నమ్మకద్రోహి నాయకుడు కాలేడు
వెన్నుపోటుదారుడు విశ్రాంతిగా ఉండలేడు నాయకత్వమంటే మనుషులమీద ఆదిపత్యంకాదు
అధికారమంటే ఇతరులను అణచినడిచే ఆట కాదు
సహాయకుల సంక్షేమంకోసం పాటుపడేవాడే నిజమైన నాయకుడు
తనతోటివారి అబివ్రుద్దిని ఆశించేవాడే మనసున్నమనిషి
విచక్షణాయుక్తంగా విధులను నిర్వహించేవాడే నిజమైన నిర్వాహకుడు
స్వార్దరహిత కర్తవ్యనిర్వహణ చేయువాడే సకలజనుల స్నేహితుడు
చాటుమాటు చాడీలతో కుట్ర పూరిత చేష్టలతో నసించేది అవి నడిపేవాడే
ఇతరుల గురించి దుస్ప్రచారము చేయువానికి మిగిలేది దుష్ట అనుభవాలే
పనిగట్టుకొని ఇతరులను నష్ట పరచాలని చూసేవాడు నడిచేది నష్టాల ఊబిలోనికే
మంచివారికి అసూయతో చేడుచేయ ప్రయత్నించువానికి మిగిలేది మానసిక వ్యధ మాత్రమే
ఈ ప్రకృతి ఒక పెద్ద అద్దము వంటిది
ఈ సృష్టి ఒక విచిత్ర వినోదశాల
ఈ లోకము ఒక అలౌకిక ఆదార సహితము
ఈ జన్మ ఒక జ్యోతి స్వరూపము
నీవు ఏది ఇస్తావో అదే పొందుతావు
నీ నడక ఆదారంగానే నీ గమ్యము
నీ ఆలోచనలే నీ జీవిత అనుభవాలు
నీ ప్రవర్తన ఫలితమే నీ కీర్తి ప్రతిష్టలు
నీకు మిగిలేది నీవు ఈ ప్రపంచానికి చేసిన మేలు మాత్రమే.......

No comments:
Post a Comment