గంజాయి విత్తు నాటితే తులసి మొలవదు..
మంచి సంకల్పం లేకపోతే మనుషులు మెచ్చుకొనే పనులు చేయలేము..
ఎడారిలో నీరు దొరకదు అనుకొంటే ఖర్జూరం బ్రతకలేదు..
ఆత్మ విశ్వాసం లేకపొతే అడుగు ముందుకు వేయలేము..
గాలొస్తే పడిపోయే పుల్లలతో అల్లటం అవసరమా అనుకుంటే పక్షి గూడు కట్టుకోలేదు..
ఓర్పు లేకపోతే అడ్డుపడే అడ్డంకులను తట్టుకొని సాగలేము..
తన బరువుకన్నా ఎక్కువ మోయటం అవసరమా అనుకొంటే చీమ ఆహారాన్ని సేకరించలేదు..
నిరంతర కృషి లేకపోతే ఆలోచనలతోనే ఆగిపోతాము..
ఆకాశంలో ఎగురుతూ క్రింద తిరిగే ఎలుకను చూడగలనా అనుకొంటే గ్రద్దకు కడుపు నిండదు..
ఏకాగ్రత తో సాగకపోతే సమున్నతమైన గమ్యాలను గమనించలేము..
విజయాన్ని సాధించిన వారికుండే ఐదు లక్షణాలు ఇవే ..
మంచి సంకల్పం.. ఆత్మ విశ్వాసం.. ఓర్పు.. నిరంతర కృషి.. ఏకాగ్రత..
No comments:
Post a Comment