పనిచేసి అలసిపోతే మందు..
పరీక్ష పాసైతే మందు..
ఉద్యోగమొస్తే మందు..
పదోన్నతి వస్తే మందు..
స్నేహితుడు కలిస్తే మందు..
విందు విందు కీ మందు..
పెరిగిపోతున్నది ఆ మహమ్మారి పొందు..
కణ కణాన్ని కోసేస్తూ అది శరీరమంతా విస్తరిస్తున్నా..
తనకు బానిసగా అది మార్చేసుకొంటున్నా..
అనేకరోగాలకు తానే ఆది గురువుగా మారినా..
అది లేకుండా మనకు రోజు గడవదు..
మింగకపోతే మన మనసు మనలో ఉండదు.
తాగితే ఎక్కడలేని స్వాతంత్రము వస్తుంది..
ఎక్కడినుండో దైర్యం ఎగిరి వస్తుంది..
ఆనందం పొంగి పొంగి బయటకు వస్తుంది.
ఆ బూటకపు బాగోతాన్ని చూసి నాకు నవ్వు వస్తుంది ..
పేద ధనిక తేడా లేదు..
బాధకి ఆనందానికి తేడా లేదు..
పెళ్ళికి విడాకులకి తేడా లేదు..
పుట్టుక కి చావుకి తేడా లేదు..
ఏ సందర్భమైనా ముందుకి మాత్రం కొదవ లేదు..
సాయంత్రానికి అది పడక పోతే నిద్ర లేదు..
తాగని వాడు పప్పు సుద్ద.. మరియు మట్టి ముద్ద..
తాగే వాడు జీవిత సారాన్ని చవిచూసిన దిట్ట..
తాగకపోతే అన్నీ వదిలివేసిన వెంగళప్ప..
తాగి ఊగేవాడు మాత్రం తత్వవేత్త..
వాళ్ళ వర్ణనతో పంది అయిపోతుందా నంది?
ఇకనైనా ఆపుదామా ఈ స్వయంకృతం..
మనల్ని చూసి మంచి అలవాట్లు నేర్చుకోవాలి భావితరం ..
మానుకుంటే బాగుంటుంది మందుకు బానిసత్వం..
మందు వినియోగం తగ్గితే బాగుపడుతుంది భారతదేశపు భవితవ్యం..
--
Regards
Prabhakar Rao Kotapati