నిర్మలమైన మనసుతో పలకరించు.. నీ చుట్టూ ఉన్న మనుషుల మంచితనాన్ని చూస్తావు..
స్వార్థాన్ని వదిలి వేసి సేవ చేయి.. సాగరమంత విశాలమైన ఆనందాన్ని చవి చూస్తావు..
చేసే పని మీద సంపూర్ణ ధ్యాసతో పని చేయి.. చెరిగిపోని నైపుణ్యాలను నీ సొంతం చేసుకొంటావు..
ధన సంపాదన తో సంబందంలేని మనసుకు నచ్చే పనులు చేయి.. ధగ ధగ లాడే నీ కలల ప్రపంచాన్ని చూస్తావు..
ప్రపంచపు పోకడలను వదిలి నిజాన్ని నిర్భయంగా పాటించి చూడు.. ప్రభంజనంలా నీ అడుగులలో నడిచే నవ లోకాన్ని చూస్తావు..
--
Regards
Prabhakar Rao Kotapati
No comments:
Post a Comment