సువిశాల ప్రపంచం..సమస్య ఎంత పెద్దది అయినా దొరుకుతుంది సమాధానం.
కొండలు గుట్టలు నదులు వృక్షాలు.. అన్నీ మనకు అండగా ఉండే ఆత్మబందువులు.
పక్షులు జంతువులు జీవరాశులు..ప్రతిక్షణం నీకు తోడుగా సంగతులు చెప్పే స్నేహితులు.
అది జరగలేదు..అలా ఎందుకు జరిగింది. ఆ అలోచలనలే..అంతులేని ఆవేదనకు మూలం.
ఆవేదన ముదిరితే.. మారేను అసంతృప్తిగా..
తరువాత అదే నిరాశ పాతాలానికి పునాది.
వంద దారులు మూసుకు పోయినా.. నీకోసం
మరొక దారి.. వెదికితే నీ ముందే ప్రత్యక్షం.
నిరంతర అన్వేషణ.. నిత్యనూతన జీవిత రహస్యం..ప్రకృతి అతి పెద్ద ఆనంద భాండారం.
ఒంటరిగా జన్మించిన నీకు..అనంతవిశ్వం నీ సొంతం..ఆస్తులకన్నా విలువైనది నీ ఆత్మవిశ్వాసం.
- ప్రభాకర రావు కోటపాటి
19 - జూన్ - 2021