మానవత్వమే మతముగా జీవించు
ఐకమత్యమే బలమని భావించు
తోటి మనిషిని హింసించి పూజించేవి పూజలా
నీ సోదరుని నిర్జించి నిలపెట్టేవి నీతులా
కావు కావు అవి ఎన్నటికి సాగలేవు
అహింస ఆదరణ ఆప్యాతలే అయన స్వరూపాలు
సామరస్యం సహ్రుదయం సేవాభావాలే దేవుని చేరే మార్గాలు
మాయ కాకు మోసపోకు మతొన్మాదుల ప్రలోభాలకు
రసమయం రాగయుక్తం రహస్యసహితం అయన సృష్ఠి
ప్రేమమయం ప్రకాశయుక్తం ప్రేరణపూరితం దేవుని ప్రవృత్తి
సాద్యమా సత్యమా ఇన్నిరకాల మతాలు
నిరాకారుడు నిరంతర శక్తి స్వరూపుడు నిర్వహకుడు ఆ పరమాత్మ
కరుణామయుడు కాంతికారకుడు కళాకారుడు ఆ దైవాత్మ
ప్రేరేపిస్తాడా ప్రొత్సాహిస్తాడా హింసకొరకు....
అసాధ్యం అసంభవం......
మనిషిని గౌరవించటమే మతం
మానవత్వం ఆవిష్కరించటమే ఆ దేవుని అభిమతం
అన్నిమతాలకు అధినేత ఒక్కడే...
అన్ని పూజలకు స్వీకరించేది ఆయనే
విసర్జించు విభేదాలను....
సాధించు సర్వమానవ సమైక్యతను!!!!!
------ప్రభాకర రావు కోటపాటి

No comments:
Post a Comment