గుర్తించాలి నీవు సమాజములోన అంతర్భాగముగా
అధ్యయనంచేయాలి సామాజిక సమస్యలను నిగూఢముగా
ప్రయత్నించాలి గ్రామసమస్యలను పరిష్కరించే దిశగా
నడిపించాలి నీతోటివారిని అభివ్రుద్దిపదములో భాగముగా
కలిగిఉండాలి సేవాభావమును ఉత్తమమానవీయ లక్షణముగా
మరిచిపోవాలి ధనసంపాదనను ప్రాదమికలక్ష్యముగా
వెలిగించాలి నీవిఙ్ఞానశక్తులను భాదితులదిశానిర్దేశాలుగా
పెంపొందించాలి వ్రుక్షజాతిని విస్త్రుతముగా
పరివర్తనచేయాలి నీవ్యక్తిత్వబలమును ఒకసమ్మోహనశక్తిగా
భావించాలి నీతోటివారిసమస్యలను నీభాద్యతగా
కదలాలి ఏకాగ్రచిత్తమున సేవాసైనికునిగా
ప్రేరేపించాలి సోమరిపోతులను లక్ష్యబద్దజీవులుగా
రూపొందించాలి అభివ్రుద్దిప్రణాలికలను నిశితముగా
ప్రేమించాలి సర్వజనసమూహములను సోదరసమానముగా
తీర్చిదిద్దాలి యువకులను సమసమాజనాయకులుగా
జీవించాలి మానవసేవయే మాధవసేవగా
------ప్రభాకర రావు కోటపాటి

No comments:
Post a Comment