Thursday, December 29, 2011

త్రాగిపడేసిన ప్రతి సీసా నిన్ను ఊడ్చుకు పోయే ఒక ఉప్పెన ..





త్రాగిపడేసిన ప్రతి  సీసా  నిన్ను  ఊడ్చుకు  పోయే  ఒక  ఉప్పెన ..
మత్తులో  మునిగి  తేలిన  ప్రతి  ఘడియ  నిన్ను  గాయపరిచే  ఒక గాలివాన..
విషాన్ని  సేవించి  వేడుక  చేసుకొంటున్నావు.. 
నీ  చేతులతో  నీ  సమాధి నిర్మించుకొంటున్నావు ..
కంప్యూటర్ ను  నడపటం  నల్లేరు మీద నడక  నీకు ..
కానీ  నీ  శరీరంలో  జరిగే  మార్పు  నీ  ఆలోచనకు  అందని  ఆక్రోశం ..
అరుస్తున్నాయి  నీ  అవయవాలు  ఆ  రసాయన రాక్షసత్వానికి ..
క్రుశిస్తున్నాయి నీ  జవసత్వాలు  ఈ  క్రమశిక్షణ నశించిన  జీవనశైలికి..
మనుషుల క్రూరత్వం  ఆ  మద్యం  ఫలితం...
ప్రమాదాలు  ఆ  ఆల్కహాల్  కు  అనుబంధం..
అబివృద్దికి  ఆటంకం...పేదరికానికి  దగ్గర  మార్గం.. 
తగాదాలకు  తరగని ప్రోత్సాహం..
వేలం వెర్రిగా మారుతుంది ఆ  మహమ్మారి పానీయం..
జాతి  నాశనానికి  కట్టుబడింది  ఈ దుర్వాసన మారి ..
దేవుడిచ్చిన  ఆ  విజ్ఞతను ఉపయోగించు  ..
జరుగుతున్న  ఈ వినాశనాన్ని నిలువరించు ..
నీవు  కనులు మూసుకున్నాముంచుకొచ్చే  జాతి  విపత్తు  ఆగదు ..
నీ  బాద్యతను విస్మరించి నీ  తాత్కాలిక ఆనందము వైపు నడుస్తున్నావు..
ఆదర్శాన్ని  వదిలి  ఆ  బడబాగ్నిని  దిగుమతి  చేసుకొంటున్నావు..
ఎన్నో  సమస్యలు  ఆ  మాయలాడి  చలువ ..
అంచనాకు అందని ఆరోగ్యనష్టం ఆ  అసహ్యరూపిని  దీవెన ..
నీ  ముందున్నాయి  ఎన్నో  బాద్త్యతలు .. 
నిన్ను  చూసి  నేర్చుకోవాలి  నీ  ముందు  తరాలు ..
ఇకనైనా  ఆపు  ఈ  గొర్రెల  మంద  ధోరణిని ..
కన్నులు  విప్పి  అనుసరించు ఆ  అసలైన  ఆదర్శ ప్రాయమైన వినోద  విదానాలను..
ఆరోగ్యము ఆహ్లాదము ఆనందము ఇచ్చే అలవాట్లను పాటించు....
ఆదర్శముగా జీవించు...

Tuesday, December 6, 2011

కలిసిఉందాం ఎల్లకాలం చెదరిపోని క్రీడా స్పూర్తితో......


ఇది ఒక ఆనంద పర్వదినం
ఉద్యోగులు చిన్నపిల్లలైన క్షణం
నీవు ఇంకా శక్తివంతుడివి అని తెలియ చేసే రణం
అందరూ గెలుపు రుచులను చవిచూడాలని తహ తహ లాడే పోరాటం

ఎందుకు ఆడతాము ఈ ఆటలు...
గెలుపు కోసమా...గాయ పరుచుకోవటం కోసమా...
పోట్లాటల కోసమా...పెనుగులాటల కోసమా....

కాదు...ఎంత మాత్రమూ కాదు.....మరి ఎందుకోసం....

ఆనందం కోసం...ఆహ్లాదం కోసం...
ఆరోగ్యం కోసం....ఆసక్తిని పెంచుకోవటం కోసం...

ఇటువంటి సౌకర్యం ఏ కంపనీ లోనైనా ఉందా....
ఇంత సౌలభ్యం మరెక్కడైనా సాద్యమౌతుందా....

లేదు..ఎక్కడా లేదు...అలా ఎందుకు లేదు....

మనం నిర్మించుకున్న మన కంపెనీ ఒక ప్రత్యేకం...
మనందరం నడిపిస్తున్నఈ క్రీడా సంబరాలు ఒక ఆనంద సద్రుస్యం...

మరెవ్వరూ జరుపలేనివి ఇటువంటి వినూత్నవినోదాలు
మనకే సాద్యమైనవి ఈ అంబరాన్నంటే అసామాన్య క్రీడా పోటీలు...

నిలిపి ఉంచుకుందాము ఈ నిరంతర స్పూర్తి స్పందనను....
కలిసి పాడుకుందాము ఈ ఆత్మీయ ఉద్బోధ ఉత్సాహ గీతాలను... 

జీవిద్దాం కలకాలం నిత్య నూతన యవ్వనంతో......
కలిసిఉందాం ఎల్లకాలం చెదరిపోని క్రీడా స్పూర్తితో......