Saturday, June 6, 2020

ఇవ్వగల వారికే సొంతం ఈ జీవితమాధుర్యం

జీవితమనే ఈ ప్రయాణంలో
మరొకరి మేలుకోరే మనసుతో 
చిరునవ్వు చిందే మాటలతో 
గడిపే వారే నిజమైన విజేతలు 

ఉదయభానుని వెలుగుల వెచ్చదనంతో
పక్షుల కిల కిలల వీనుల విందుతో 
మలయ మారుత వింజామరలతో 
ప్రతిరోజూ పుట్టటమే ఈ జీవిత మర్మం 

పరిమళాలు విరజిమ్మే జాజులు కోసం 
హయిగొలిపే సంగీత మదురిమ కోసం
ఉర్రూతలు ఊగించే వర్షపు జల్లుల కోసం
కదిలే మనుషులకే అసలైన అనందం

అమృత తుల్య అహారముతో 
మధుర ఫలాల అస్వాదనతో 
యోగసాదన  జీవన విదానముతో 
క్షణ క్షణం గడిపిన వారికి భూలోకమే స్వర్గం

సరసపూరిత శోభనిండిన సంభాషణలు 
ఉత్సాహం  ఉరకలెత్తే  పలుకరిపులు 
సమస్యలను సామరస్యంతో పరిష్కారాలు 
ఇవ్వగల వారికే సొంతం ఈ జీవితమాధుర్యం

           -  ప్రభాకర రావు కోటపాటి
                7 - జూన్ - 2020





No comments:

Post a Comment