పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో
మురిసెనులే మనసంతా..
మురిసెనులే మనసంతా.. ఆ వర్షపు జల్లులతో
పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో
ఎండిపోయిన మోడులన్నీ.. చిగురించేను సరికొత్త సొగసులతో
అడుగంటిపోయిన చెరువులన్నీ.. పొంగిపొరలేను కురిసే జలధారలతో
ఈ చినుకులే అమృత ధారలై .. నింపేనులే ఈ జగమంతా.. పచ్చని మొక్కలతో..
పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో
పెరిగిన ఆ పచ్చని చెట్లే.. నిండేను పక్షుల కిల కిలలతో..
పరుగెత్తే ఆ మేఘాలే .. ఆగి కలిసేను జలపాతాలతో..
జర జర పారె ఆ నదులే.. నింపేను భూమిని బంగారముతో
పొంగే పాడి పంటలే జనులకు సొంతమై..
విలసిల్లేను అందరూ సుఖ శాంతులతో..
పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో
మురిసెనులే మనసంతా..
మురిసెనులే మనసంతా.. ఆ వర్షపు జల్లులతో
పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో