ఎంత ఎగిరినా నీ హద్దు ఆకాశం క్రిందే
ఎన్ని మెట్లెక్కినా నీ నడక భూమి మీదే
సకలరసాలు సేవించినా నీమనుగడ నీటితోనే
పంచభక్ష్యాలు కూడా అరిగేది నీజఠరాగ్ని తోనే
యంత్రాలు ఎన్నున్నా ప్రాణం నీ శ్వాస తోనే
ప్రకృతి సృజించిన తాత్కాలిక ఆకృతి నీవు
తోటి మనుషుల సంరక్షణ బాధ్యత నీది
ఆప్యాయత అనురాగం ఆభరణాలు నీకు
విలువలు ఆచరించి ప్రచారమే లక్ష్యం నీకు
కుల మత విభేదాలు చూడలేని అత్మవి నీవు
మోసాలు కుట్రలు అబద్దాలతో మిగిలేదిఏమీ?
ఎంత దోచినా చివరకు తిన గలిగేది ఎంత?
అడ్డ దారిలో చేసిన ఆర్జన మనతో వస్తుందా?
దుర్మార్గం దౌర్జన్యం ఎప్పుడూ సాగుతాయా?
పగలు పంతాలు మనము పోతే ఏమౌతాయి?
పరిమిత సమయాన్ని సద్వినియోగం చేసుకో
ప్రతిపనిలో సాంఘిక బాధ్యతను భాగo చేయి
సమస్యలతో నలిగే జనులకు దారి చూపు
నీవు పోయినా నీవు చేసిన మేలు మిగలాలి
నీవు బ్రతికిన ప్రతిక్షణం ఆనంద ఖనికగా మారి.. నీ కంఠానికి అలంకారం కావాలి..
--- ప్రభాకర రావు కోటపాటి
9 - ఏప్రిల్ - 2023