Saturday, January 6, 2018

కార్య దీక్షతో కదిలితే కావలసినది కట్టుబడక పోతుందా.. మన కలలన్నీ సాకారమయ్యే రోజు రాకుండా ఆగుతుందా?

ఆత్మ విశ్వాసముతో అడుగులు ముందుకేస్తే అందుకోలేనిది ఉంటుందా.. 
కార్య దీక్షతో కదిలితే కావలసినది కట్టుబడక పోతుందా.. 
మన కలలన్నీ సాకారమయ్యే రోజు రాకుండా  ఆగుతుందా?

చిన్న చిన్న అడుగులేస్తూ కదులుతుంటే.. 
మనసు మొత్తము లక్ష్యము పైనే లగ్నమయితే 
ఎంత దూరమైనా దగ్గరవుతుంది.. 
ఎంతటి కష్టమైనా కరిగిపోతుంది.. 

ప్రతి రోజు కొత్త విషయాలు నేర్చుకొంటుంటే
చేసిన తప్పులనే అనుభవాలుగా మార్చుకొంటుంటే 
పని చేసే ప్రదేశమే పాఠశాలవుతుంది.. 
అనుక్షణం ఆనందంతో నిండిపోతుంది.. 

ఉత్సాహాన్ని ఊపిరిగా మార్చుకొంటే 
చేయాలి అనే తపన అణువణువు అవహిస్తే.. 
మనలను అడ్డుకొనే శక్తే ఉండదు 
ఎంత పెద్ద ఎత్తయినా తల దించక తప్పదు.. 

ప్రకృతి ప్రసాదించిన సంపదను సద్వినియోగం చేసుకొంటే.. 
మన జన్మకు కారణాన్ని అన్వేషణతో అర్థంచేసుకొంటే.. 
మన విజయాలే ఈ లోకానికి ఆదర్శాలుగా మారతాయి..
మనజీవన సూత్రాలే భావితరాలకు బాటలవుతాయి..

ఆత్మ విశ్వాసముతో అడుగులు ముందుకేస్తే అందుకోలేనిది ఉంటుందా.. 
కార్య దీక్షతో కదిలితే కావలసినది కట్టుబడక పోతుందా.. 
మన కలలన్నీ సాకారమయ్యే రోజు రాకుండా  ఆగుతుందా?
--



Regards
Prabhakar Rao Kotapati


మీ స్థానాన్ని నింపటానికి కోట్ల మంది కలాంలు సిద్ధం.. మీ ఆకాంక్షలను సాధించే వరకు ఆపదు భారతీయ యువత తమ అభివృద్ధి యుద్ధం....

నింగికేగిన కలాం కిరణమా 
అగ్ని పృద్వీలను ఇచ్చిన భారత రత్నమా 

మీ కలలు మాత్రం పదిలం మా మదిలో 
మీ స్పూర్తి సూక్తుల ప్రవాహం ఆగదు మా చెవిలో

మీరు సృజించిన ఉపగ్రహ విజ్ఞానం ఉరకలెత్తుతుంది.. 
మీరు యువతకిచ్చిన దిశానిర్దేశం దేశాన్ని నడిపిస్తుంది.. 

మీరు వేసిన ప్రణాళికే దిక్సూచి మాకు 
మీ అడుగుల్లో పయనమే ఆనందం మాకు 

మిమ్ములను  చూసిన మా కనులలో కనుపాపగా మిగిలారు 
మీరు సృజించిన మా చేతులలో చైతన్యంగా ప్రవహిస్తున్నారు 

అభివృద్దే మీ ఊపిరిగా అనుక్షణం గడిపారు 
పెద్ద పెద్ద కలలు కని వాటిని సాధించటమే ప్రతి పౌరుని కర్తవ్యం అని చాటారు 

మీరు జన్మించిన ఈరోజే పర్వదినం మాకు.. 
చివరి శ్వాస వరకు దేశ సేవ చేసిన మీ జీవితమే ఆదర్శం మాకు 

మీ స్థానాన్ని నింపటానికి కోట్ల మంది కలాంలు సిద్ధం.. 
మీ ఆకాంక్షలను సాధించే వరకు ఆపదు భారతీయ యువత తమ అభివృద్ధి యుద్ధం....
--



Regards
Prabhakar Rao Kotapati


ఓర్పుతో ప్రయత్నించేవానికి ఓటమి ఎన్నడూ దరిచేరదు

అలలకు హడలిపోయి ఓడ ఒడ్డుకు ఉరకలెత్తదు 
ఓర్పుతో ప్రయత్నించేవానికి ఓటమి ఎన్నడూ దరిచేరదు 

చిట్టి చీమ చెక్కెర ముక్క నోటకరుచుకు వెళుతుంటే 
వెళ్లే దారిలో వంద మార్లు  పడుతుంది లేస్తుంది 
పడిన ప్రతిసారి నర నరాల్లో నమ్మకాన్ని నింపుకుంటుంది
గమ్యాన్ని చేరేవరకు గుండె ధైర్యంతో ముందుకే కదులుతుంది.. 
ఓర్పుతో ప్రయత్నించేవానికి ఓటమి ఎన్నడూ దరిచేరదు.. 

ముత్యాలకోసం నది అట్టడుగుకు ఎన్నో సార్లు దూకుతాడు ఈతగాడు.. 
అనేక సందర్బాలలో అభాసు పాలౌతాడు 
దొరుకుతుందనే నమ్మకం మాత్రం అతనిలో తరగదు.. 
మునిగిన ప్రతి సారి వట్టి చేతులతో  రాడు.. 
ఓర్పుతో ప్రయత్నించేవానికి ఓటమి ఎన్నడూ దరిచేరదు

ఓటమికూడా ఒక అనుభవపర్వం దానిని అంగీకిరించు.. 
పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలించు 
తలచుకున్నది చేసేవరకు మాత్రం వెనకడుగు వేయద్దు.. 
అవసరమైతే సర్వ సౌకర్యాలను త్యాగం చేయి 
ఏమీ చేయకుండానే ఫలితాలు వస్తాయా?
సాధించినది ఏమీ లేకుండా జేజేలు వినపడతాయా?

ఓర్పుతో ప్రయత్నించేవానికి ఓటమి ఎన్నడూ దరిచేరదు
--



Regards
Prabhakar Rao Kotapati


దృఢ సంకల్పానిదే చివరకు దిగ్విజయం..

గడ్డిపోచలు కలిస్తే గజాన్ని కట్టి పడేస్తాయి

చలి చీమలు చేరితే కొండ చిలువను చంపుతాయి 

నీటి చుక్కలు కలిస్తే నదులై పారుతాయి 

విడిగా ఉంటే విలువ సూన్యం అవే  కలిస్తే పుట్టేది  ఉప్పెన.. 

ఒక నీటి బిందువు కదలిక పెను తుఫానుకి మూలం 

ఒక అగ్గి రవ్వ అడవులను మసి చేసే దవానలానికి ఆధారం.. 

ఒక స్త్రీ శోకం కురుక్షేత్ర మహా సంగ్రామానికి శ్రీకారం 

అణువుల విస్ఫోటనమే అగ్నిపర్వతానికి అంకురం..

చేయి చేయి కలిస్తే పుట్టేది చైతన్యం 

మార్పు కోరుకునే మనుషులే మహా విప్లవం.. 

అడుగులను అనుసంధానం చేసుకొన్న జనమే ప్రభంజనం.. 

దృఢ సంకల్పానిదే చివరకు దిగ్విజయం..
--



Regards
Prabhakar Rao Kotapati


నీ కోసమే ఎదురు చూస్తున్న నీ కొత్త బంగారు లోకాన్ని చేరుకో.....

సమస్యలతో సమరాన్ని ఆపకు.. విశాల సముద్రములో నిన్ను దాటించే కెరటం దాగుందని తెలుసుకో.. 

ఓటమిని ఊహించుకొని ముందుగానే ఓడిపోకు.. 
ఓటమిలో దాగివుండే దిక్సూచిని గుర్తించు.. 

కష్టాలను కడతేర్చమని దేవునికి మొక్కకు.. 
ఎటువంటి సమస్య నైన ఎదిరించే గుండె దైర్యం కోసం ధ్యానించు.. 

నడవాల్సిన దూరం చూసి నాయనో అని నడక ఆపకు.. 
వెనుకకు తిరిగి నీవు నడిచి వఛ్చిన దూరము ఇచ్చే స్ఫూర్తిని అందుకో 

ప్రయత్నిస్తూ.. అడుగులో అడుగేస్తూ .. ఆపకుండా నీ ప్రయాణం కొనసాగించు.. 

నీ కోసమే ఎదురు చూస్తున్న  నీ కొత్త బంగారు లోకాన్ని చేరుకో......
--



Regards
Prabhakar Rao Kotapati


అప్పుడు తెలుస్తుంది నీకు.. అకుంఠిత దీక్షతోడుంటే సాధించలేనిది ఏమీ లేదని..

కదిలే కలలు సమారాగ్ని ని రగిలిస్తుంటే 
నిండుగా ఉన్న  ప్రణాళిక నిన్ను నడిపిస్తుంటే 
ఉరకలెత్తే ఉత్సాహం నీ దేహమంతా విస్తరిస్తుంటే
కరుడుగట్టిన కార్యదీక్ష నీ తోడుగా కదులుతుంటే 

నీ అణువణువున ఆకాంక్ష ఆక్రమించి 
నీ సర్వశక్తులు నీ నర నరాల్లో నిండిపోయి 
నీకు తెలియని ఏదో శక్తి నిన్ను నడిపిస్తున్న అనుభూతి 
అనేక దైవ శక్తులు నీకు అందుతున్న అనుభవం 

అప్పుడు తెలుస్తుంది నీకు..

అకుంఠిత దీక్షతోడుంటే సాధించలేనిది ఏమీ లేదని..
--



Regards
Prabhakar Rao Kotapati


మనుషులు తలచుకొంటే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలరని..

అలవోకగా దూడను ప్రసవించే అవును చూస్తే.. అనిపిస్తుంది.. మనుషులు గోటితో పోయేదానికి గొడ్డలి వాడతారని. 

వేపనూనె గోమూత్రం పురుగులను తగ్గించటాన్ని చూస్తే తెలుస్తుంది.. మనుషుల దురాశ దుఃఖాన్ని తెస్తుందని.. 

కాళ్ళు లేని వికలాంగురాలు ఎవరెస్ట్ ఎక్కడాన్ని చూస్తే అనిపిస్తుంది .. అన్నీ బాగున్న మనుషులు ఆత్మ విశ్వాసం లేక వెనుక పడుతున్నారని 

నిరంతరం నడుస్తూ శ్రమించే చీమలను చూస్తే అర్ధమవుతుంది.. వళ్ళు  దాచుకోవటానికి మనుషులు అలవాటు పడ్డారని 

ఎడారిలో పెరిగే ఖర్జుర చెట్టు ను చూస్తే తెలుస్తుంది.. మనుషులు తలచుకొంటే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలరని..
--



Regards
Prabhakar Rao Kotapati