| గుప్పు గుప్పున వదిలే పొగ ..గుండెను గునపంలా గుచ్చుతుంటే |
మత్తు అనే మాయలో నువ్వు మునిగి .. |
మనసు మీద పట్టు లేక పొగాకుకు నీవు బానిసవుతుంటే... |
తెలిసి తెలిసి జబ్బుల ఊబిలోన కూరుకుపోతున్న నిన్ను చూసి రోదిస్తున్న హృదయంతో.. |
వ్రాస్తున్నా ఈ దారుణాన్ని ఆపమంటూ ఈ విన్నపం.. |
| మనసు శక్తి తెలియక నీవు మాన లేననే ఆలోచనతో ఆ దురలవాటును కొనసాగిస్తుంటే .. |
| శారీరక సమస్యలలో మునిగిపోయి విల విల లాడే రోజున... |
ఎంత విలపించినా తిరిగి రాదు కోల్పోయిన నీ ఆరోగ్యం.. |
| నీవు వదిలే పొగ నీతో పాటు నీ తోటి వారి ఆరోగ్యాన్ని కుడా హరిస్తుందని తెలిసినా.. |
నీవు చేస్తున్న దానిని సమర్దిన్చుకొంటూ లోకము నూరు నోక్కగాలిగాననే..విజయగర్వముతో.. |
నీవు జీవించినా ..నీలోపల జరిగే వికృత వినాశానాన్ని నీవు ఆపలేవు .. |
మాటల గారడీతో మనుషులందరినీ మాయ చేసి నీవే మోసపోతున్నావు .. |
నలబై శాతం మనుషుల జబ్బులకు కారణమై , మందుల రూపంలో జాతీయ ఆదాయాన్ని హరిస్తూ ముందుకు సాగుతున్న ఆ పొగాకు భూతాన్ని ప్రోత్సాహిస్తూ బ్రమలోన బ్రతుకుతున్నావు నీవు.. |
| స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులు పుట్టిన దేశంలో జన్మించి .. |
స్వయంక్రుత అపరాదంతో పొగాకుకు బానిసై ..దేశ సంక్షోభానికి కారణం అవుతున్నావు.. |
| అనంత శక్తిని నీలో దాచుకొని గ్రహణం పట్టిన సూర్యునిలా... చీకటిలో మునిగిపోయిన.. |
నిన్ను చూస్తే జాలితో భాదతో ఆవేదనతో కరిగి పారుతుంది నా కన్నీరు.. |
| నీవు దృడంగా నిశ్చయిస్తే చేయలేని పని లేదు .. |
| నీవు సంకల్పిస్తే పరిష్కరించలేని సమస్య లేదు .. |
| ఆలోచించు , ప్రణాళిక రచించు , ఆ పొగాకు భూతం నుండి విముక్తి పొందు .. |
| ఆరోగ్యముగా జీవించు ..ఆరోగ్య భారత్ ను నిర్మించు .. |
--ప్రభాకర రావు కోటపాటి |
విద్య దాగిలేదు పుస్తకాలలో.. విద్య దాగిఉంది మానవుల మస్తాకాలలో...... దాగి ఉన్న ఆ విద్యను వెలికితీసి మేల్కొలిపే ప్రయత్నమే నా ఈ యజ్ఞం.......
Thursday, March 15, 2012
ఆలోచించు , ప్రణాళిక రచించు , ఆ పొగాకు భూతం నుండి విముక్తి పొందు ..పొగాకు
Subscribe to:
Posts (Atom)
