దురలవాట్లతో దారి తప్పిన బిడ్డల తో అల్లాడుతున్న నా తల్లి భారతిని బయటకు లాగాలని ఉంది ..
ఆమె పాదాలను తాకి రెండవ జాతీయోద్యమానికి ఊపిరి పోయాలని ఉంది ..
మనుషుల మనసుల లోనికి చొరబడి వారి దిశను దేశం వైపు తిప్పాలని ఉంది..
నిలువరించలేని ఉప్పెనలా ఉద్యమించి యువతను కదిలించాలని ఉంది..
సంధించిన భాణంలా చెలరేగి మంచితనం తో హృదయాలను ఆక్రమించాలని ఉంది..
ఉదయించిన ప్రభాత సూర్యుని వెలుగులా నలుదిశలా విస్తరించి..

నిజమైన సేవ గురించి ప్రచారం చేయాలని ఉంది..
ప్రతి మనిషిలో నిరుపయోగంగా పడిఉన్న విజ్ఞానాన్ని అనుసంధానం చేసి

ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే జీవ నదిలా మార్చాలని ఉంది..
క్రమశిక్షణతో నిండి ఉన్నయోగ సైనికులను ఈ పుణ్యభూమిలో నింపాలని ఉంది..
ఇతరులకు సహాయం చేయటం తప్ప సహాయం కావాలని చూసే వాళ్ళు ఉండని సమాజాన్నినిర్మించాలని ఉంది..
స్వార్ధానికి మించి ఎదిగిన మహా మనుషుల నడుమ మనసు విప్పి ఆహ్లాదంగా జీవించాలని ఉంది..
పోలీసులు అవసరములేని అసూయా ద్వేషాల జోలికి పోని అన్నిటిని అర్ధము చేసుకొని

నిత్య సంతోషులై చరించే పౌరులను దర్శించాలని ఉంది
అందుకోసమే అర్పించాలని ఉంది నా జీవితం...
అందుకోసమే అర్పించాలని ఉంది నా జీవితం...
ఆ మార్పుకోసమే ప్రయతించాలని ఉంది నిరంతరం..
ఆ రోజు కోసమే నడపాలని ఉంది రెండవ జాతీయోద్యమం..
--ప్రభాకర రావు కోటపాటి