మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి

ఇదే మహా ప్రస్థానం ఇదే మహా ప్రస్థానం జీవిత పధాన సమతా గమ్యం చేరగా
ఇదే మహా ప్రస్థానం భారత జనాల భాదల గాధలు మారగా
పదండి పోదాం కనపడలేదా పవిత్ర సుందర నవోదయం

దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు
బాటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి
ప్రజా విరోధుల పనిపట్టగా ప్రతిజ్ఞ చేస్తూ పదండి ముందుకు
ధర్మ విదూరుల దానవ రాజ్యం ద్వంసం చేస్తూ పదండి ముందుకు
కనపడలేదా మరోప్రపంచపు కణ కణ మండే త్రేతాగ్ని

ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి
నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి
హరోం హరోం హర హర హర హరోం హర హరా అని కదలండి
మరోప్రపంచపు కంచు నగారా విరామమెరుగక మ్రోగింది
సల సల కాగే చమురా కాదిది కాదిది ఉష్ణ రక్త కాసారం...యువ చైతన్య వికాసం
కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగ ధగలు
ఎర్ర బావుటా నిగ నిగలు హోమ జ్యాలల భుగ భుగలు

ఇది మరోప్రపంచపు మంచితనానికి మానవజాతి మహా ప్రస్థానం
మహా ప్రస్థానం....మహా ప్రస్థానం
- ---మహా కవి శ్రీ శ్రీ

చీకటి శక్తుల పీకలు నులిమే వెలుతురువైపు మహా ప్రస్థానం
దోపిడీ బుద్దుల తుదముట్టించే న్యాయం వైపు మహా ప్రస్థానంఇది మరోప్రపంచపు మంచితనానికి మానవజాతి మహా ప్రస్థానం
మహా ప్రస్థానం....మహా ప్రస్థానం
- ---మహా కవి శ్రీ శ్రీ
No comments:
Post a Comment