Monday, November 30, 2020

వేయండి..వేయండి.. ఓటు వేయండి.

వేయండి..వేయండి.. ఓటు వేయండి.
నిప్పు లాంటి నాయకులను ఎన్నుకోండి.
సమాజం కోసం పాటుపడే.. సిసలైన అభ్యర్థులను వెతికి ఎన్నుకోండి.
అవినీతి, అహంకారం, అరాచకాలను..
కూకటి వేళ్లతో పెకలించండి.

నిజాయతీకి చోటు లేదని..
ఊక దంపుడు ఉపన్యాసాలు మానండి.
ఈ దేశ భవిష్యత్తును మార్చే మీ శక్తిని..
గుర్తించి విశ్లేషించి విచక్షణతో వాడండి.
రకరకాల ప్రలోభాలవలలను వదిలించుకుని..
ఉదయభానునిలా చీకటిని చీల్చి చెండాడండి.
గాడి తప్పుతున్న రాజకీయాలకు..
ముక్కుతాడువేసే మొనగాళ్లను గెలిపించండి.

తీరిక లేదని..ఓపిక లేదని..ఓటు మానకు..
అడుగడుగునా మన నడక మార్చేది ఎన్నిక.
ఒక్కఓటుతో వచ్చేలోటు ఎమిటి అనకు..
ఓటుకు ఓటు కలిస్తే జరిగేదే అసలైన ఎంపిక.
ఇంటిలో కూర్చుని దేశంమారాలని చూడకు..
ఓటు అనే వజ్రాయుధాన్ని ఝుళిపించి సాగిక.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆలోచించకు..
ప్రజాస్వామ్యంఇచ్చినహక్కు సాధనకై కదిలిక.

వేయండి..వేయండి.. ఓటు వేయండి.
నిప్పు లాంటి నాయకులను ఎన్నుకోండి.
సమాజం కోసం పాటుపడే.. సిసలైన అభ్యర్థులను వెతికి ఎన్నుకోండి.
అవినీతి, అహంకారం, అరాచకాలను..
కూకటి వేళ్లతో పెకలించండి.


       - ప్రభాకర రావు కోటపాటి 

          30 - నవంబర్ - 2020


No comments:

Post a Comment