అంతరంగాల నుండి పెల్లుబికే ఆమృతధార తెలుగు భాష..
నవరసాలను అలవోకగా పలికించగల పదాల పుట్ట తెలుగు అక్షరమాల..
రాళ్లను కూడా కరిగించగల సమ్మోహనాస్త్రాలు తెలుగు శాస్త్రీయ గీత మాలికలు..
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలనిపించే విలక్షణ కుసుమాలు తెలుగు రంగస్థల పద్యాలు..
తెలుగు వానిగా పుట్టడం అనేది మన పూర్వ జన్మ సుకృతం..
తేనెలూరే తెలుగుని మన నోటినుండి ఉచ్చరించగలగటమే మనకు దక్కిన అపూర్వ అవకాశం..
వినే కొద్ది వినాలనిపిస్తుంది..
పాడే కొద్ది పాడాలనిపిస్తుంది..
వ్రాసే కొద్ది వ్రాయాలని పిస్తుంది..
చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది..
తెలుగు వినడానికే జీవించాలనిపిస్తుంది..
బ్రతుకుదెరువు కోసం నేర్చుకున్న పరాయి భాషకు బానిసత్వం అవసరమా?
తెలుగు సరిగా రాని వానికి ఇతర భాషలు కూడా అలివి కావని గమనించలేదా?
తెలుగు సొగసు ను ఆస్వాదించలేని మన ఆసక్తత అర్ధమవుతుందా?
తెలుగు ఘుభాళింపులకు దూరమైతే నష్టపోయే ది మనమే అని తెలుసా?
మానస వీణ నాదాన్ని వీనులవిందుగా వినిపించగల గాన వాహినిని వదులు కోవటం వివేకమా?
ముందు తరాలకు తెలుగు వెలుగులను అందించటం మన కర్తవ్యం కాదా?
అందుకే
తెలుగు భాష ఆనందవాహినిని ఆస్వాదిద్దాం..
మన సంతానం ఈ నిజాన్ని తెలుసుకొని తెలుగు భాషాంతరలాల రసాస్వాదనలో జీవించే విధంగా ప్రచారాన్ని కొనసాగిద్దాం..
--
Regards
Prabhakar Rao Kotapati
No comments:
Post a Comment