తెలుగు తెలుగు తేనెలు నిండిన తెలుగు
పదం పదం లో మధురం
స్వరం స్వరం లో అనురాగం
గుండె లోతుల్లో నుండి ఉప్పొంగే జలపాతం
వినేకొద్దీ వినాలనిపించే సుస్వరాల సంగీతం
సందర్బానికి సరిపడే అనంత పద సంపద
నవరసాలను ఒలికించే రస ప్రవాహ ఝరి
వినయ విధేయత నిండిన అమృత విరిజల్లు
అమ్మనాన్న గురువు నేర్పిన ఆదిపలుకులు
కధనంలో కదం తొక్కే పదునైన భావజాలం
పద్యంలోవిద్వత్తుతో నిత్యనూతనభాండారం
విప్లవ కవిత్వంలో నిప్పులుచెరిగే అఙిగుండం
స్తుతి స్తోత్రంలో ఉప్పొంగే అలంకార శాస్త్రం
మన మాతృభాష అనంతసంపదను గుర్తిద్దాం
అద్భుత పదపుష్పసువాసనను ఆస్వాదిద్దాం
మనస్సుఉల్లాసంతో నీంపే వెన్నెల్లో విహరిద్దాం
లెస్స అయిన తెలుగు వెలుగులో..
కరిగిపోని కాంతిలో విహరిద్దాం
- ప్రభాకర రావు కోటపాటి
21 ఫిబ్రవరి 2021
No comments:
Post a Comment