నిప్పు లో ఉండే గొప్ప తనాన్ని చెప్పేది భోగి మంట
భూమాత సారాన్ని పెంచి పోషించేది గొబ్బెమ్మ
శుచి శుభ్రత ను మనకు నేర్పేది అందమైన ముగ్గు
గోసేవ ను గుర్తు చేసేది గంగిరెద్దు ఆట
పరమాత్మను పరిచయం చేసేది హరిదాసు పాట
వాయు దేవుని వేగాన్ని కళ్ళకు కట్టేది గాలిపటం
అన్నదాత అలుపెరుగని శ్రమ ఫలితం పొంగలి
ప్రకృతి తో మన విడతీయలేని బంధాన్ని తెలిపేదే సంక్రాంతి..
అందుకే ....
భూసారాన్ని బ్రతికించు కుందాం..
వాయువు యొక్క స్వచ్ఛత ని సంరక్షిద్దాం..
రైతు కష్టాన్ని గుర్తించి సహాయం చేద్దాం ..
గోవులను కాపాడుకొని పోషిద్దాం..
భాద్యత తో స్వచ్ఛ భారత్ ను నిర్మిద్దాం..
అందమైన ప్రకృతిని కాపాడటానికి అన్ని విధాలుగా సహకరిద్దాం..
No comments:
Post a Comment