ఏమా ప్రేమామృతము
ఏమా ఆనందసందోహము
ఏమా అనుభందబాందవ్యము
ఏమా పవిత్రస్నేహము
హ్రుదయము ద్రవించింది
ఉత్సాహము ఉప్పెనయింది
ప్రాయము బాల్యమయింది
జీవితము ధన్యమయింది
ఆ చిన్నారులు చూపించే చలనశక్తి తో
ఆ బాలలు ప్ర దర్షించే ప్రజ్ఞాశక్తి తో
ఆ విద్యార్దులు ఆవిష్కరించే అనురక్తి తో
ఆ భావిపౌరులు పలుకరించే పరమభక్తి తో
అన్నా అని కొందరు
అంకుల్ అని కొందరు
సార్ అని కొందరు
ఓహో అని అందరు
మనస్సుని తట్టి కదిలించారు
ఉషస్సుని లేపి ప్రోత్సహించారు
తేజస్సుని చూపి తరింపచేసారు
శ్రేయస్సుని కోరి దీవించారు
ఏమీకాను వారికి నేను
తొలిసారి చూసారు నన్ను
అడ్డుకాలేదు అవేవి వారికి
తెలిసింది ఒక్కటే ఆప్యాయత
ఆడమంటే ఆపాదకమస్తము ఆకర్షించారు
పాడమంటే పదామృతము కురిపించారు
పనిచేయమంటే పరిపూర్ణతత్వము చూపించారు
మొక్కలునాటమంటే హర్శాతిరేఖము వర్షించారు
భావిభారతికి అభ్యుదయ జ్యోతులు వారు
మనజాతికి పూర్ణోదయ కాంతులు వారు
స్వర్ణ భారతికి ఉషోదయ స్ఫూర్తులు వారు
మనసమాజానికి అరుణోదయ హారతులు వారు
లేదు వారివద్ద ధనభలము కానీవారు ఆనందగనులు
లేరు వారిచెంత రక్తసంబందీకులు కానీవారు సర్వస్వతంత్రులు
లేవు వారికి విస్త్రుతదుస్తులు కానీవారు వినయసంపన్నులు
లభించవు వారికి అనంతాహారములు కానీవారు నటరాజస్వరూపులు
గడపాలనిపిస్తుంది అన్నివేళలా వారి సాంగత్యములో
నడవాలనిపిస్తుంది ఎల్లవేళలా వారి నాయకత్వములో
ఉండిపోవాలనిపిస్తుంది సర్వవేళలా వారి సహచర్యములో
సమర్పించాలనిపిస్తుంది జీవితాలను వారి సేవలో
-------------------------------ప్రభాకర రావు కోటపాటి
No comments:
Post a Comment