Sunday, December 19, 2021

క్షణక్షణం జనుల హిత వర్తనమే జీవన సాఫల్యం

మారిపోతున్న పాత పద్దతిని మార్చుకో
చేసే పని మీద శ్రద్దతో శిఖరాగ్రాన్ని చేరుకో
నీ తెలివి తేటలను తరచి తరచి తెలుసుకో
సాధించి నిలిచిన విజేతలతో స్నేహం పెంచుకో 

పెద్దపెద్ద కలలుకను అడుగు అడుగుగా అందుకో

ఎలా జన్మించావుకంటే ఎలా జీవించావో ముఖ్యం
ఎంతటి నిష్టూరమైనా నిజాన్ని పలకటం ముఖ్యం
ఏదైనా సాధించాలి అంటే నిరంతర కృషి ముఖ్యం
ఎల్లలులేని ఆనందానికి సుజనులస్నేహంముఖ్యం

వేల వేల వాగ్దానాల కన్నా చిన్న ఆచరణ ముఖ్యం

నీ శక్తియుక్తుల ఆత్మ పరిశీలన గెలుపుకు శ్రీకారం
నీ పరిశోధన సృజన స్పూర్తి  అభివృద్ధికి మూలం
నీతో పని చేసే వారి గెలుపు నీ గెలుపుకు ఆధారం
నీ పోరాటపటిమ చిత్తశుద్ది అందిస్తుంది విజయం

కణ కణం రణ ఉత్తేజం రగలటమే కర్మ యోగం

తప్పు సహజం కానీ మరలాచేయటం మూర్ఖత్వం
క్రిందపడ్డా బంతిలా ఎగరటం అత్యంత ఆవస్యకం
నమ్మిన నిజం కోసం ఒంటరిగా సాగించు గమనం
అవదులను కూల్చి కదలటమే శాశ్వతపరిష్కారం

క్షణక్షణం జనుల హిత వర్తనమే జీవన సాఫల్యం



        - ప్రభాకర రావు కోటపాటి

               5 డిసెంబరు 2021

No comments:

Post a Comment