Thursday, January 11, 2018

ఇకనైనా ఆపండి అమాయకుల ప్రాణాలతో చెలగాటాలను..

తప్ప తాగి కారు నడిపే ఓ మందు బాబులారా 
వినపడుతున్నాయా ఆ క్షతగాత్రుల ఆక్రందనలు 

కాళ్ళు పోయి 
ఎముకలు విరిగి 
రబ్బరు టైర్ల కింద నలిగి 
రక్తపు మడుగులో మునిగి 
రాలిపోతున్న నవ యువకులు 
గుండెను పిండి వేసే ఘోర ప్రమాదాలు
తమ వారిని పోగుట్టుకొని 
శోక సముద్రములో కుటుంబ సభ్యులు 
 

అర్ధరాత్రి వరకు అర్ధం పర్థం లేని విందులతో 
అణువణువు పాకిన అహంకారంతో 
నెత్తికెక్కిన మత్తుతో 
కళ్ళున్నా కనపడని చూపులతో 
కారెక్కి రోడ్డు మీద మీరు పడితే 
ఉత్త పుణ్యానికి ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలో

నాకేమీ కాదనుకొనే మీ అజ్ఞానము
మిమ్ములను కన్న వారికి మిగిల్చే కడుపు శోకము 
మీతో పాటు కొంతమందిని బలి తీసుకునే పైశాచికత్వము 
అన్నీ కలిసి కొనసాగుతూనే ఉంది  మీ దురాచారము. 

దిన పత్రికల నిండా మందు బాబుల ఆగడాలే 
వల్లు తెలియని  వాహన చోదకుల నిర్వాకాలే 
రోడ్లన్నీ వారు రగిల్చిన రక్తపు  మరకలే 
మీ కన్నా మేలు క్రూరమృగాలే

కళ్ళుంటే చూడండి జరుగుతున్న అనర్థాలను 
మనసుంటే అర్ధము చేసుకోండి మీరు నడిపిస్తున్న నరమేధాలను.. 

ఇకనైనా ఆపండి అమాయకుల ప్రాణాలతో చెలగాటాలను....
--



Regards
Prabhakar Rao Kotapati


Saturday, January 6, 2018

పేరు ప్రతిష్టలు సంపాదించటం సరిపోదు.. అనుక్షణం వాటిని కాపాడుకొనే అలవాట్లు కావాలి

అందలం ఎక్కడం కాదు .. 
అక్కడ కొనసాగటానికి అర్హత ఉండాలి 

అధికారం సంపాదించడం కాదు.. 
సేవా స్వభావం దానికి తోడుండాలి 

నీతులు చెప్పడం కాదు.. 
వాటిని పాటించే నిత్య వ్రతం ఉండాలి 

ప్రతిజ్ఞలు చేయటం చాలదు.. 
యిచ్చిన మాటను పాటించే పట్టుదల కావాలి 

అందరిముందు  అందంగా మాట్లాడటం కాదు.. 
తెర వెనుక తీరు నియమ నిబద్దత నిండి ఉండాలి 

మహిళలకు ఉద్యోగం ఇవ్వడం చాలదు.. 
వారికి సమాన సత్కారాలిచ్చే నిజాయితీ కావాలి 

పేరు ప్రతిష్టలు సంపాదించటం సరిపోదు.. 
అనుక్షణం వాటిని కాపాడుకొనే అలవాట్లు కావాలి
--



Regards
Prabhakar Rao Kotapati


కానీ గుర్తుంచు కొందామా ఒక నిత్య సత్యం.. మనం మారితేనే మన జాతకం మారుతుందనే నిజం!

వచ్చేస్తుంది క్రొత్త సంవత్సరం 
క్రొంగొత్త అవకాశాల సమాహారం.. 

ఎదురొచ్చే నూతన పరిచయాలు
ఎన్నెన్నో భావావేశాల బోషాణం.. 

అనుకోకుండా పుట్టుకొచ్చే సమస్యలు 
అనేక జీవన పాఠాల ప్రవాహం.. 

కాలచక్రంతో పాటు మనంపెట్టే పరుగులు 
బ్రతుకు దెరువు కోసం ఆపలేని మన పోరాటం.. 

ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూపులు 
అనుక్షణం అందుకోవాలనే మన ఆరాటం.. 

ఆనందం ఎలా వస్తుందా అనే ఆలోచనలు 
ఏదో ఎదో చేయాలనే మన ఉబలాటం.. 

మన ఇష్ట దైవానికి అనేకానేక మ్రొక్కులు 
కోరికలన్నీ నెరవేర్చుకోవాలనే మన నైజం.. 

మారిపోకుండా మనం కాపాడుకొనే అలవాట్లు 
కానీ క్రొత్త మార్పులను కోరుకొనే మన హృదయం.. 

అన్నింటికీ తెర తీస్తూ వస్తున్న మరో 365 రోజులు 
ఆనందంగా పలుకుదాము ఆహ్వానం.. 

కానీ గుర్తుంచు కొందామా ఒక నిత్య సత్యం.. 
మనం మారితేనే మన జాతకం మారుతుందనే నిజం!
--



Regards
Prabhakar Rao Kotapati


ఏదైనా సాధించాలని నిర్ణయించుకొన్నావా, అహర్నిశలు లక్ష్య సాధనకే అంకితం అవుతావు..

వంటికి చేసే మంచి గమనించావా, 
కేకు కంటే కాకరే రుచి అంటావు.. 

తిన్న తరువాత హాయిని గుర్తించావా,
మేకకూర వద్దు ఆకుకూరే కావాలి అంటావు.. 

నిజమైన చల్లదనాన్ని కోరుకుంటావా, 
కోకకోలా వదిలి కొబ్బరి బోండామే కొంటావు.. 

స్వచ్ఛమైన స్నేహం కోసం చూస్తున్నావా, 
బారు మిత్రులను వదిలి సేవా సంఘాలలో చేరతావు.. 

వత్తిడి నుండి విముక్తి పొందాలనుకొన్నావా,
పొగాకు పారవేసి మధుర ఫలాలను ఆరగిస్తావు.. 

ఆరోగ్యముగా జీవితాన్ని గడపాలనుకొంటున్నావా,
ధన దాహాన్ని ఆపుకొని యోగ సాధన ఆరంభిస్తావు.. 

విజ్ఞానాన్ని పెంచుకోవాలను కొన్నావా, 
పనికిరాని పనులు ఆపి మంచి పుస్తకాలు చదువుతావు.. 

ప్రశాంతమైన మనసుతో ఉండాలనుకొంటున్నావా,
అప్పుల జోలికి పోక ఉన్నంతలో ఉల్లాసాన్ని వెతుక్కొంటావు.. 

అసలైన ఆనందాన్ని అందుకోవాలనుకొన్నావా, 
యాంత్రిక జీవనం వదిలి ప్రకృతిని ప్రేమిస్తావు 

ఏదైనా సాధించాలని నిర్ణయించుకొన్నావా,
అహర్నిశలు లక్ష్య సాధనకే అంకితం అవుతావు..
--



Regards
Prabhakar Rao Kotapati


అయన మనకు నేర్పిన ప్రతి పాఠం పాటించటానికి తిరిగి ప్రతిజ్ఞ చేయవలిసిన శుభదినం..

తన పేరునే శకంగా మార్చుకొని 
మూర్ఖుల మార్పు కోసం జీవితాన్ని త్యాగం చేసి 
మూఢనమ్మకాల గోడలను బద్దలు చేస్తూ 
దీన జనోద్ధరనే ద్యేయంగా పనిచేసి 
తోటి మనిషిని తనలాగే చూసే మనుషుల నిర్మాణం కోసం 
మంచి అలవాట్లను ప్రతి మనిషి అలవర్చుకోవలసిన అవసరాన్ని తెలియచేసి 
విధాత సృష్టించిన సృష్టి గొప్పతనాన్ని ప్రజలందరు గుర్తించేటట్లు చేసి 
నీవు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించమని బోధించి.. 
తాను కిరాతకుల చేతిలో రక్తాన్ని చిందించి ఈ ప్రపంచమున్నంత కాలము తన ఆదర్శాలు శాశ్వతముగా ఉండేటట్లు చేసిన యేసు క్రీస్తు మహనీయుని జన్మదినం.. 

మతాలకు అతీతంగా అందరూ జరుపుకోవలసిన మహా పర్వదినం.. 

అయన మనకు నేర్పిన ప్రతి పాఠం పాటించటానికి తిరిగి ప్రతిజ్ఞ చేయవలిసిన శుభదినం..
--



Regards
Prabhakar Rao Kotapati


సమసమాజం స్థాపించాలనిఉంటే రైతు సేవలకు సరసమైన ధర అందించాలి.

అప్పు చేసి పెట్టుబడి పెట్టి  
బురద మట్టిలో కలియతిరిగి 
ఎర్రటి ఎండలో కలుపు తీసి 
పాములనుండి ప్రాణాలు కాపాడుకొని 
పురుగు మందులను వంటి నిండా పులుముకొని 
సన్న బియ్యం పంటను బక్కచిక్కిన రైతు పండిస్తే 
బిర్యానీ బువ్వ తో మజా చేసే మనకు 
ఒక్క సారి అయినా గుర్తుకొస్తున్నాడా ఆ త్యాగజీవి 

విత్తనాలు ఉరూరా వెతుక్కొని తానే కొనుగోలు చేయాలి 

మందులు ఎరువుల కోసం పెద్ద పెద్ద లైన్లలో నిలబడాలి 

పండించిన పంటను తానే మార్కెట్టుకు  చేర్చి పడి గాపులు కాయాలి 

వచ్చినంత ధరకు కిక్కురుమనకుండా అమ్ముకు పోవాలి

అందరూ రైతు కు ఏదో చేస్తాం అని చెప్పేవాళ్ళే 

చిత్త శుద్ధి తో రైతు ఋణం తీర్చుకొంటున్న వారెందరు?

తనకు కపటం తెలియదు కష్టపడటం తప్ప 
తనకు వ్యాపారం తెలియదు దళారుల చేతిలో మోసపోవటం తప్ప
తనకు రాజకీయం తెలియదు కల్లబొల్లి కబుర్లు నమ్మటం తప్ప
తనకు లాభాలు సంపాదించటం తెలియదు అప్పులను తలకెత్తుకోవటం తప్ప.. 

సమాజ సేవ చేయాలని ఉంటే ముందు రైతు కోసం ఏమైనా చేయాలి 

సమసమాజం స్థాపించాలనిఉంటే రైతు సేవలకు సరసమైన ధర అందించాలి.
--



Regards
Prabhakar Rao Kotapati


తెలుగు మహాసభలలో మన మాతృ భాషను ప్రేమతో పొగుడుతున్న అశేష జనవాహినిని చూస్తే వళ్లు పులకరిస్తున్నది..

ఉరవడిగా ఉప్పెనలా ముంచుకొస్తున్న ఆంగ్లభాషకు అడ్డుగోడ కట్టినట్లున్నది.. 

మన సంతానంతో కూడా పరాయి భాషలో సంభాషించే దుర్భరస్థితి దూరమయ్యే రోజు దగ్గరయినట్లున్నది..  

తెలుగు భాష సముచిత సింహాసనం అధిరోహించి పాలించే కాలం కనుల ముందు కనపడుతున్నది.. 

వీనుల విందైన తెలుగు భాష వింటుంటే దశాబ్దాలుగా హృదయంలో దాగిఉన్న భాషాభిమానం నృత్యం చేస్తున్నట్లున్నది..

మహా కవుల కవిత్వా కుసుమాలు వెదజల్లే వినూత్న పరిమళాలకు ప్రాంగణమంతా సుగంధ భరితమయినట్లున్నది.. 

తెలుగు భాష కీర్తిని దశ దిశలకూ వ్యాపింపచేయాలని కలలు కన్న మన పూర్వీకుల కోరిక నిజమయినట్లున్నది.. 

తెలుగు మహాసభలలో మన మాతృ భాషను ప్రేమతో పొగుడుతున్న అశేష జనవాహినిని చూస్తే వళ్లు పులకరిస్తున్నది..
--



Regards
Prabhakar Rao Kotapati


మన సంతానం ఈ నిజాన్ని తెలుసుకొని తెలుగు భాషాంతరలాల రసాస్వాదనలో జీవించే విధంగా ప్రచారాన్ని కొనసాగిద్దాం..

అంతరంగాల నుండి పెల్లుబికే ఆమృతధార తెలుగు భాష.. 

నవరసాలను అలవోకగా పలికించగల పదాల పుట్ట తెలుగు అక్షరమాల.. 

రాళ్లను కూడా కరిగించగల సమ్మోహనాస్త్రాలు తెలుగు శాస్త్రీయ గీత మాలికలు.. 

ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలనిపించే విలక్షణ కుసుమాలు తెలుగు రంగస్థల పద్యాలు.. 

తెలుగు వానిగా పుట్టడం అనేది మన పూర్వ జన్మ సుకృతం.. 

తేనెలూరే తెలుగుని మన నోటినుండి ఉచ్చరించగలగటమే మనకు దక్కిన అపూర్వ అవకాశం.. 

వినే కొద్ది వినాలనిపిస్తుంది.. 
పాడే కొద్ది పాడాలనిపిస్తుంది.. 
వ్రాసే కొద్ది వ్రాయాలని పిస్తుంది.. 
చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది.. 
తెలుగు వినడానికే జీవించాలనిపిస్తుంది.. 

 
బ్రతుకుదెరువు కోసం నేర్చుకున్న పరాయి భాషకు బానిసత్వం అవసరమా?

తెలుగు సరిగా రాని   వానికి  ఇతర భాషలు కూడా అలివి కావని  గమనించలేదా?

తెలుగు సొగసు ను ఆస్వాదించలేని మన ఆసక్తత అర్ధమవుతుందా?

తెలుగు ఘుభాళింపులకు దూరమైతే నష్టపోయే ది  మనమే అని తెలుసా?

మానస వీణ నాదాన్ని వీనులవిందుగా వినిపించగల గాన వాహినిని వదులు కోవటం వివేకమా?

ముందు తరాలకు తెలుగు వెలుగులను అందించటం మన కర్తవ్యం కాదా?

అందుకే 

తెలుగు భాష ఆనందవాహినిని ఆస్వాదిద్దాం.. 

మన సంతానం ఈ నిజాన్ని తెలుసుకొని తెలుగు భాషాంతరలాల రసాస్వాదనలో జీవించే విధంగా ప్రచారాన్ని కొనసాగిద్దాం..
--



Regards
Prabhakar Rao Kotapati


మానుకుంటే బాగుంటుంది మందుకు బానిసత్వం.. మందు వినియోగం తగ్గితే బాగుపడుతుంది భారతదేశపు భవితవ్యం..

పనిచేసి అలసిపోతే మందు.. 
పరీక్ష పాసైతే మందు.. 
ఉద్యోగమొస్తే మందు.. 
పదోన్నతి వస్తే మందు.. 
స్నేహితుడు కలిస్తే మందు.. 
విందు విందు కీ మందు.. 
పెరిగిపోతున్నది ఆ మహమ్మారి పొందు.. 

కణ కణాన్ని కోసేస్తూ అది శరీరమంతా విస్తరిస్తున్నా.. 
తనకు బానిసగా అది మార్చేసుకొంటున్నా.. 
అనేకరోగాలకు తానే  ఆది గురువుగా మారినా.. 
అది లేకుండా మనకు రోజు గడవదు.. 
మింగకపోతే మన మనసు మనలో ఉండదు. 

తాగితే ఎక్కడలేని స్వాతంత్రము వస్తుంది.. 
ఎక్కడినుండో దైర్యం ఎగిరి వస్తుంది.. 
ఆనందం పొంగి పొంగి బయటకు వస్తుంది. 
ఆ బూటకపు బాగోతాన్ని చూసి నాకు నవ్వు వస్తుంది .. 

పేద ధనిక తేడా లేదు.. 
బాధకి ఆనందానికి తేడా లేదు.. 
పెళ్ళికి విడాకులకి తేడా లేదు.. 
పుట్టుక కి చావుకి తేడా లేదు.. 
ఏ సందర్భమైనా ముందుకి మాత్రం కొదవ లేదు.. 
సాయంత్రానికి అది పడక పోతే నిద్ర లేదు.. 

తాగని వాడు పప్పు సుద్ద.. మరియు  మట్టి ముద్ద.. 
తాగే వాడు జీవిత సారాన్ని చవిచూసిన దిట్ట.. 
తాగకపోతే అన్నీ వదిలివేసిన వెంగళప్ప.. 
తాగి ఊగేవాడు మాత్రం తత్వవేత్త.. 
వాళ్ళ వర్ణనతో పంది అయిపోతుందా నంది?

ఇకనైనా ఆపుదామా ఈ స్వయంకృతం.. 
మనల్ని చూసి మంచి అలవాట్లు నేర్చుకోవాలి భావితరం .. 
మానుకుంటే బాగుంటుంది మందుకు బానిసత్వం.. 
మందు వినియోగం తగ్గితే బాగుపడుతుంది భారతదేశపు భవితవ్యం..
--



Regards
Prabhakar Rao Kotapati


ఆగుదాం.. ఆలోచిద్దాం.. ఆత్మావలోకనం చేసుకొందాం.. ఆత్మ విశ్వాసంతో అసలైన జీవితాన్ని జీవిద్దాం..

చిత్తశుద్ధితో చదువు కోవటానికి కళాశాలకు వెళ్లే విద్యార్థికి వంకర అలవాట్లు అబ్బుతాయా?

చేయబోయే పనిమీద పూర్తి అహగాహన ఉన్మ ఉద్యోగ అభ్యర్థిని అధికారి వదులు కొంటాడా?

నిర్మాణాత్మకంగా ఆలోచించే  నిజాయితీపరునికి 
నవలోకాన్ని నిర్మించటం అసాధ్యమా? 

గెలిచే మనోధైర్యమున్న మనిషికి మంచి ముహూర్తం కావాలా?

మొలిచే విత్తనాలు బండరాయిని బద్దలు కొట్టలేవా?

సుదూర ప్రాంతాలకు ఎగిరిపోయే పక్షిని ఎదురు గాలి ఆపగలదా?

నాయకత్వలక్షణాలున్న వానికి కుటుంబ ఆర్థిక స్థితి అడ్డు అవుతుందా?

విజయం సాధించాలనే తపనే విజేతల ఇంధనం కాదా?

మన కర్తవ్య లోపాలకు జాతకాన్ని నిందించి తప్పించుకుందామా?

మన అనాలోచిత నిర్ణయాలకు అనేక కారణాలను చెప్పి లోకాన్ని ఒప్పిద్దామా? 

ఆగుదాం.. 
ఆలోచిద్దాం.. 
ఆత్మావలోకనం చేసుకొందాం.. 
ఆత్మ విశ్వాసంతో అసలైన జీవితాన్ని జీవిద్దాం..
--



Regards
Prabhakar Rao Kotapati


ప్రణాళికతో ప్రయత్నిస్తే ప్రతి నిముషం విలువ కట్టలేని వజ్రం

కాలం కాలం కదిలిపోయే కాలం 
ఎవరూ ఊహించలేని ఎన్నో మార్పులకు మూలం 
ముక్కు మూసుకొని మూల కూర్చున్నా ఆగదు కాలం 
కొత్తదనమే కాలానికి ఇంధనం 

ఉపాయాలతో  ఉపయోగించుకొనే వారికి కాలమే బ్రహ్మాస్త్రం
ఏమి చేయాలో తోచక పోతే క్షణ క్షణం పెనుభారం 
కాలక్షేపాలతో గడిపేస్తే నూరేళ్ళ జీవితం నిరర్థకం 
అనుక్షణం అభ్యాసమే అనుభవాన్ని పెంచే సాధనం 

ఎంతటి చక్రవర్తయినా కాలచక్రంలో కనుమరుగు కావలసినదే 
రాగ ద్వేషాలు కక్షలు కార్పణ్యాలు కాలాగ్ని లో కరిగి పోవలసినదే 
మిగిలేది మనం చేసిన పనులు సాధించిన విజయాలు మాత్రమే 
ఎలా వినియోగించుకోవాలో తెలిసిన మనిషికి కాలం చేస్తుంది దాసోహమే 

కలలు కని వాటి కోసం అహర్నిశలు పాటు పడటమే జీవించటం 
సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాల జ్ఞానం
ఎందుకు పుట్టామో తెలియని మూర్ఖ శిఖామణికి క్షణమే యుగం
ప్రణాళికతో ప్రయత్నిస్తే ప్రతి నిముషం విలువ కట్టలేని వజ్రం
--



Regards
Prabhakar Rao Kotapati


మనము ప్రకృతి వనరులు ఉపయోగించుకోవాలి వాటి నుండి ప్రశాంతత పొందాలి కానీ పర్యావరణ కాలుష్యానికి కారణం కారాదు

మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి 
ఆత్మాభిమానం ఉండాలి 
కానీ అహంకారం ఉండరాదు 

మనలో ఇతరుల పట్ల ప్రేమ ఉండాలి 
ప్రేరణ ఉండాలి 
కానీ ప్రలోభాలు ఉండరాదు

మనకు మతం ఉండాలి 
మతాచారాలుండాలి
కానీ ఆ పేరుతో మనుష హింస పనికిరాదు 

మనము ఆనందంగా ఉండాలి
జీవితాన్ని అనుభవించాలి 
కానీ అది ఇతరులకు ఆక్రోశం కలిగించరాదు 

మనం రుచిగా తినాలి 
రసాస్వాదన చేయాలి 
కానీ అది రోగ కారకం కారాదు 

మనం ఆస్తులు సంపాదించాలి 
అంతస్తులు అధిరోహించాలి 
కానీ అవినీతి ఉండరాదు 

మనము అధికారాలు నిర్వహించాలి 
అజమాయిషీ చేయాలి 
కానీ అందులో అణిచివేత ఉండరాదు 

మనము ప్రకృతి వనరులు ఉపయోగించుకోవాలి 
వాటి నుండి ప్రశాంతత పొందాలి 
కానీ పర్యావరణ కాలుష్యానికి కారణం కారాదు
--



Regards
Prabhakar Rao Kotapati


ఈ లోకం మంచిగా మారాలని అందరికీ ఉంటుంది.. కానీ ఆ మార్పు మనతోనే మొదలు అవుతుందని తెలిసిన వారు ఎందరు?

ఏదో సాధించాలని అందరికీ ఉంటుంది..  కానీ ప్రణాళికతో ప్రయత్నించేది ఎందరు?

శుభాకాంక్షలు అందరూ చెప్తారు.. కానీ కష్టాలలో కనిపించేది ఎందరు?

విమర్శలు అందరూ చేస్తారు.. కానీ వాటిని ముందుకు నడిపించటానికి ముందు ఉండే వారు ఎందరు?

అల్లారం ఎంతో మంది పెట్టుకొంటారు.. కానీ దానిని నొక్కేయకుండా నిద్ర లేచేది ఎందరు?

ఆరోగ్యం కావాలని అందరికి ఉంటుంది.. కానీ శారీరక ధర్మాలను పొరపాటు లేకుండా పాటించేది ఎందరు?

తల్లి దండ్రులు అంటే అందరికి ప్రేమ ఉంటుంది.. కానీ వారి ఆనందం కోసం కాలాన్ని ఖర్చు పెట్టేది ఎందరు?

దేశభక్తి అందరికీ ఉంటుంది.. కానీ దేశాభివృద్ధికి పనికి వచ్చే పనులు చేసేది ఎందరు?

ప్రతిజ్ఞలు చాలా మంది చేస్తారు.. కానీ వాటిని నిజాయితీగా నిలబెట్టే వారు ఎందరు?

ఈ లోకం మంచిగా మారాలని అందరికీ ఉంటుంది.. కానీ ఆ మార్పు మనతోనే మొదలు అవుతుందని తెలిసిన వారు ఎందరు?

ఈ మాటలను చాలా మంది చదువుతారు.. కానీ ఇందులో ఉన్న అర్ధాన్ని గుర్తించి ఆచరించేది ఎందరు?
--



Regards
Prabhakar Rao Kotapati


మానవత్వాన్ని బ్రతికినంత కాలం ఆచరించి ఇతరుల జీవితాలకు విలువ కలిపేవాడే మహానుభావుడు..

అనుక్షణం ఆనందం అదే జీవితం 
అందరూ ఆమోదించేదే అసలైన ఆనందం 
నిర్మలమైన మనసే సుఖ నిద్రకు సోపానం 
చెరగని చిరునవ్వే ముఖానికి  మురిపెం 

ఫలితాలను సాధించేదే సిసలైన సాధన 
మనసుకు నచ్చేదే ఉత్సాహాన్నిచ్చే ఉద్యోగం 
స్ఫూర్తిని అందించేవాడే నిజమైన నాయకుడు 
సమస్త జీవరాసులను కాపాడటమే దగా లేని దేశభక్తి 

మంచిపనులకొరకు పురికొల్పేవాడే సరియైన స్నేహితుడు
ప్రతిరోజూ నూతన విధానాల సమీకరణే సృజన 
సర్వశక్తులను లక్ష్యం కోసం వెచ్చించటమే కృషి 
చదివిన ప్రతి పాఠాన్ని పాటించగలవాడే పట్టభద్రుడు

ధనం కన్నా అనుబంధం విలువైనదని తెలుసుకున్నవాడే ధనవంతుడు 
విజ్ఞానం అందరి మేలుకు ఉపయోగించగలిగినవాడే విజ్ఞానవేత్త 
వ్యాపారంలో లాభంకన్నా ఉద్యోగుల సంక్షేమమే ముందని పాటించేవాడే వ్యాపారవేత్త 
మానవత్వాన్ని బ్రతికినంత కాలం ఆచరించి ఇతరుల జీవితాలకు విలువ కలిపేవాడే మహానుభావుడు..
--



Regards
Prabhakar Rao Kotapati


కార్య దీక్షతో కదిలితే కావలసినది కట్టుబడక పోతుందా.. మన కలలన్నీ సాకారమయ్యే రోజు రాకుండా ఆగుతుందా?

ఆత్మ విశ్వాసముతో అడుగులు ముందుకేస్తే అందుకోలేనిది ఉంటుందా.. 
కార్య దీక్షతో కదిలితే కావలసినది కట్టుబడక పోతుందా.. 
మన కలలన్నీ సాకారమయ్యే రోజు రాకుండా  ఆగుతుందా?

చిన్న చిన్న అడుగులేస్తూ కదులుతుంటే.. 
మనసు మొత్తము లక్ష్యము పైనే లగ్నమయితే 
ఎంత దూరమైనా దగ్గరవుతుంది.. 
ఎంతటి కష్టమైనా కరిగిపోతుంది.. 

ప్రతి రోజు కొత్త విషయాలు నేర్చుకొంటుంటే
చేసిన తప్పులనే అనుభవాలుగా మార్చుకొంటుంటే 
పని చేసే ప్రదేశమే పాఠశాలవుతుంది.. 
అనుక్షణం ఆనందంతో నిండిపోతుంది.. 

ఉత్సాహాన్ని ఊపిరిగా మార్చుకొంటే 
చేయాలి అనే తపన అణువణువు అవహిస్తే.. 
మనలను అడ్డుకొనే శక్తే ఉండదు 
ఎంత పెద్ద ఎత్తయినా తల దించక తప్పదు.. 

ప్రకృతి ప్రసాదించిన సంపదను సద్వినియోగం చేసుకొంటే.. 
మన జన్మకు కారణాన్ని అన్వేషణతో అర్థంచేసుకొంటే.. 
మన విజయాలే ఈ లోకానికి ఆదర్శాలుగా మారతాయి..
మనజీవన సూత్రాలే భావితరాలకు బాటలవుతాయి..

ఆత్మ విశ్వాసముతో అడుగులు ముందుకేస్తే అందుకోలేనిది ఉంటుందా.. 
కార్య దీక్షతో కదిలితే కావలసినది కట్టుబడక పోతుందా.. 
మన కలలన్నీ సాకారమయ్యే రోజు రాకుండా  ఆగుతుందా?
--



Regards
Prabhakar Rao Kotapati


మీ స్థానాన్ని నింపటానికి కోట్ల మంది కలాంలు సిద్ధం.. మీ ఆకాంక్షలను సాధించే వరకు ఆపదు భారతీయ యువత తమ అభివృద్ధి యుద్ధం....

నింగికేగిన కలాం కిరణమా 
అగ్ని పృద్వీలను ఇచ్చిన భారత రత్నమా 

మీ కలలు మాత్రం పదిలం మా మదిలో 
మీ స్పూర్తి సూక్తుల ప్రవాహం ఆగదు మా చెవిలో

మీరు సృజించిన ఉపగ్రహ విజ్ఞానం ఉరకలెత్తుతుంది.. 
మీరు యువతకిచ్చిన దిశానిర్దేశం దేశాన్ని నడిపిస్తుంది.. 

మీరు వేసిన ప్రణాళికే దిక్సూచి మాకు 
మీ అడుగుల్లో పయనమే ఆనందం మాకు 

మిమ్ములను  చూసిన మా కనులలో కనుపాపగా మిగిలారు 
మీరు సృజించిన మా చేతులలో చైతన్యంగా ప్రవహిస్తున్నారు 

అభివృద్దే మీ ఊపిరిగా అనుక్షణం గడిపారు 
పెద్ద పెద్ద కలలు కని వాటిని సాధించటమే ప్రతి పౌరుని కర్తవ్యం అని చాటారు 

మీరు జన్మించిన ఈరోజే పర్వదినం మాకు.. 
చివరి శ్వాస వరకు దేశ సేవ చేసిన మీ జీవితమే ఆదర్శం మాకు 

మీ స్థానాన్ని నింపటానికి కోట్ల మంది కలాంలు సిద్ధం.. 
మీ ఆకాంక్షలను సాధించే వరకు ఆపదు భారతీయ యువత తమ అభివృద్ధి యుద్ధం....
--



Regards
Prabhakar Rao Kotapati


ఓర్పుతో ప్రయత్నించేవానికి ఓటమి ఎన్నడూ దరిచేరదు

అలలకు హడలిపోయి ఓడ ఒడ్డుకు ఉరకలెత్తదు 
ఓర్పుతో ప్రయత్నించేవానికి ఓటమి ఎన్నడూ దరిచేరదు 

చిట్టి చీమ చెక్కెర ముక్క నోటకరుచుకు వెళుతుంటే 
వెళ్లే దారిలో వంద మార్లు  పడుతుంది లేస్తుంది 
పడిన ప్రతిసారి నర నరాల్లో నమ్మకాన్ని నింపుకుంటుంది
గమ్యాన్ని చేరేవరకు గుండె ధైర్యంతో ముందుకే కదులుతుంది.. 
ఓర్పుతో ప్రయత్నించేవానికి ఓటమి ఎన్నడూ దరిచేరదు.. 

ముత్యాలకోసం నది అట్టడుగుకు ఎన్నో సార్లు దూకుతాడు ఈతగాడు.. 
అనేక సందర్బాలలో అభాసు పాలౌతాడు 
దొరుకుతుందనే నమ్మకం మాత్రం అతనిలో తరగదు.. 
మునిగిన ప్రతి సారి వట్టి చేతులతో  రాడు.. 
ఓర్పుతో ప్రయత్నించేవానికి ఓటమి ఎన్నడూ దరిచేరదు

ఓటమికూడా ఒక అనుభవపర్వం దానిని అంగీకిరించు.. 
పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలించు 
తలచుకున్నది చేసేవరకు మాత్రం వెనకడుగు వేయద్దు.. 
అవసరమైతే సర్వ సౌకర్యాలను త్యాగం చేయి 
ఏమీ చేయకుండానే ఫలితాలు వస్తాయా?
సాధించినది ఏమీ లేకుండా జేజేలు వినపడతాయా?

ఓర్పుతో ప్రయత్నించేవానికి ఓటమి ఎన్నడూ దరిచేరదు
--



Regards
Prabhakar Rao Kotapati


దృఢ సంకల్పానిదే చివరకు దిగ్విజయం..

గడ్డిపోచలు కలిస్తే గజాన్ని కట్టి పడేస్తాయి

చలి చీమలు చేరితే కొండ చిలువను చంపుతాయి 

నీటి చుక్కలు కలిస్తే నదులై పారుతాయి 

విడిగా ఉంటే విలువ సూన్యం అవే  కలిస్తే పుట్టేది  ఉప్పెన.. 

ఒక నీటి బిందువు కదలిక పెను తుఫానుకి మూలం 

ఒక అగ్గి రవ్వ అడవులను మసి చేసే దవానలానికి ఆధారం.. 

ఒక స్త్రీ శోకం కురుక్షేత్ర మహా సంగ్రామానికి శ్రీకారం 

అణువుల విస్ఫోటనమే అగ్నిపర్వతానికి అంకురం..

చేయి చేయి కలిస్తే పుట్టేది చైతన్యం 

మార్పు కోరుకునే మనుషులే మహా విప్లవం.. 

అడుగులను అనుసంధానం చేసుకొన్న జనమే ప్రభంజనం.. 

దృఢ సంకల్పానిదే చివరకు దిగ్విజయం..
--



Regards
Prabhakar Rao Kotapati


నీ కోసమే ఎదురు చూస్తున్న నీ కొత్త బంగారు లోకాన్ని చేరుకో.....

సమస్యలతో సమరాన్ని ఆపకు.. విశాల సముద్రములో నిన్ను దాటించే కెరటం దాగుందని తెలుసుకో.. 

ఓటమిని ఊహించుకొని ముందుగానే ఓడిపోకు.. 
ఓటమిలో దాగివుండే దిక్సూచిని గుర్తించు.. 

కష్టాలను కడతేర్చమని దేవునికి మొక్కకు.. 
ఎటువంటి సమస్య నైన ఎదిరించే గుండె దైర్యం కోసం ధ్యానించు.. 

నడవాల్సిన దూరం చూసి నాయనో అని నడక ఆపకు.. 
వెనుకకు తిరిగి నీవు నడిచి వఛ్చిన దూరము ఇచ్చే స్ఫూర్తిని అందుకో 

ప్రయత్నిస్తూ.. అడుగులో అడుగేస్తూ .. ఆపకుండా నీ ప్రయాణం కొనసాగించు.. 

నీ కోసమే ఎదురు చూస్తున్న  నీ కొత్త బంగారు లోకాన్ని చేరుకో......
--



Regards
Prabhakar Rao Kotapati


అప్పుడు తెలుస్తుంది నీకు.. అకుంఠిత దీక్షతోడుంటే సాధించలేనిది ఏమీ లేదని..

కదిలే కలలు సమారాగ్ని ని రగిలిస్తుంటే 
నిండుగా ఉన్న  ప్రణాళిక నిన్ను నడిపిస్తుంటే 
ఉరకలెత్తే ఉత్సాహం నీ దేహమంతా విస్తరిస్తుంటే
కరుడుగట్టిన కార్యదీక్ష నీ తోడుగా కదులుతుంటే 

నీ అణువణువున ఆకాంక్ష ఆక్రమించి 
నీ సర్వశక్తులు నీ నర నరాల్లో నిండిపోయి 
నీకు తెలియని ఏదో శక్తి నిన్ను నడిపిస్తున్న అనుభూతి 
అనేక దైవ శక్తులు నీకు అందుతున్న అనుభవం 

అప్పుడు తెలుస్తుంది నీకు..

అకుంఠిత దీక్షతోడుంటే సాధించలేనిది ఏమీ లేదని..
--



Regards
Prabhakar Rao Kotapati


మనుషులు తలచుకొంటే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలరని..

అలవోకగా దూడను ప్రసవించే అవును చూస్తే.. అనిపిస్తుంది.. మనుషులు గోటితో పోయేదానికి గొడ్డలి వాడతారని. 

వేపనూనె గోమూత్రం పురుగులను తగ్గించటాన్ని చూస్తే తెలుస్తుంది.. మనుషుల దురాశ దుఃఖాన్ని తెస్తుందని.. 

కాళ్ళు లేని వికలాంగురాలు ఎవరెస్ట్ ఎక్కడాన్ని చూస్తే అనిపిస్తుంది .. అన్నీ బాగున్న మనుషులు ఆత్మ విశ్వాసం లేక వెనుక పడుతున్నారని 

నిరంతరం నడుస్తూ శ్రమించే చీమలను చూస్తే అర్ధమవుతుంది.. వళ్ళు  దాచుకోవటానికి మనుషులు అలవాటు పడ్డారని 

ఎడారిలో పెరిగే ఖర్జుర చెట్టు ను చూస్తే తెలుస్తుంది.. మనుషులు తలచుకొంటే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలరని..
--



Regards
Prabhakar Rao Kotapati