Saturday, December 18, 2021

చీకటిని చీల్చుకుంటూ ముందుకు సాగే..ఆ సూర్య కిరణం నీవు

చీకటిని చీల్చుకుంటూ ముందుకు సాగే..
ఆ సూర్య కిరణం నీవు
మట్టి పెళ్ళలను పెకలించుకుంటూ పైకిలేచే..
ఆ చెట్టు మొలకవు నీవు
బండ రాల్లను  దొర్లించుకొంటూ క్రిందకు దూకే..
ఆ జలపాతం నీవు
కారు మేఘాలను దశదిశలకూ చేరవేసే..
ఆ ఉప్పెన లాంటి వాయువు నీవు

నీకు ఆటంకం అదొక అనుభవం..
నీ సంకల్పం అదొక శిలాశాసనం..
నీ కర్తవ్యం  నిన్ను నడిపే ఇంధనం..
నీ సహనం నీకొక ఆయుధం.

వ్యసనాలను వదిలి పరిశోధన సాగించావా..
సాధించలేనిది లేదు.
నిరాశను విసర్జించి నైపుణ్యాలను పెంచావా..
సంపాదనకు కొరత లేదు.
సోమరితనాన్ని అనిచి స్వయంకృషిని నమ్మావా..
దరిద్రం దరికి చేరదు..
భయాన్ని పారద్రోలి విశ్లేషణా దృష్టితో చూసావా..
చీకు చింతా నీ చేరువ కాలేవు..

ఈజీవితం ఒకఅద్బుతం.అన్నిదిశలా అవకాశాలు
నీవు చూసే విధానం..నీకు కనపడే దృశ్యాలు 
నీవు గడిపే  క్షణ క్షణం..నీకు దేవుడిచ్చిన వజ్రాలు
నీ ఆసక్తి సాహసం సహనం నీ ప్రగతి సోపానాలు


     - ప్రభాకర రావు కోటపాటి

          18 డిసెంబరు 2021











No comments:

Post a Comment