కలలు కనండి, నాయకులుగా ఎదగండి,
కన్నీళ్లు తుడవండి , అర్ధవంతంగా జీవించండి.. పుట్టాము పెరిగాము తిన్నాము తిరిగాము
గడిపాము గతించిపోయాము..ఇదేనా జీవితము
కాదు కాదు అంతకు మించినది ఏదో ఉంది..
ఈ దేశ నడకను మార్చగల శక్తి నీ దగ్గర ఉంది ..
స్వార్దమే పరమావది కాదు ..
నీవు కోర్కెల బావివి కాదు ..
నిన్ను నీవు నియంత్రించుకోగల శక్తి నీకుంది...
పదిమందికి ఆదర్శము కాగల స్పూర్తి నీలో ఉంది ..
పనికిరాని పనులు తగ్గించు ..
వ్యర్ద వాదనలు కట్టిపెట్టు ..
చేతలు లేని మాటలు వద్దు వద్దు ..
దారి తప్పుతుంది భారత జాతి ..
తరిగిపోతుంది రోజు రోజుకు నీతి ..
మారకపోతే మనకు నాశనమే గతి ..
డబ్బు కాదు, సంపద కాదు
ఆస్తులు కాదు, ఐశ్వర్యము కాదు..
కావాలి నీ సమయం ..
కావాలి నీ అంకిత భావం ..
జాతీయ సమస్యలను పరిష్కరించగల నీ చాతుర్యం ..
ఉవ్వెత్తున లేచే ఉప్పెనలా మారు ..
కుళ్ళును కత్తిరించే ఖడ్గంగా మారు ..
మార్పును తెచ్చే మృదంగంగా మారు ..
నీకోసం నీకోసమే నీలాంటి నాయకులకోసమే..
ఎదురు చూస్తుంది ఈ భరతజాతి ..
సందిగ్దం వదిలిపెట్టు ..
సారంశం గ్రహించు..
అనుక్షణం ప్రయత్నించు ..
అనవసరపు ఆకర్షణలు, సమయ దుర్వినియోగము,
ప్రకృతి విద్వంసము మరియు పరహింస నివారించు...
భరత జాతి ముద్దు బిడ్డగా మార్పుచెందు...
అభివృద్ధి చెందిన భారత దేశాన్ని సాధించు....
--ప్రభాకర రావు కోటపాటి


No comments:
Post a Comment