస్తుంది వినూత్న ఉత్తేజము లా
నీ విషయ వివరణ సాగుతుంది అమరగానము లా
నీ చైతన్య స్ఫూర్తి చేయుతనిస్తుంది ఉద్దేపన శక్తి లా
నీ సౌశీల్య ప్రవృత్తి ఊరటనిస్తుంది అమృత వర్షిని లా
నీ నిష్కల్మష నడవడి దర్శింపచేస్తుంది మహోన్నతశిఖరము లా
నీ సహనసంస్కారము ప్రకాశిస్తుంది సూర్యబింబము లా
నీ ప్రేమార్ద్ర హృదయము మారుస్తుంది ఈ భూమిని స్వర్గము లా

అందుకే సంబ్రమాశ్చర్య సంజనితము మన పరిచయము

--ప్రభాకర రావు కోటపాటి


Monday, April 13, 2009

భారతీయుడా రక్షించు నీ ఘన కీర్తిని

సనాతన యుక్తము శక్తి యుక్తము సాంప్రదాయ యుక్తము ఈ భారతావని
యోగ భూమి ధర్మ భూమి త్యాగ భూమి నిర్మల భూమి ఈ ద్రుమదళ శోబిని
భారతీయుడా తెలుసుకో రక్షించు నీ అద్భత ఘన కీర్తిని

చతుసహస్ర వత్సరముల వెనుక ఉద్భవించినది యోగ శాస్త్రము ఈ మలయజ శీతల ప్రదేశమందు
రోగ నివారణమైన యోగ సాధన మరచి బానిసగా మారితివి నక్షత్ర వైద్యశాల యందు
విశ్వాస యుక్తుడవై యోగ విద్యను నిత్యము అవలంభించి మునిగి తేలు ఆనందమందు

నిగ్రహమూర్తులకు, విలక్షనవిసారధులకు ఏకాగ్రత సంపన్నులకు నిలయము ఈ భూవలయ దేవాలయము
గర్భగుడి లోనికి ప్రవేశించి వికృత ఘీంకార విన్యాసాలతో నర్తిస్తున్నాయి ధూమపానము మరియు మద్యపానము
జంట భూతాలను తుత్తునియలు గావించి వాటిపై ఆదిక్యతను సంపాదించి పెంపొందించు ఆరోగ్య శరీరము


ప్రకృతి జీవనము పాటించి ఆనంద సమేతముగా శాతాదిక్యము గా జీవించిరి ఈ సస్యశామలమందు
రోగ కారక బక్ష్యాలతో, అసహజ సంయుక్త ఆహారముతో, శక్తి నసించిపోవు చున్నది నీ దేహమందు
అమృతాహారము, సహజాహారము యుక్తాహారము సేవించి పెంపొందించు అమృత శక్తీ జీవనమందు

సుస్వరాల సంగీతము, సంబ్రమాశ్చర్యకారక నృత్య హేలలకు, సంఖ్యకు అందని కళలకు కాణాచి ఈ రస రంజని
విపరీత ధోరణితో, వికృత చేష్టలతో, అర్దరహితముతో, కర్ణ కఠోర విదేశీ సంగీతముతో నాసనమైనది నీ శ్రవణ భంజని
శాస్త్రీయ సంగీతముతో, నయనానందకర నటరాజ కదంబము తో చిగురింప చేయి నీ మనో రంజని

సిరి సంపదలతో ధన దాన్యములతో అనంత ఆహార దాన్యములతో విలసిల్లినది ఈ అన్నపూర్ణ
కూడు లేక గుడ్డ లేక గూడు లేక విద్య లేక విజ్ఞానము లేక అలమటించు చుంటిరి నీ సోదర పూర్ణ
మానవత్వాన్ని ప్రదర్శించి సమగ్ర సంస్కరణలకు శ్రీకారము చుట్టి నెలకొల్పు సమ సమాజ పరిపూర్ణ

విజ్ఞాన శాస్త్రవేత్తలతో నిర్మాణ నిపుణులతో సృజనాత్మక సుప్రసిద్దులతో ప్రసిద్ది చెందినది మహోజ్వలమూర్తి
పాశాత్య ఉత్పత్తులకు బానిసలై ఆత్మాభిమానము నశించి క్రొత్త దనము లేక సోమరులైరి అఖిల జనావర్తి
ఉత్తేజాన్ని నింపి ఆలోచన నెలకొల్పి పరిశోధనలు చేసి శోధించి సాధించు పారిశ్రామిక ప్రపంచ కీర్తి

ధర్మదక్షులు నిజాయితీ నిబద్దులు ప్రజారంజక ప్రభువులు పాలించిరి ఈ భాగ్యవిధాత ను

సుద్ద సుంఠలు నిరక్షర నిరర్దకులు కర్కోటకులు కొందరు ఆక్రమించిరి అధికారము ను

విశ్లేషనాత్మక విజ్ఞానముతో ప్రజ్వలించే ప్రజాస్వామ్యము తో ఎంపిక చేయి భారత నాయకత్వమును


సకలకళా సంసిద్దులను వివేక విదురులను సరస్వతీ స్వరూపులను కన్నది ఈ జగజ్జనని

విచక్షణా విహీనులకు అక్షర శూన్యులకు మానసిక వికలాంగులకు నిలయమైనది ఈ సుందరావని

అక్షర దీపము వెలిగించి సర్వోదయ విద్యను ప్రోత్సాహించి నిర్మించు జన రంజక భారతావని


స్వీయ సాదికారత్వముతో పాడిపంటలతో ఐకమత్యబలము తో నడిచినది ఈ ఉచ్చల జలధి తరంగ

కీచులాట పోరాటములకు స్వార్ధపరుల అసూయలకు అసాంఘీక శక్తులకు ఆశ్రయమైనది ఘోరము గా

దేశ క్షేమమే పరమావధి గా స్వార్ద రాజకీయాలకు అతీతంగా రూపొందించు భారత దేశాన్ని విశ్వ విఖ్యాత అధినేత గా



ప్రభాకర్ రావు కోటపాటి

Sunday, April 12, 2009

ప్రజ్ఞకు పది సోపానాలు

తలపెట్టిన కార్యము నుండి పొందబోవు ఫలితాల దృష్టితో పెంపొందించు ఆకాంక్ష
ఆకాంక్ష ను నిరంతర స్రవంతి లో కలిగి ఉండుటకు నిలిపి ఉంచు అంకిత భావము
అంకిత భావముతో అభ్యసించి ప్రాపంచిక పరిస్తుతులను విశ్లేషించి సాధించు విజ్ఞానము

విజ్ఞానాన్ని పెద్దల సమక్షము లో వారి అనుభవాల సారాన్ని రంగరించి రాబట్టు సూచనలు
సూచనలను ఆచరించి ప్రయోగించి నిత్య నూతన విదానాలను అవలంభించి చేపట్టు నిరంతర అభివృద్ధి
నిరంతర అభివృద్దిని కొనసాగించుటకు అంతర్గత సమస్యా సమాదానముల కొరకు కలిగి ఉండు పట్టుదల
పట్టుదలతో స్వీయ క్రమ శిక్షణతో సోమరితనాన్ని దరిచేరనివ్వక చేపట్టు ప్రామాణిక అభివృద్ధి
ప్రామాణిక అభివృద్ధి తో మానసిక విశాల దృక్పదాన్ని పాటిస్తూ కొనసాగించు నిత్య విద్యార్థి తత్వము
నిత్య విద్యార్థి తత్వము సాక్షి గా ముందుకు సాగి నిఘూడము గా అనుభవించు గమనము లో పరమానందాన్ని
పరమానందాన్ని ప్రాతిపదిక గా జ్ఞానాన్ని పంచుతూ పురోగమించి గెలుచుకో సేవలో ఉన్న సంతోషాన్ని

ఈ పది సోపానాలను అనసరించి అవలంభించి పరివర్తన చెంది జీవించు
అసమాన ప్రజ్ఞాశాలి గా

--ప్రభాకర్ రావు కోటపాటి

నా నేస్తం

ఆకాశము అసూయ పడుతున్నది నా మీద....
నక్షత్రాలకు పెరుగుతున్నది కోపము అంతులేనంత......
ప్రజల హృదయాలు రగులుతున్నాయి భరించలేనంత...
ఎందుకు...................................................................
చంద్రుని మించిన నీ లాంటి నేస్తము నా సొంతము అయినందుకు.......

-ఫ్రభాకర్ రావు కోటపాటి

విజయ భానుని ఉదయింప చేసుకో

నీకు జీవితము అర్ధము కాలేదని విలపించకు

ధైర్య సాహసాలతో దానిని శోధించి సాధించాలని తెలుసుకో

ఒంటరి వాడిని ఏమి చేయలేనని కార్య సూనుడవై జీవించకు

అకుంఠిత దీక్షతో ఒక శక్తి గా ఉద్భవించ గలను అని తెలుసుకో

వోటమి కి భయపడి క్రొత్త ఆలోచనలను ఆది లోనే తుంచివేయకు

క్రొత్త ఆలోచనల తోనే ఈ సృష్టి అభివృద్ధి చెందుతుంది అని తెలుసుకో

సమస్యలకు వెరచి ఫలాయన మంత్రాన్ని ఫతించకు

దేవుడు నీ పరిపూర్ణ పరివర్తన కొరకు వాటిని సృజించాడని తెలుసుకో

మంచి ఆశయాలను సాధించే మార్గము కాన రాలేదని శోకించకు

ఓర్మితో నీలో దాగిన అనంత శక్తి ని శాసించ వచ్చని తెలుసుకో

విజయ భానుని నీవు కోరిన దిశలో ఉదయింప చేసుకో

-ఫ్రభాకర్ రావు కోటపాటి

Friday, April 10, 2009

నవ యువకుడా గుర్తించు నీ అంతర్గత శక్తిని

నవ యువకుడా గుర్తించు నీ అంతర్గత శక్తిని

అద్భుతమైనది నీ మేధాశక్తి సృజించగలదు అశ్చర్యచకిత శాస్త్రవిఙ్ఞానాన్ని
తెజోవంతమైనది నీ విచక్షనాశక్తి గమనించగలదు మూఢ నమ్మకాల నిరర్దక తత్వాన్ని
చైతన్యవంతమైనది నీ రోగనిరోదకశక్తి ఆటంకించగలదు శత సహస్ర రోగకారకాలను
ద్రుడవంతమైనది నీ శారీరకశక్తి అభివృద్ధిచేయగలదు సుందర సస్యశ్యామల జనావాసాలను
శ్లాగించదగినది నీ నిర్మాణశక్తి కాపాడగలదు ఈ ప్రకృతి సంపదను
మహిమాన్వితమైనది నీ అలోచనాశక్తి ఎన్నుకోగలధు నిస్వార్ద ప్రజా నాయకులను
అంచనాలకు అందనిది నీ నిగ్రహశక్తి నిరోదించగలదు నీకు కీడు కలిగించే దురలవాట్లను
విశాలమైనది నీ హ్రుదయశక్తి ప్రేమించగలదు విశ్వమానవ సమైక్య కుటుంబాన్ని

అందుకే లే నీ శక్తులను గుర్తించి నీ కొరకు నీ కుటుంబము కొరకు
నీ సమాజ శ్రేయస్సు కొరకు నీ అంతర్గత శక్తులను ఉపయోగించి సాధించు

ఫ్రభాకర్ రావు కోటపాటి