ఎక్కడ చూసినా ఏదో అంతుపట్టని అద్బుతం..
ఈ జగమంతా అణువు అణువు ఆశ్చర్యభరితం..
ఎన్ని తెలుసుకున్నా అర్ధం కావలసినది అనంతం..
ఈ నిరంతర ప్రకృతిని నడిపేది ఒకే ఒక శక్తి స్వరూపం
ఎక్కడున్నావో ఎవరికీ తెలియదు..
ఎలా ఉంటావో ఎవరూ చూడలేదు..
కానీ ఈ సృష్టి నీ కనుసన్నల్లో ఉందనేది..
ఎవరూ కాదన లేని కరుడు కట్టిన సత్యం..
నీకు రక రకాల పేర్లు పెట్టారు..
కోటి పేర్లతో కొట్టుకు చస్తారు..
నా దేవుడు మాత్రమే నిజమంటారు..
నమ్మని వాళ్ళను నర నరాన ద్వేషిస్తారు..
నీవు సృష్టించిన జీవులను నీకే బలి ఇస్తారు..
పాపాలన్నీ చేసి నీకు మొక్కి భ్రమలో భ్రతుకుతారు
పండుగ పేరుతో నోరు లేని జీవులను హింసిస్తారు
ప్రక్రుతిని పాడు చేస్తూ ప్రళయం వైపు పయనిస్తారు
మేఘము వాన జలం భూమి ఆహారం నీ ఆశీర్వాదం
సూర్యుడు చంద్రుడు వృక్షాలు ఖనిజాలు నీ ప్రసాదం
పర్వతాలు నదులు ఋతువులు గాలి నీచమత్కారం
పుట్టుక ఎదుగుదల బాంధవ్యాలు నీ మాయాజాలం
అద్భుత సృష్టి లో నిన్ను చూసే శక్తి అందరికీ ఇవ్వు
అందరినీ అభిమానించే శక్తి సకల జనులకు రావాలి
అన్ని మతాలకులాల అడ్డుగోడలని ప్రజలు కూల్చాలి
సర్వేజనా సుఖినోభవంతు.. ఏక దైవమే పూజ్యంతు.
- ప్రభాకర రావు కోటపాటి
14 జనవరి 2024
No comments:
Post a Comment