Saturday, March 20, 2021

జీవిత రసానుభూతిని..ఆఖరిశ్వాస వరకు అనుభవించు

ఆరాటం ఆత్రం అంతు లేని వ్యామోహం
ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే పరుగు
ఆ పరుగులోనే జీవితసమయం కనుమరుగు
ఆశ ఆకాశమంత.నైపుణ్యంమాత్రంనలుసంత 

దనంకావాలి ఆస్తులుకావాలి కోరికలుకావాలి 
కానీ ఆ పరుగులో ఆనందాన్ని కాపాడుకోవాలి
సాధించాలికృషిచేయాలి ఆస్వాదిస్తూ సాగాలి
నీ అభివృద్దిలో ఇతరులకు చోటిస్తూ ఎదగాలి

ఏంతో అందమైనది లోకం.. 
కలలు కనే కనులకు మాత్రమే అది సొంతం
ఎక్కడో లేదు స్వర్గం..
మన మంచిని కోరుకొనే మనుషులతో సాద్యం
అంగడిలో దొరికేది కాదు ఆనందం..
మనస్సుమెచ్చే చిన్నచిన్న పనులతో ప్రత్యక్షం
పేచీలు ఎక్కడినుండో పుట్టవు..
మనఅపార్దాలతోనే పడుతుంది వాటిపునాది 

లేని వాటి గురించి ఆలోచిస్తూ..
ఉన్న వాటి ఉపయోగాన్ని వదిలివేయద్దు 
ముక్కోటి దేవుళ్లకు మొక్కుతూ..
దేవుడిచ్చిన మేధోశక్తి వాడకం మరచిపోవద్దు
అనవసరమైన అడ్డగీతలు గీసుకొని..
నా తలరాత అని జాతకాన్ని నిందించవద్దు 
అనుక్షణం అనురక్తితో ఆసక్తిగా గడుపుతూ..
జీవిత రసానుభూతిని..
ఆఖరిశ్వాస వరకు అనుభవించు 


         - ప్రభాకర రావు కోటపాటి
              20 - మార్చి- 2021


 




No comments:

Post a Comment