Sunday, October 23, 2011

నిలిచి గెలువరా నాయకుడా....


ఆశేతు హిమాచలం ఈ దేశం

అనంత సుందరం మన భారతదేశం

తెలుసుకోరా తమ్ముడా

నిలిచి గెలువరా నాయకుడా

ఈ భూమిలోన ఉంది అద్బుతాలస్రుష్టి

ఈ నేలలోన పండు షడ్రుచుల పుష్టి

దారి తప్పుతున్నావు కట్టుబానిసవుతున్నావు

దురలవాట్ల ధౌర్భల్యముతో దిగజారిపోతున్నావు
సిగపట్ల దోరణితో ఒంటరిగా మారుతున్నావు

అలోచనలేదు దేశాభివ్రుద్ది గురించి

మనసులేదు సమసమాజ స్థాపనగురించి

తలచినదంతా సాదించవచ్చును ఈ పవిత్రభూమిలో
సంత్రుప్తిగా జీవించవచ్చును ఈ అనంత ఆనందక్షేత్రంలో
ఎక్కడా లేనన్ని వింతలు వర్ణణకు అందని కళాక్రుతులు
ఏ దేశంలోనైనా ఉంటాయా ఇన్ని వైవిద్య భరిత ఆకర్షణలు

ఏ ప్రాంతములోనైనా వింటామా ఇన్ని వీనులవిందైన సరిగమలు

అడుగడుగునా అంతులేని పచ్చదనం...సస్యశామలం చేసే నదీజాలం

ఎవరూ కొల్లగొట్టలేని విలువైన భాండాగారం...

గుర్తించలేకపొతున్నావు నీ చుట్టూ ఉన్న సంపద...
అందుకోలేకపోతున్నావు ఆ అమ్రుతధార...

నాగరికత పేరుతో నష్టదాయక ధోరణి...

సాంఘిక సంబందాల మాటున వినాశనకారక విశ్రుంఖలత్యం...
దర్మకార్యానువర్తులు భలవంతులు మనపూర్వీకులు
అనుక్షణం ఆచరించారు నిర్మాణాత్మకమైన ఆలోచనలు
నీతిని నిలబెట్టారు....ఈ దేశాన్ని పునీతం చేశారు

కలలు కని కదిలి కదిలి వస్తున్నారు...విదేశేయులు
నేర్చుకోవటానికి మన యోగ ద్యాన వేదాంత విలువలు
మనకు తెలియటము లేదు ఆ విద్య విలువ...
ఉపయోగించుకోలేకపోతున్నాము ఆ అసామాన్య కానుక..

ఏది నిజమో తెలుసుకొనే శక్తి నశించిపోతుంది...
ఏలా బ్రతకాలో యోచించే యుక్తి తరగిపోతుంది...
పాశ్చాత్య పోకడలపై మోజులు....

ఈ దేశ భవిష్యత్తు పై ముసురుతున్న నీలినీడలు..

అనవసరమైన కోరికలతో కోరితెచ్చుకొనే కష్టాలు
ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలనే అలోచనలు...

ఇకనైనా తెలుసుకోవాలి మనం....
నాయకులమై నడిపించాలి మనం...

సామాజిక స్రుహకావాలి... బాధ్యతెరిగి బ్రతకాలి...
కళలు ఉట్టిపడే కనులు మిరిమిట్లు గొలిపే కట్టడాలు....
సంబ్రమాస్చర్యాలకు లోనౌతున్నారు వాటిని చుసిన యాత్రికులు...

వట్టిచేతులతో నిర్మించారు మన తాత ముత్తాతలు...
ప్రతి కట్టడం నిరంతరశ్రమ పట్టుదల త్యాగాల ఫలితం..

మనమే నిలబెట్టాలి వారి పేరు ప్రతిష్ట...

నిరూపించాలి మనం ఈ దేశ ఘనాఘనా పటిమ...

ఈ దేశములో లేనిది లేదు....మన మానసిక ద్రుడత్వము తప్ప...
మనకు వేరొక కర్తవ్యము లేదు...భారతదేశ సమగ్రాభివ్రుద్ది తప్ప.....

దురలవాట్లను జయించు....నాయకత్వము వహించు.....

భారతీయుల పరివర్తనకు ఉపక్రమించు...

ఈ పవిత్రభూమిలో జన్మించినందుకు నీ మాత్రుభూమి ఋణం చెల్లించు...


                                         ------ప్రభాకర రావు కోటపాటి