Friday, January 11, 2013

అనుక్షణం నీకు ఆధారమైన ఆ దేవతా స్వరూపాన్ని ఆరాధించు అనుబందముతో ఆత్మీయతతో కృతజ్ఞతతో జీవించు....

జన్మనిచ్చి ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లి
 
తోడునిచ్చి సేవతో బాద్యత తీసుకొన్న భార్య
 
అండనిచ్చి మాటతో బలాన్ని ఇచ్చిన అక్క
 
చెలిమినిచ్చి ఆటతో ఆనందాన్ని అందించిన చెల్లి
 
ఇన్ని విదాలుగా పురుషునికి ఆధారమైన మహిళను
 
మధించి మత్తులో మునిగి వ్యధకు గురిచేస్తున్న ఓ మగ మృగామా...
ఒక్క క్షణం ఆలోచించు నీవు చేస్తున్నదేమిటో...
 
 
నీ చేతితో నీ కన్నునే పొడుచుకొంటున్నావు...
 
నీవు కూర్చున్న కొమ్మను నీవే నరుక్కొంటున్నావు..
 
సునిశితమైన మనసు, జాలి నిండిన గుండె, మధురమైన పలుకులు, కరుణ కురిసే కళ్ళు, సేవ చేసే చేతులు ...

ఇన్ని కలగలిసిన ఆ మానవతా మూర్తిని ఎలా హింసించాలనిపిస్తుంది మనిషిగా జన్మించిన నీకు..

కన్ను గానని కామంతో...వళ్ళు తెలియని విచ్చలవిడితనముతో...సృహలేని రాక్షసత్వముతో...
నీవు సాగిస్తున్న ఈ దారుణాన్ని ఆపకపోతే....

ఇక సహించబోదు ఈ ప్రపంచం...
భూస్తాపితం చేస్తుంది నిన్ను ఈ సమాజం...

ఇకనైనా కళ్ళు తెరువు...

నీ ఉనికికి కారణమై, నీ చలనానికి చేయూతై, నీ గమనానికి దిక్సూచై,
అనుక్షణం నీకు ఆధారమైన ఆ దేవతా స్వరూపాన్ని ఆరాధించు అనుబందముతో ఆత్మీయతతో కృతజ్ఞతతో జీవించు....




1 comment: