సుర సుర లాడే సూర్య నారాయణుని కోపానికి కారణమేమిటో..
పచ్చనైన చెట్ల ఆచూకి కానరాలేదని క్రోధమా..
పొట్టలోని నీటిని బిడ్డల కోసం దాచే భూమి భగ భగల భావమేమిటో..
వరుణుడిచ్చే వాన నీటిని అపుతున్న ఆకాశ హర్మ్యాలపై ఆలకయిఉంటుంది..
నిండు కుండలా ఉండే మేఘాలు మొహం చాటు వేయటం వెనుక రహస్యమేమిటో..
తమకు ఊపిరి ఆడకుండా చేస్తున్న పరిశ్రమలొదిలే పొగల మీద పంతమనుకొంటాను..
అడగకుండా అన్ని రకాల ఫలాలను అందించే ఫలవృక్షాల సంతాన లేమికి జరిగిన లోపమేమిటో..
ఇంకా ఇంకా కావాలనే తొందరలో వాటికిచ్చిన రసాయనాలను జీర్ణించుకోలేని జుగుప్స కావచ్చు..
ఇదంతా చూస్తూ ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తున్న మనుషుల మూఢ నమ్మకానికి ఆధారమేమిటో..
ప్రకృతి ప్రకోపానికి తమ పనులే కారణమని తెలుసుకోలేని తత్త్వం అయిఉంటుంది..