ఓడిపోతావు అన్న వారికి గెలిచి చూపించు
పనికిరావు అన్నవారికి విశ్వరూపం చూపించు
పట్టుపడితే సాదించలేనిది లేదుఅని గుర్తించు
అడుగు అడుగు కదిలిశిఖరాన్ని అధిరోహించు
మూఢనమ్మకాలగోడలను తర్కంతో ఛేదించు
అబద్దాల అంధకారాన్ని జ్నానదీపంతో చూడు
వ్యక్తిపూజమాని నీ అనంతశక్తినిఆవిష్కరించు
చనిపోయినవారెవరూ బ్రతకలేదనితెలుసుకో
ఆలోచించి మాట ఇవ్వు ఆనక వెను తిరగకు
మాటతప్పే మనిషి విలువ తరిగిపోక తప్పదు
కోట్ల ఆస్తి ఉన్నా నిజాయతీ లేక పోతే సున్నా
ఇతరుల నొప్పించనివానికి అనందం సొంతం
తలలేకపోతే వెర్రెక్కించటానికి వేలమందిసిద్దం
మన మతం కులం రంగు సంఘం అంటారు
విడిపోదాం పోరాడు అంతుచూద్దామంటారు
మన కంటిని మన వేలుతోనే పొడిపిస్తారు
జీవితంలో కష్టసుఖాలు మంచిచెడులమిళితం
కావాలసినది నైపుణ్యంతో సాధించు కోవాలి
ప్రలోభాలను చీల్చుకొని ప్రభాతసూర్యుడిలా
కష్టాలకోరల భారిన పడక కర్మయోగిలా సాగు
- ప్రభాకర రావు కోటపాటి
30 జనవరి 2021
No comments:
Post a Comment